సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జమ్మూ కాశ్మీర్ లో జిల్లా స్థాయి పాలనా సూచీ ఉండాలి: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


25 డిసెంబర్ 2021 న ప్రారంభించిన సుపరిపాలన సూచిక 2021 నమూనాలో జిల్లా సుపరిపాలన సూచిక (డిజిజిఐ)

పూర్తయిన రంగాలు , సూచికలను ఖరారు చేయడంలో విస్తృతమైన సంప్రదింపులు

10 సెక్టార్లలో 58 ఇండికేటర్ల పంపిణీ తో జమ్మూ కాశ్మీర్ జిల్లాల్లో పాలన స్థితిని అంచనా వేయడంలో జె అండ్ కె డిజిజిఐ ఒక ప్రత్యేక ప్రక్రియ: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 02 JAN 2022 5:17PM by PIB Hyderabad

జమ్మూ కాశ్మీర్ త్వరలో జిల్లా స్థాయి సుపరిపాలన సూచికను కలిగి ఉన్న దేశంలో మొదటి కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుంది.

 

కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్ (డి  ఏ ఆర్ పి జి)కి కొత్తగా నియమితులైన సెక్రటరీ, వి. శ్రీనివాస్ నుంచి  ఒక నవీకరణను స్వీకరించిన తర్వాత కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ (స్వతంత్ర బాధ్యత) మంత్రి, ఎర్త్ సైన్సెస్ సహాయ (స్వతంత్ర బాధ్యత) మంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయం సహాయ మంత్రి, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ , స్పేస్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయం తెలిపారు. జమ్ము కాశ్మీర్ లో కేంద్రం జిల్లా గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ (డి జి జి ఐ)ని ఏర్పాటు చేస్తుందని , పరిపాలనా సంస్కరణలు , ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఎ ఆర్ పి జి) ఈ పనిని నిర్వహిస్తుందని చెప్పారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సిజిజి) హైదరాబాద్ సాంకేతిక మద్దతుతో ప్రతిపాదిత ఇండెక్స్ ఫ్రేమ్ వర్క్ ఖరారు అయింది.

 

దేశంలోని ఇతర రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలలో అనుసరించే ఉత్తమ పాలనా విధానాలే   జమ్మూ కాశ్మీర్ లో ప్రతిబింబించాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ అభిమతమని కేంద్ర మంత్రి అన్నారు.

చాలా కాలంగా కొన్ని రాజ్యాంగ, పరిపాలనా పరమైన అడ్డంకుల ఫలితంగా జమ్మూ కాశ్మీర్ లో డివోపిటి, ఎఆర్ పిజి కేంద్ర నిబంధనలు  అనేకం వర్తించ లేదని, అయితే గత రెండు సంవత్సరాలుగా పని సంస్కృతిని మార్చడానికి, "గరిష్ట పాలన- కనీస ప్రభుత్వం ‘’మంత్రాన్ని అనుసరించడానికి వేగవంతమైన ప్రయత్నం జరిగిందని ఆయన అన్నారు.  ఇది మోదీ ప్రభుత్వం 2014 లో అధికారం లోకి వచ్చినప్పటి నుంచి  కేంద్రం , రాష్ట్రాలకు  ఈ మంత్రం మార్గదర్శక సూత్రంగా ఉంది.

 

జిల్లా స్థాయిలో సుపరిపాలన సూచిక జమ్మూ కాశ్మీర్ లోని 20 జిల్లాల్లో ప్రతి జిల్లా సకాలం లో కార్యాలయ ఫైళ్ల పరిష్కారం, పారదర్శకత పెరగడం, జవాబుదారీతనం పెరగడం ,పౌరుల భాగస్వామ్యం పెరగడం ద్వారా

దేశం లోని కొన్ని ఉత్తమ నిర్వహణ జిల్లాల స్థాయికి ఎదగడానికి వీలు కల్పిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ సుపరిపాలన విధానాల lను తహసీల్ , బ్లాక్ స్థాయి వరకు ముందుకు తీసుకెళ్ల డం తదుపరి చర్య  అని ఆయన చెప్పారు.

డిజిజిఐ ఫ్రేమ్ వర్క్ లో వ్యవసాయం, దాని  అనుబంధ రంగం, వాణిజ్యం , పరిశ్రమ, మానవ వనరుల అభివృద్ధి, ప్రజారోగ్యం, పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ యుటిలిటీస్, ఎకనామిక్ గవర్నెన్స్, వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్, పబ్లిక్ సేఫ్టీ & జ్యుడీషియరీ , సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ వంటి 10 రంగాలలో పంపిణీ చేయబడ్డ అభివృద్ధి , జిల్లా పరిపాలన కు సంబంధించిన విభిన్న అంశాల నుంచి తీసుకున్న 58 ఇండికేటర్ లు ఉన్నాయి.

 

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ జిల్లా అధికారులు, విద్యావేత్తలు, విషయ నిపుణులు మొదలైన వారితో వరుస సంప్రదింపుల తరువాత ఈ సూచికల ను  ఖరారు చేసారు. ప్రామాణికమైన ప్రచురితమైన డేటా , ఇతర కీలక సూత్రాల లభ్యతను పరిశీలిస్తే, సూచికల సెట్ 135 నుండి 58 వరకు గల పెద్ద జాబితా నుండి ఖరారు చేయబడింది.

 

ఇండెక్స్ , ర్యాంక్ ను లెక్కించడానికి, ఖరారు చేసిన 58 సూచికల ఆధారంగా జిల్లాల పనితీరుపై, డేటా సేకరణ యొక్క విస్తృతమైన వ్యాయామం తరువాత కఠినమైన డేటా శానిటైజేషన్ చేపట్టబడింది

 

ఇండెక్స్ ,ర్యాంక్‌ను గణించడానికి  ఖరారు చేసిన 58 సూచికల ఆధారంగా జిల్లాలు- వాటి  పనితీరుపై, కఠినతరమైన డేటా వడబోట తో విస్తృతమైన డేటా సేకరణ ప్రక్రియ జరిగింది. ప్రామాణిక , పరీక్షించిన డేటా సాధారణీకరణ ,స్కోరింగ్ పద్ధతులను ఉపయోగించి తుది సూచిక గణన ప్రక్రియ జరుగుతోంది. దీని ఫలితంగా డివిజన్ల వారీగా జిల్లాల వారీగా ర్యాంకులు  బయటకు వస్తాయి. సంపూర్ణ 10 సెక్టార్ల ఆధారంగా జిల్లాల సమగ్ర ర్యాంక్ ఉంటుంది, డిజిజిఐ సూచిక వారీగా జిల్లాల పనితీరుపై ఒక విండోను కూడా అందిస్తుంది.

***



(Release ID: 1787006) Visitor Counter : 206


Read this release in: English , Urdu , Hindi