మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో జరుగుతున్న “హునార్ హాత్” 35వ ఎడిషన్ లో దేశంలోని 30కి పైగా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల నుండి 700 మందికి పైగా కళాకారులు, హస్తకళాకారులు పాల్గొన్నారు : కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
హస్త కళాకారులు, ఇతర కళాకారుల స్వదేశీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా ప్రజలు వారిని ప్రోత్సహించారు : శ్రీ నఖ్వీ
"హునార్ హాత్" ను సందర్శించడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని, కరోనా నుండి ముందు జాగ్రత్తగా 31.12.2021 తేదీ మధ్యాహ్నం నుండి 35వ “హునార్ హాత్” ని ముగించాలని నిర్ణయించడం జరిగింది : శ్రీ నఖ్వీ
Posted On:
30 DEC 2021 4:02PM by PIB Hyderabad
"వోకల్ ఫర్ లోకల్" మరియు "స్వదేశీ-సే-స్వావలంబన్" అనే ఇతివృత్తంతో, న్యూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న “హునార్ హాత్” 35వ ఎడిషన్ లో దేశంలోని 30 కి పైగా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల నుండి 700 మందికి పైగా కళాకారులు, హస్తకళాకారులు పాల్గొన్నట్లు, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలియజేశారు.
ఈ రోజు "హునార్ హాత్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీ నఖ్వీ మాట్లాడుతూ, అస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, లడఖ్, జమ్మూ-కశ్మీర్, పంజాబ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, నాగాలాండ్, మేఘాలయ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్, గోవా, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, చండీగఢ్, హర్యానా లతో సహా, 30 కంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సున్నితమైన, సొగసైన స్వదేశీ హస్త కళాకృతులు ఈ "హునార్ హాత్"లో అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.
"వోకల్ ఫర్ లోకల్" యొక్క "జనాదరణ పొందిన, పరిపూర్ణమైన బ్రాండ్" అయిన "హునార్ హాత్" ను, 2021 డిసెంబర్, 23వ తేదీన, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ మరియు కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, మాజీ కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యుడు డాక్టర్ హర్షవర్ధన్, పార్లమెంటు సభ్యులు శ్రీ మనోజ్ తివారీ, శ్రీ పర్వేష్ సాహిబ్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
శ్రీ నఖ్వీ మాట్లాడుతూ, “బావర్చిఖానా”లో లభించే దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాంప్రదాయ వంటకాలను ఆస్వాదించడంతో పాటు, సందర్శకులు విశ్వకర్మ వాటిక, సాంప్రదాయ సర్కస్, దేశంలోని ప్రసిద్ధ కళాకారుల వివిధ సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలను కూడా వీక్షించారని, తెలియజేశారు.
హస్త కళాకారులు, ఇతర కళాకారుల స్వదేశీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా ప్రజలు వారిని ప్రోత్సహించారని, శ్రీ నఖ్వీ పేర్కొన్నారు.
"హునార్ హాత్" అనేది భారతీయ కళ, నైపుణ్యాల వారసత్వ "రక్షణ, పరిరక్షణ, ప్రచారానికి ఒక పరిపూర్ణ వేదిక" అని మంత్రి వ్యాఖ్యానించారు. “విశ్వకర్మ-విరాసత్-కా-వికాస్” అనే “3 వి ల” “శక్తివంతమైన పరిపూర్ణ వేదిక” గా, “హునార్ హాత్” నిరూపించబడింది. ప్రభుత్వం, భారత దేశ కళ, హస్తకళల వారసత్వాన్ని రక్షించడం తో పాటు, ప్రభుత్వం, స్వదేశీ ఉత్పత్తులకు కొత్త శక్తి, మార్కెట్, ఇతర అవకాశాలను కూడా అందించింది.
గత 6 సంవత్సరాల్లో, 7 లక్షల 50 వేల మందికి పైగా హస్తకళాకారులు, ఇతర కళాకారులు, వారితో సంబంధం ఉన్న వ్యక్తులకు “హునార్ హాత్” ద్వారా ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించినట్లు, శ్రీ నఖ్వీ పేర్కొన్నారు. వారిలో 50 శాతానికి పైగా మహిళా కళాకారులు ఉన్నారు.
ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతలను నిర్ధారించడానికి "హునార్ హాత్" వద్ద తగిన, అవసరమైన ఏర్పాట్లు చేశామని శ్రీ నఖ్వీ చెప్పారు. "హునార్ హాత్"లో ప్రవేశానికి మాస్క్ తప్పనిసరి చేయడంతో పాటు, సందర్శకులకు మాస్క్ లు కూడా ఉచితంగా అందించారు. 350 మందికి పైగా శుభ్రపరిచే కార్మికులు, 200 మందికి పైగా భద్రతా సిబ్బంది "హునార్ హాత్" ప్రాంగణంలో ఆరోగ్యకరమైన వాతావరణం, పరిశుభ్రత, భద్రతలను నిర్వహించడానికి నియమించడం జరిగింది. ప్రదర్శన ప్రాంతానికి సమీపంలో ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. దీనిని నిర్వహించడానికి 50 మందితో ఒక బృందాన్ని నియమించారు. "హునార్ హాత్" లోని విశ్వకర్మ వాటిక, "మేరా-గావ్-మేరా-దేశ్" మరియు "బావర్చి-ఖానా" విభాగాల నిర్వహణలో మొత్తం 40 మందితో కూడిన మూడు బృందాలు నిమగ్నమై ఉన్నాయి. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ కూడా చేశారు. సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. మొత్తం "హునార్ హాత్" ప్రాంగణాన్ని రోజుకు 5 సార్లు శుభ్రం చేస్తున్నారు.
కరోనా సవాళ్లను ఎదుర్కోడానికి దేశంలో తగిన సౌకర్యాలు, వనరులు ఉన్నాయని శ్రీ నఖ్వీ అన్నారు. భయాందోళనలకు గురి కాకుండా, ముందు జాగ్రత్తలు, నివారణ పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. "హునార్ హాత్"ని పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని, 31.12.2021 తేదీ మధ్యాహ్నం నుండి 35 వ “హునార్ హాత్” ప్రదర్శనను ముగించాలని నిర్ణయించినట్లు, కేంద్ర మంత్రి ప్రకటించారు. అయితే, ఈ “హునార్ హాత్” ప్రదర్శనను ముందుగా, 2022 జనవరి 5వ తేదీ వరకు కొనసాగించాలని అనుకున్నారు.
రాబోయే రోజుల్లో, మైసూరు, గౌహతి, పూణే, అహ్మదాబాద్, భోపాల్, పాట్నా, పుదుచ్చేరి, ముంబై, జమ్ము, చెన్నై, చండీగఢ్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, గోవా, జైపూర్, బెంగళూరు, కోటా, సిక్కిం, శ్రీనగర్, లేహ్, షిల్లాంగ్, రాంచీ, అగర్తలతో పాటు, ఇతర ప్రదేశాలలో కూడా “హునార్ హాత్” ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
*****
(Release ID: 1786552)
Visitor Counter : 122