భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

జిందాల్ పవర్ లిమిటెడ్‌లో 96.42 శాతం ఈక్విటీ వాటాను వరల్డ్‌వన్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం

प्रविष्टि तिथि: 30 DEC 2021 5:53PM by PIB Hyderabad

జిందాల్ పవర్ లిమిటెడ్‌లో 96.42 శాతం ఈక్విటీ వాటాను వరల్డ్‌వన్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం
తెలిపింది. వరల్డ్‌వన్ ప్రైవేట్ లిమిటెడ్ (వరల్డ్‌వన్)  సంస్థ లిస్టెడ్ మరియు అన్‌లిస్టెడ్ కంపెనీలలో పెట్టుబడులను కలిగి ఉన్న పెట్టుబడి హోల్డింగ్ కంపెనీ. జిందాల్ పవర్ లిమిటెడ్ (జేపీఎల్‌) ప్రధానంగా బొగ్గును ఇంధన వనరుగా ఉపయోగించి థర్మల్ పవర్ విద్యుత్తును ఉత్పత్తి చేసే వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ప్ర‌తిపాదిత కలయిక జేపీఎల్‌లో వరల్డ్‌వన్ ద్వారా 96.42% ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడానికి సంబంధించినది. దీనికి సంబంధించి ప్ర‌భావిత మార్కెట్లు.. (i) భారతదేశంలో బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ఉత్పత్తికి మార్కెట్లు (ii) భారతదేశంలో విద్యుత్ ప్రసార‌ణ‌ మార్కెట్లు. ఈ వాటా కొనుగోలుకు సంబంధించిన స‌వివ‌రణ‌  ఆర్డ‌ర్ వెలువ‌డ‌నుంది. 

***

 


(रिलीज़ आईडी: 1786441) आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी