జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ కింద మధ్యప్రదేశ్ కు రూ.15,381.72 కోట్ల తాగునీటి సరఫరా పథకాలు ఆమోదం


15 జిల్లాలలో 9,240 గ్రామాల్లోని 22 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 22 భారీ తాగునీటి సరఫరా పథకాలు

2023 నాటికి 'హర్ ఘర్ జల్' రాష్ట్రంగా మారే దిశగా మధ్యప్రదేశ్

Posted On: 30 DEC 2021 5:15PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్ రాష్ట్రం లో జల్ జీవన్ మిషన్ కింద రూ.15,381.72 కోట్ల తాగునీటి సరఫరా పథకాలకు -రాష్ట్ర స్థాయి పథకం మంజూరు కమిటీ (ఎస్ ఎల్ ఎస్ ఎస్  సి) సమావేశంలో-ఆమోదం లభించింది.1.09 కోట్లకు పైగా గ్రామీణ జనాభాకు కుళాయి నీటి కనెక్షన్ అందించడానికి 22 బహుళ గ్రామాల పథకాలను మంజూరు చేశారు. ఈ 22 పథకాలు రేవా, సాత్నా, సెహోర్, సిధి, అలీరాజ్ పూర్, బద్వానీ, జబల్ పూర్, పన్నా, మాండ్ల, సాగర్, కట్నీ, ధర్, షియోపూర్, ఉమరియా , ఖర్గోన్ జిల్లాల్లోని 9,240 గ్రామాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. 2023 నాటికి అన్ని గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి సరఫరాను అందించాలని రాష్ట్రం యోచిస్తున్న సమయం లో ఈ పథకాల ఆమోదం ప్రాముఖ్యత ను సంతరించుకుంది. ఈ గ్రామాలన్నీ వేసవిలో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. కొత్త పథకాల వల్ల ఈ 9,240 గ్రామాల్లో నివసిస్తున్న 22 లక్షలకు పైగా కుటుంబాలకు వచ్చే 30-40 సంవత్సరాలపాటు క్రమం తప్పకుండా తగినంత స్వచ్ఛమైన కుళాయి నీటి సరఫరా లభిస్తుందని భావిస్తున్నారు

 

జల్ జీవన్ మిషన్ (జెజెఎం) కింద, గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి సరఫరా ను అందించడానికి చేపట్టాల్సిన పథకాల పరిశీలన ,ఆమోదం కోసం రాష్ట్ర స్థాయి పథకం మంజూరు కమిటీ (ఎస్ ఎల్ ఎస్ సి) ల ఏర్పాటుకు అవకాశం ఉంది. నీటి సరఫరా పథకాలు/ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోవడానికి ఎస్ ఎల్ ఎస్ సి రాష్ట్ర స్థాయి కమిటీగా వ్యవహరిస్తుంది, భారత ప్రభుత్వ జాతీయ జల్ జీవన్ మిషన్ (ఎన్ జెజెఎం) నామినీ ఒకరు ఈ కమిటీలో సభ్యుడు గా ఉంటారు.

 

2021-22లో రాష్ట్రానికి రూ.5,117 కోట్లు కేటాయించగా, అందులో 'హర్ ఘర్ జల్' కార్యక్రమం అమలు కోసం ఇప్పటికే మధ్యప్రదేశ్ కు రూ.2,558 కోట్లు విడుదల చేశారు. ఇది సుదూర నీటి వనరుల నుండి నీటిని తీసుకురావడానికి ప్రతిరోజూ గంటలు గడిపే మహిళలు , పిల్లలు ఎదుర్కొంటున్న శ్రమను చాలా తగ్గిస్తుంది.

 

2019 ఆగస్టు 15న జల్ జీవన్ మిషన్ ప్రారంభించే సమయంలో రాష్ట్రంలో కేవలం 13.53 లక్షల (11%) గ్రామీణ గృహాలకు మాత్రమే కుళాయి నీటి సరఫరా ఉంది. గత 28 నెలల్లో, కోవిడ్-19 మహమ్మారి , లాక్ డౌన్ అంతరాయాలు ఉన్నప్పటికీ, రాష్ట్రం 31.63 లక్షల (25.8%) కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లను అందించింది. ఇప్పటి వరకు, రాష్ట్రంలోని 1.22 కోట్ల గ్రామీణ గృహాల్లో, 45.16 లక్షల (36.93%) ఇళ్లలో కుళాయి నీటి సరఫరా లభ్యమవుతోంది. 2021-22లో 22.1 లక్షల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లను అందించాలని రాష్ట్రం ప్రణాళిక రూపొందించింది.

 

ప్రతి ఇంటిలోనూ శుభ్ర మైన కుళాయి నీటిని

అందించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత ను సాకారం చేయడానికి 2021-22 లో మధ్య ప్రదేశ్ కు రూ.2,558.39 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ ను మిషన్ విడుదల చేసింది. ఈ ఏడాది కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ రూ.5,116.79 కోట్లు కేటాయించారు, ఇది గత ఏడాది కేటాయింపు కంటే నాలుగు రెట్లు ఎక్కువ. కేంద్ర జవనరుల శక్తి మంత్రి నాలుగు రెట్ల గ్రాంట్ పెంపు ను అమోదిస్తూ, 2023 డిసెంబర్ నాటికి ప్రతి గ్రామీణ గృహానికి కుళాయి నీటి సరఫరా ను

కల్పించడానికి రాష్ట్రానికి పూర్తి సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఎన్ జె జెఎం బృందం పథకాల సత్వర అమలు, పనుల నాణ్యత, సమర్థవంతమైన సమాజ భాగస్వామ్యం అవసరాన్ని నొక్కి చెప్పారు. జల్ జీవన్ మిషన్ లో చాలా ముఖ్యమైన భాగం అయిన గ్రే. వాటర్ నిర్వహణ ను నీటి సరఫరా పథకాలలో ఏకీకృతం ద్వారా చేర్చాలని రాష్ట్రానికి సూచించారు.

దేశంలోని పాఠశాలలు, ఆశ్రమాలు ,అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు సురక్షితమైన కుళాయి నీటిని అందించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రకటించిన 100 రోజుల ప్రచారాన్ని కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ 2020 అక్టోబర్ 2న ప్రారంభించారు.

 

అభ్యసన కేంద్రాల్లో అందించే కుళాయి నీటిని పిల్లలు ,ఉపాధ్యాయులు తాగడానికి  మధ్యాహ్న భోజనం వండడానికి, చేతులు కడుక్కోవడానికి , టాయిలెట్ లలో నూ ఉపయోగిస్తారు. మధ్యప్రదేశ్ లోని 68,811 పాఠశాలలు (73%) ,40,357 అంగన్ వాడీ కేంద్రాలకు (60%) వారి ఆవరణలో కుళాయి నీటి సరఫరా కల్పించారు. మిగిలిన పాఠశాలలు , ఎడబ్ల్యుసిలలో కుళాయి నీటి సరఫరాను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని రాష్ట్రాన్ని కోరారు.

 

‘సబ్ కసాత్, సబ్ కావికాస్, సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్'కు అనుగుణంగా పనిచేస్తూ, 'ఎవరూ వదిలివేయబడలేదు' అనేది జల్ జీవన్ మిషన్ ఆశయం గా ఉంది. ఇంకా ఇది త్రాగునీటి సరఫరాకు సార్వత్రిక ప్రాప్యతను లక్ష్యంగా పెట్టుకుంది. 2019 లో మిషన్ ప్రారంభంలో, దేశంలోని మొత్తం 19.20 కోట్ల గ్రామీణ గృహాలలో, కేవలం 3.23 కోట్ల (17%) మాత్రమే కుళాయి నీటి సరఫరాను కలిగి ఉన్నాయి. గత 28 నెలల్లో, కోవిడ్-19 మహమ్మారి ,లాక్ డౌన్ ల అంతరాయాలు ఉన్నప్పటికీ, జల్ జీవన్ మిషన్ వేగంతో అమలు జరిగింది. నేడు, 5.50 కోట్ల గ్రామీణ కుటుంబాలు  కుళాయి నీటి కనెక్షన్లు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8.74 కోట్ల (45.5%) గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి సరఫరా ఉంది. గోవా, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు, అండమాన్ -నికోబార్ దీవులు, పుదుచ్చేరి, డి అండ్ ఎన్ హెచ్ , డి అండ్ డి కేంద్ర పాలిత ప్రాంతాల లోని 100% గృహ కుళాయి కనెక్షన్ లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం 84 జిల్లాలు, 1.30 లక్షలకు పైగా గ్రామాల లోని  ప్రతి ఇంటికి కుళాయి నీటి సరఫరా లభిస్తోంది.

***



(Release ID: 1786438) Visitor Counter : 152


Read this release in: English , Hindi , Tamil