ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఛత్తీస్‌గఢ్‌లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

Posted On: 29 DEC 2021 2:52PM by PIB Hyderabad

ఆదాయపు పన్ను శాఖ 22.12.2021వ తేదీన రాయ్‌పూర్, కోర్బాలోని ఇనుము & ఉక్కు ఉత్పత్తుల తయారీ, బొగ్గు వాషరీ మరియు రవాణా మొదలైన రంగాల‌లో నిమ‌గ్న‌మై ఉన్న రెండు ప్రముఖ గ్రూపుల కార్య‌క‌లాపాల విష‌య‌మై సోదాలు, జప్తు కార్యకలాపాలను నిర్వహించింది. ఈ సోదాలు  35 కంటే ఎక్కువ ప్రాంతాల‌లో జ‌రిగాయి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, కోర్బా, బిలాస్‌పూర్ మరియు రాయ్‌గఢ్ జిల్లాల్లో వీటిని నిర్వ‌హించారు. ఈ సోదాల‌లోఒక గ్రూపున‌కు చెందిన వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలు కనుగొనబడ్డాయి. సమాంతర నగదు పుస్తకాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ సమాంతర నగదు పుస్తకాల యొక్క ప్రాథమిక విశ్లేషణ ప్ర‌కారం రూ.200 కోట్ల కంటే ఎక్కువ లెక్కలోకి చూప‌ని లావాదేవీల క్రమబద్ధమైన రికార్డులు ఉన్న‌ట్టుగా గుర్తించ‌డ‌మైంది.  సేకరించిన సాక్ష్యాల మేర‌కు ఈ గ్రూపులోని కొన్ని సంస్థలు వాస్తవ ఉత్పత్తిని త‌క్కువ చేసి చూపించ‌డం,  తదుపరి ఖాతాలో నమోదు చేయని సాధారణ ఖాతా పుస్తకాలలో నమోదు చేయబడని నగదు రూపంలో జరిగిన అకౌంటెడ్ విక్రయాలను త‌క్కువ చేసి చూపినట్టుగా కూడా గుర్తించబడ్డాయి. ఈ త‌రహా సంస్థ‌ల లావాదేవీలను రుజువు చేసే ఖాతా పుస్తకాల సమాంతర సెట్. సాధారణ ఖాతా పుస్తకాల్లో కనిపించని రూ.50 కోట్లను గుర్తించి సీజ్ చేశారు. రవాణాలో నిమగ్నమై ఉన్న సంబంధిత గ్రూప్ సంస్థల నుండి అలాగే ఎంట్రీ ప్రొవైడర్ల నుండి బోగస్ కొనుగోలు ఇన్‌వాయిస్‌లను పొందడం ద్వారా గ్రూపు తమ పన్ను విధించదగిన ఆదాయాన్ని ఎగవేస్తోందని ఐటీ శోధ‌న బృందం కనుగొంది. మరొక గ్రూపు విషయంలో నేరారోపణ పత్రాలు, ఇతర సంబంధిత సాక్ష్యాల విశ్లేషణ స్పష్టంగా వివిధ అవ‌క‌త‌వ‌క‌లు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ గ్రూపు తన ఆదాయంపై పన్నులను ఎగవేసేందుకు అనేక అవకతవకలకు పాల్పడిందని, నిరాధారమైన షేర్ ప్రీమియంతో వాటా మూలధనాన్ని పొందడం, బూటకపు కొనుగోళ్లపై ఖర్చులను క్లెయిమ్ చేయడం ద్వారా స్పష్టంగా వివిధ ర‌కాల న‌గ‌దు లావాదేవీల‌లో మోసాలు జ‌రిపిన‌ట్టుగా సూచిస్తుంది. ఈ గ్రూపులోని కీలక వ్యక్తి స‌మ్మ‌తించిన ఈ త‌ర‌హా  ఆదాయం రూ. 20 కోట్ల వ‌ర‌కు ఉంది. ఈ సోదాల్లో ఇప్పటి వరకు రూ.కోటికిపైగా నగదు, రూ.3 కోట్ల విలువైన నగల‌ను స్వాధీనం చేసుకున్నారు. త‌దుప‌రి విచార‌ణ కొనసాగుతోంది. 

***



(Release ID: 1786224) Visitor Counter : 128


Read this release in: English , Urdu , Hindi