శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వాయు కాలుష్య కారకాలు, వాతావరణ మార్పులు పుప్పొడి ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయి: అధ్యయనం

Posted On: 29 DEC 2021 5:08PM by PIB Hyderabad

వాయు కాలుష్య కారకాలు పుప్పొడి ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయని, అదేవిధంగా, వివిధ రకాల పుప్పొడి వాతావరణ పరిస్థితులకు ప్రత్యేకమైన ప్రతిస్పందనను కలిగి ఉంటుందని,  శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

పుప్పొడి గాలిలో నిలిచిపోయి, మనం పీల్చే గాలిలో భాగంగా ఉంటుంది.  మానవులు పీల్చినప్పుడు, అది ఎగువ శ్వాసకోశ వ్యవస్థ పై ఒత్తిడిని కలగజేస్తుంది. అప్పుడు వారు విస్తృతమైన ఎగువ శ్వాసకోశ ఇబ్బందితో పాటు,  ఉబ్బసం, కాలానుగుణ శ్లేష్మం, శ్వాశకోశానికి సంబందించిన మంట వంటి వ్యక్తీకరణలతో ముక్కుకు సంబంధించిన శ్వసకోశ అలెర్జీలకు గురౌతారు. 

వైవిధ్యమైన వాతావరణ లేదా పర్యావరణ పరిస్థితుల కారణంగా గాలిలో ఉండే పుప్పొడి స్వభావం ఒక్కో ప్రదేశంలో, ఒక్కో రకంగా మారుతూ ఉంటుంది.  పట్టణ వాతావరణంలో అలెర్జీ వ్యాధులను పెంచడంలో గాలిలో పుప్పొడి కీలక పాత్ర పోషిస్తుందనే విషయమై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.  పుప్పొడి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్య కారకాలు ప్రకృతిలో సహజీవనం చేస్తున్నందున, అవి ఒకదానితో ఒకటి సంకర్షణ చెందే అవకాశం ఉండడంతో, అవి మానవ ఆరోగ్యంపై వాటి ప్రతికూల ప్రభావాలను మరింత తీవ్రతరం చేస్తాయి.

ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని, పర్యావరణ అధ్యయనాల విభాగం చైర్‌పర్సన్ డాక్టర్ సుమన్ మోర్‌,  పి.హెచ్.డి. పరిశోధకురాలు శ్రీమతి. అక్షి గోయల్ తో కలిసి, చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పి.జి.ఐ.ఎం.ఈ.ఆర్) నుండి ప్రొఫెసర్ రవీంద్ర ఖైవాల్, చండీగఢ్ నగరం లోని గాలిలో ఉండే పుప్పొడి పై వాతావరణ, వాయు కాలుష్య కారకాల ప్రభావాన్ని అధ్యయనం చేశారు.   ఈ బృందం ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమ, గాలి వేగం, దిశ, పరిసర వాయు కాలుష్య కారకాలు ప్రధానంగా, గాలిలో సూక్ష్మ నలుసులు, నైట్రోజన్ ఆక్సైడ్, గాలిలో ఉండే పుప్పొడి కి గల సంబంధాలను అన్వేషించింది.

ఈ అధ్యయనానికి భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ (డి.ఎస్.టి), ఆర్థిక సహకారాన్ని అందించింది.  వాయు కాలుష్య కారకాలు, గాలిలో పుప్పొడి పై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, భారతదేశంలో చేపట్టిన మొదటి అధ్యయనాలలో ఇది ఒకటి.  ఈ అధ్యయనం ఇటీవలే, ఎల్సెవియర్ కి చెందిన "సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్‌" అనే పత్రికలో ప్రచురితమయ్యింది.  

అధ్యయనం చేసిన ప్రతి పుప్పొడి రకం వాతావరణ పరిస్థితులు, వాయు కాలుష్య కారకాలకు ప్రత్యేకమైన ప్రతిస్పందనను కలిగి ఉన్నట్లు, అధ్యయనం సూచిస్తోంది.  వసంత ఋతువు, శరదృతువు లలో పుష్పించే కాలంలోనే పుప్పొడి రకాలు ఎక్కువగా లభిస్తాయి.  సాధారణ ఉష్ణోగ్రత, తక్కువ తేమ,  తక్కువ అవపాతం వంటి అనుకూల వాతావరణ పరిస్థితులలో గాలిలో పుప్పొడి అత్యధికంగా లభిస్తుంది.  పుష్పించే, పుష్పగుచ్ఛము, పరిపక్వత, పుప్పొడి విడుదల, వ్యాప్తిలో మితమైన, సాధారణ ఉష్ణోగ్రత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గమనించడం జరిగింది.  దీనికి విరుద్ధంగా, అవపాతం తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉన్న సమయంలో వాతావరణం నుండి పుప్పొడి రేణువులు తొలగించబడతాయి.

గాలిలో ఉండే పుప్పొడి యొక్క సంక్లిష్టమైన, అస్పష్టమైన సంబంధం వాయు కాలుష్య కారకాలతో సూచించబడింది. ఈ సంబంధంలోని పోకడలను నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు దీర్ఘకాలిక సమాచార సెట్‌ లను పరిశీలించాలని ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. 

వాతావరణ భవిష్యత్తు పరంగా, పట్టణ వాతావరణం మొక్కల జీవ మరియు శీతోష్ణస్థితి కి సంబంధించిన కొలమానాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రొఫెసర్ రవీంద్ర ఖైవాల్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. 

అందువల్ల, అధ్యయనం యొక్క ఫలితాలు వాయు కాలుష్య కారకాలు పుప్పొడి ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయని మరియు భవిష్యత్తులో డేటా సెట్ విస్తరిస్తున్నందున మరింత అన్వేషించవచ్చని ఉపయోగకరమైన పరికల్పనలను రూపొందిస్తుంది.

ప్రస్తుత అధ్యయనం యొక్క ఫలితాలు గాలిలో పుప్పొడి, వాయు కాలుష్య కారకాలు, వాతావరణ మార్పులు మధ్య సంక్లిష్ట పరస్పర చర్యల అవగాహనను మెరుగుపరచడానికి,  తగిన ఉపశమన విధానాలను రూపొందించడానికి,  ఇండో-గంగా మైదాన ప్రాంతంలో పొలినోసిస్ భారాన్ని తగ్గించడానికి, సహాయ పడతాయి.  ఈ ప్రాంతం ప్రత్యేకంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వాయు కాలుష్యానికి హాట్‌-స్పాట్‌ గా గుర్తించబడింది.

ప్రచురణ లింక్ :

డి.ఓ.ఐ: https://doi.org/10.1016/j.scitotenv.2021.151829

<><><>



(Release ID: 1786198) Visitor Counter : 365


Read this release in: English , Urdu , Hindi , Tamil