సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఇ పథకం- పిఎంఇజిపి - స్వావలంబన దిశగా అంజూ దేవి ప్రయాణం
Posted On:
28 DEC 2021 2:04PM by PIB Hyderabad
అంజు దేవి బీహార్‌కు చెందిన మహిళ. ఆమె మధుబని పెయింటింగ్‌లో డిప్లొమా పొందేందుకు # పిఎంఇజిపి పథకం తోడ్పడమే కాక ఆమె తన స్వంత సంస్థను ప్రారంభించేందుకు రుణాన్ని అందించింది. మధుబని కళ పట్ల తనకున్న అభిరుచిని సజీవంగా నిలుపుకొని, దానిని ఆర్ధిక ప్రతిపాదనగా మార్చాలని, మరణిస్తున్న కళను పునరుద్ధరించాలని ఆమె నిర్ణయించుకుంది. నేడు ఆమె సంస్థ ఎస్ఎస్‌డి మిథిలా ఆర్ట్స్ ఆమెను ఉన్నతమైన వ్యాపారవేత్తగా ఆమెను చేయడమే కాక అనేకమంది ఇతర మహిళలకు ఉపాధిని కల్పించడం ద్వారా స్వావలంబం చేసింది.
మీకు ఆసక్తి ఉన్న, మిమ్మల్ని స్వావలంబం చేయడమే కాక మీ చుట్టూ ఉన్న ఇతర మహిళలకు ఉపాధిని కల్పించగల కార్యకలాపాన్ని ఎంచుకోండి. కృషి, పట్టుదల, నాణ్యమైన ఉత్పత్తి, నిరంతర ఆవిష్కరణ విజయానికి దారి తీస్తాయి, అన్నది ఇతర మహిళలకు ఇస్తున్న సందేశం.
పిఎంఇజిపి పథకం ఆర్థిక, శిక్షణా మద్దతును అందించగా, అంజుదేవి, అనేకమంది ఇతర మహిళల విజయానికి ఎంఎస్ఎంఇ మార్గాన్ని సుగమం చేస్తుంది.
***
(Release ID: 1785921)
Visitor Counter : 142