ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

Posted On: 28 DEC 2021 1:22PM by PIB Hyderabad

రెండు గ్రూపులు..  వాటికి సంబంధించిన వివిధ వ్యాపార‌ సంస్థలపై ఆదాయ‌పు ప‌న్ను శాఖ (ఐటీ శాఖ) 22.12.2021న సోదాలు, జ‌ప్తు కార్యకలాపాల‌ను నిర్వహించింది. ఐటీ శాఖ సోదాలు నిర్వ‌హించిన గ్రూపుల‌లో ఒక వ్యాపార  గ్రూపు సంస్థ రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలో ఎలక్ట్రికల్ స్విచ్‌లు, వైర్లు, ఎల్ఈడీలు, స్థిరాస్తి, హోటల్ వ్యాపారం, తయారీ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. మరొక గ్రూపు జైపూర్‌, స‌మీప నగరాల్లో మనీ లెండింగ్ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ఐటీ శాఖ సోదాలు జైపూర్, ముంబ‌యి, హరిద్వార్‌తో సహా వివిధ ప్రదేశాలలో 50 కంటే ఎక్కువ ప్రాంగణాల‌లో జ‌రిగాయి. ఐటీ శాఖ అధికారులు నిర్వ‌హించిన ఈ సోదాల‌లో పెద్ద సంఖ్యలో నేరారోపణ పత్రాలు, డిజిటల్ డేటా గుర్తించారు. అధికారులు వాటిని స్వాధీనంలోకి  తీసుకున్నారు.  స్వాధీనం చేసుకున్న సాక్ష్యాల ప్రాథమిక విశ్లేషణలో స్విచ్‌లు, వైర్లు, ఎల్‌ఈడీలు మొదలైన వాటి తయారీ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న అనేక సంస్థలు సాధారణ ఖాతా పుస్తకాల్లో నమోదు చేయని వస్తువులను విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకునేందుకు బోగస్‌ ఖర్చులు చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. లెక్కలు చూపని వస్తువుల విక్రయంపై నగదు భాగం రసీదుల‌ జాడ కూడా కనుగొనబడింది. ఈ గ్రూప్ విషయానికొస్తే, రూ.150 కోట్లకు పైగా వెల్లడించని ఆదాయాల‌ను జ‌రిపిన‌ట్టుగా తేలింది. వీటిని  రుజువు చేసే లావాదేవీలను సెర్చ్ టీమ్ గుర్తించింది. గ్రూప్‌లోని ఒక కీలక వ్యక్తి రూ.55 కోట్ల సొమ్మును వెల్లడించని ఆదాయంగా అంగీకరించారు, దానిపై పన్ను చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఇతర గ్రూపునకు సంబంధించి స్వాధీనం చేసుకున్న మరియు ఇతర సంబంధిత పత్రాల విశ్లేషణలో చాలా రుణాలు నగదు రూపంలో ఇవ్వబడ్డాయి.  ఈ రుణాలపై సాపేక్షంగా అధిక వడ్డీ రేటును వసూలు చేసినట్లు వెల్లడైంది. ఈ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న వ్యక్తుల ఆదాయ రిటర్న్స్‌లో అడ్వాన్స్‌డ్ చేసిన రుణాలు లేదా వాటిపై వచ్చిన వడ్డీ ఆదాయాలు వెల్లడించలేదు. ఈ గ్రూపులో రూ.150 కోట్లకు పైగా వెల్లడించని ఆదాయానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. సోదాల‌లో ఇప్పటివరకు మొత్తం రూ.17 కోట్ల విలువైన లెక్కల్లో చూపని నగదు, నగల‌ను  స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొన‌సాగుతోంది. 

 

****


(Release ID: 1785821) Visitor Counter : 170


Read this release in: English , Urdu , Hindi