ఆర్థిక మంత్రిత్వ శాఖ

అహ్మదాబాద్ DGGI - డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ కాన్పూర్ లో నిర్వహించిన సోదాలలో 177 కోట్ల రూపాయలకు పైగా స్వాధీనం.


సంబంధిత ప్రదేశాల్లో రూ. 17 కోట్ల విలువైన 64 కిలోల బంగారం, రూ. 6 కోట్ల విలువైన 600 కిలోల గంధపు నూనె రికవరీ. కొనసాగుతున్న సోదాలు.

Posted On: 27 DEC 2021 7:41PM by PIB Hyderabad

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ (DGGI) అహ్మదాబాద్ యూనిట్ 22.12.2021న కాన్పూర్‌లో శిఖర్ బ్రాండ్ పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదారుల కర్మాగారాలైన, M/s గణపతి రోడ్ క్యారియర్స్, ట్రాన్స్ పోర్ట్ నగర్, కాన్పూర్ కార్యాలయం/గోడౌన్‌లలో, ఇంకా  కన్నౌజ్ వద్ద సుగంధ ద్రవ్యాల సమ్మేళనాల సరఫరా చేసే M/s ఓడోచెమ్ ఇండస్ట్రీస్ సంబంధ నివాస/ఫ్యాక్టరీ ప్రాంగణాలలోనూ సోదాలను ప్రారంభించింది. , M/s గణపతి రోడ్ క్యారియర్స్ నిర్వహణలో పన్ను చెల్లించకుండా విడుదల  చేసిన బ్రాండెడ్  పాన్ మసాలా, పొగాకును తీసుకువెళుతున్న 4 ట్రక్కులను అడ్డగించిన తరువాత, అధికారులు, పుస్తకాలలో నమోదు చేసిన స్టాక్‌తో ఫ్యాక్టరీలో పూర్తి ఉత్పత్తులు ఉన్న అసలు స్టాక్‌ను లెక్కించారు, ముడి పదార్థాల తరుగుదలను గుర్తించారు. పేర్కొన్న వస్తువుల రవాణాను నిర్వహించడానికి నకిలీ పత్రాలను జారీ చేసే రవాణా దారుడి  సహాయంతో తయారీదారు వస్తువులను లెక్కల్లో  తొలగించడాన్ని  సోదాలు   ధృవీకరించాయి. ఇలాంటి 200కి పైగా నకిలీ వ్యాపార లావాదేవీల పత్రాలను  అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శిఖర్ బ్రాండ్ పాన్ మసాలా/పొగాకు ఉత్పత్తుల తయారీదారులు తమ బాధ్యతగా  పన్ను కోసం రూ. 3.09 కోట్ల మొత్తాన్ని అంగీకరించి, డిపాజిట్ చేశారు.

22.12.2021న కాన్పూర్‌లోని అనద్‌పురిలోని 143 లో ఉన్న ఓడోచెమ్ ఇండస్ట్రీస్ సంస్థ భాగస్వాముల నివాస ప్రాంగణంలో ప్రారంభించిన శోధన ప్రక్రియ ముగిసింది. ఈ స్థలంలో స్వాధీనం చేసుకున్న లెక్కల్లో చూపని నగదు మొత్తం రూ. 177.45 కోట్లు. సీబీఐసీ అధికారులు పట్టుకున్న నగదులో ఇదే అతిపెద్దది. ఈ స్థలంలో స్వాధీనం చేసుకున్న పత్రాలు వారు పరిశీలిస్తున్నారు.

ఇంకా, DGGI అధికారులు కనౌజ్‌లోని M/s ఓడోకెమ్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని కూడా శోధించారు, సోదాలు  పురోగతిలో ఉన్నాయి. కన్నౌజ్‌లో సోదాల సందర్భంగా, అధికారులు సుమారు రూ. 17 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగలిగారు, దీనిని ఎస్‌బిఐ అధికారులు లెక్కిస్తున్నారు. అదనంగా సుమారు రూ. 6 కోట్లు మార్కెట్ విలువగా ఉన్న  సుమారు 23 కిలోల బంగారం,  సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగించే లెక్కలోకి రాని ముడి పదార్థాలు, భూగర్భ నిల్వలో దాచిన 600 కిలోలకు పైగా చందనం నూనెతో సహా  రికవరీ చేశారు. కన్నౌజ్ వద్ద కొనసాగుతున్న సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది.

అలా రికవరీ చేసిన బంగారానికి విదేశీ మార్కులు ఉన్నందున, అవసరమైన పరిశోధనల కోసం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI)ని రంగంలోకి దింపుతున్నారు.

ఇప్పటివరకు జరిగిన పరిశోధనలలో సేకరించిన ఆధారాల ఆధారంగా, కనౌజ్‌లోని M/s ఓడోచెమ్ ఇండస్ట్రీస్ భాగస్వామి శ్రీ పీయూష్ జైన్‌ను DGGI అధికారులు విచారించారు. చట్టంలోని సెక్షన్ 70 కింద 25/26.12.2021న అతని వాంగ్మూలం రికార్డ్ చేశారు, దీనిలో నివాసం నుండి రికవరీ చేసిన నగదు GST చెల్లించకుండా వస్తువుల విక్రయానికి సంబంధించినదని శ్రీ జైన్ అంగీకరించారు. కన్నౌజ్‌లోని M/s ఓడోచెమ్ ఇండస్ట్రీస్ GSTని పెద్ద ఎత్తున ఎగవేసినట్లు రికార్డులో, అందుబాటులో ఉన్న భారీ సాక్ష్యాల దృష్ట్యా,  పీయూష్ జైన్ ను  CGST చట్టంలోని సెక్షన్ 132 ప్రకారం నేరాల కమిషన్ కింద 26.12.2021 న అరెస్టు చేశారు 27.12.20221న న్యాయస్థానం ముందు నిలబెట్టారు .

గత 5 రోజులు జరిపిన సోదాల్లో పన్ను ఎగవేతను ఛేదించేందుకు సేకరించిన సాక్ష్యాలను క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

మునుపటి ఆపరేషన్  ప్రెస్ విడుదల లింక్: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1784872

***(Release ID: 1785696) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Hindi