శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నావిగేషన్ మద్దతును అందించే యాప్‌కు అవసరమైన రిసీవర్ మాడ్యూల్స్ అభివృద్ధి , ఉత్పత్తికి టిడిబి మద్దతు
Posted On:
25 DEC 2021 3:42PM by PIB Hyderabad
భారతదేశం , దాని చుట్టుపక్కల 1,500 కి.మీల దూరం వరకు నావిగేషన్ సపోర్టును అందించే ఏడు ఉపగ్రహాల కూటమి కోసం ఇస్రో అభివృద్ధి చేసిన నావిక్ (నేవిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్) కు అవసరమైన రిసీవర్ మాడ్యూళ్లను భారతదేశం త్వరలో అభివృద్ధి చేయనుంది. ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా . జిపిఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్)కు అవసరమయ్యే సాంకేతికతను మరింత ముందుకుతీసుకుపోవడం అనేది ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ ,తయారీలో భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చడంలో ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ఇందుకు సంబంధించి ,భారతప్రభుత్వ డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ కి చెందిన టెక్నాలజీ డవలప్‌మెంట్ బోర్డు హైదరాబాదుకు చెందిన మంజీరా డిజిటల్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎండిఎస్ ) కు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ఇది డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, పరిశోధన, అభివృద్ధి కంపెనీ.
ఇది నావ్ ఐసి యాప్‌కు అవసరమైన రిసీవర్ మాడ్యూళ్లను పెద్దమొత్తంలో తయారు చేయడం, మంచి పనితీరు గల కంప్యూటింగ్ కోసం ,తదుపరి తరం కంప్యూటింగ్ వ్యవస్థలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వ్యూహాత్మక ప్రాముఖ్యత , ఆర్థిక స్వావలంబన రంగాలలో భారతదేశ సాంకేతిక విజ్ఞాన రంగ నాయకత్వాన్ని స్థాపించడంలో సహాయపడుతుంది.
ఈ కంపెనీ పెటెంటెడ్ యూనివర్సల్ మల్టీ ఫంక్షనల్ యాక్సిలరేటర్ (యుఎంఎ)ని ఉపయోగించి బేస్‌బ్యాండ్ ప్రాసెసర్‌కు రూపకల్పన చేసింద. ఈ యుఎంఎను జనిరిక్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ (డిఎస్‌పి) అప్లికేషన్లలో అంటే సర్వర్ యాక్సిలరేషన్, ఎడ్జ్ కంప్యూటింగ్, నోడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ విజన్, సిగ్నల్ ప్రాసెసింగ్ లో ఉపయోగించవచ్చు.
స్టార్టప్‌లు , ఎం.ఎస్.ఎం.ఇలు , లేదా పేరున్న కంపెనీలైన టెక్నాలజీ కంపెనీల పురోగతిలోటిడిబి కీలక పాత్ర వహిస్తోంది.సెమీ కండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, రక్షణ, ఎయిరోస్పేస్, తదితర రంగాలకు సంబంధించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు టిడిబి సిద్ధంగా ఉన్నట్టు టిడిబి కార్యదర్శి, ఐపి, టిఎఎఫ్ ఎస్ శ్రీ రాజేష్ కుమార్ పాఠక్ తెలిపారు.
ప్రస్తుత సమయంలో టిడిబి సహాయం సరైన సమయంలో సరైన సహాయం గా చెప్పుకోవచ్చు. దేశీయ ఉత్పత్తులను వాణిజ్యపరంగా ముందుకు తీసుకువెళ్లే కృషి ని వేగవంతం చేసేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని కంపెనీ సిఇఒ డాక్టర్ వేణు కందాడై అన్నారు.., తాము, మంజీరా లో ఇలాంటి ఎన్నో చిప్‌లను డిజైన్ చేయడంతో పాటు అభివృద్ధి చేస్తామని చెప్పారు . ఎలక్ట్రానిక్స్ చిప్ డిజైన్, అభివృద్ధిలో స్వావలంబన సాధనకు ప్రభుత్వానికి ఇది ఎంతగానో తోడ్పడనుందని ఆయన అన్నారు.
(Release ID: 1785414)
Visitor Counter : 218