ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆగ్రా మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం 250 మిలియన్ యూరోల మొదటి విడత రుణం కోసం భారత ప్రభుత్వం & యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ఫైనాన్స్ ఒప్పందంపై సంతకం చేశాయి.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగ్రాలో ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ప్రారంభించారు

Posted On: 23 DEC 2021 6:18PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా)  యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఈఐబీ) ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం ఒప్పందం చేసుకున్నాయి. మెట్రోరైలు నిర్మాణం కోసం 250 మిలియన్ల యూరోల విలువైన లోన్ ఇవ్వడానికి (మొదటి విడత) ఫైనాన్స్ కాంట్రాక్ట్‌పై సంతకం చేశాయి. భారత ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా,  యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఈఐబీ) తరపున విభాగాల అధిపతి  రోజర్ స్టువర్ట్‌, ఎడ్వర్దాస్ బమ్‌స్టీనాస్ సంతకం చేశారు. న్యూఢిల్లీ,  బ్రస్సెల్స్‌లో ఈ కార్యక్రమాలు జరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆగ్రా మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేందుకు యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మొత్తం 450 మిలియన్ల యూరోల రుణం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆగ్రా నగరానికి సురక్షితమైన, విశ్వసనీయమైన, సరసమైన  పర్యావరణ అనుకూలమైన పబ్లిక్ మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇది ఆగ్రాలో ప్రణాళికాబద్ధమైన పట్టణ అభివృద్ధికి దోహదపడుతుంది. యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నుండి వచ్చే డబ్బుతో 29.4 కిలోమీటర్ల మెట్రో కారిడార్ నిర్మాణానికి నిధులు సమకూర్చవచ్చు. మొదటి కారిడార్-ను సికందర నుండి తాజ్ ఈస్ట్ గేట్ (14 కిలోమీటర్లు) వరకు నిర్మిస్తారు. రెండో  కారిడార్ను ఆగ్రా కంటోన్మెంట్ నుండి కాళింది విహార్ (15.4 కిలోమీటర్లు) వరకు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ నగరం ఆర్థిక ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది.  ఉద్యోగ అవకాశాలను మరింత పెంచుతుంది. కేంద్ర గృహనిర్మాణం,  పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్ కు లైన్ మినిస్ట్రీగా పనిచేస్తుంది. ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీఎంఆర్సీఎల్) కార్యనిర్వాహక సంస్థగా పనిచేస్తుంది.

***



(Release ID: 1785114) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Hindi