వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
మేక్ ఇన్ ఇండియా
Posted On:
22 DEC 2021 3:02PM by PIB Hyderabad
పెట్టుబడిని సులభతరం చేయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను ఉత్తమంగా నిర్మించడానికి తయారీ, డిజైన్ ఆవిష్కరణలకు భారతదేశాన్ని కేంద్రంగా మార్చడానికి 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని 25 సెప్టెంబర్, 2014న ప్రారంభించారు. భారతదేశం తయారీరంగాన్ని ప్రపంచానికి ప్రచారం చేసిన ప్రత్యేకమైన 'వోకల్ ఫర్ లోకల్' కార్యక్రమాలలో ఇది ఒకటి. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం దేశవ్యాప్తంగా వివిధ చర్యల ద్వారా అమలు చేయబడుతోంది. వాటి పూర్తి వివరాలు అందుబాటులో లేవు.
'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం గణనీయమైన విజయాలు సాధించింది. ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియా 2.0 కింద 27 రంగాలపై దృష్టి సారించారు. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) 15 ఉత్పాదక రంగాలకు కార్యాచరణ ప్రణాళికలను సమన్వయం చేస్తుంది. అయితే వాణిజ్య విభాగం 12 సేవా రంగ ప్రణాళికలను సమన్వయం చేస్తుంది.
మనదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాలలో ఉన్న భారతీయ మిషన్ల ద్వారా పెట్టుబడుదారులను సంప్రదించే కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
భారతదేశంలో దేశీయ, విదేశీ పెట్టుబడులను పెంచడానికి ప్రభుత్వం అనేక ఇతర చర్యలను చేపట్టింది. వివిధ శాఖలు, మంత్రిత్వ శాఖలు చాలా పథకాలతో, రాయితీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు, ఎన్‌బిఎఫ్‌సిలకు బ్యాంకుల లిక్విడిటీ సమస్యలను సడలించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మెరుగుపరచడం, ఎఫ్‌డిఐ విధానాల్లో సంస్కరణలను తేవడం, నిబంధనలను మరింత సరళీకరించడం, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ ఆర్డర్‌ల ద్వారా దేశీయ తయారీని పెంచే విధానాలు వీటిలో ముఖ్యమైనవి. వివిధ మంత్రిత్వ శాఖల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (పీఎల్ఐ) పథకాల కోసం దశలవారీ తయారీ కార్యక్రమం (పిఎమ్‌పి) కూడా చేపట్టారు. పెట్టుబడులను సులభతరం చేయడానికి, ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ (ఐఐఎల్బీ), ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ (ఐపీఆర్ఎస్), నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్డబ్ల్యూఎస్), నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ), నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) సాఫ్ట్ లాంచ్ వంటి చర్యలు అమలవుతున్నాయి. పైన పేర్కొన్న వాటితో పాటు, అనేక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ శాఖలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎప్పటికప్పుడు పథకాలు/కార్యక్రమాల ద్వారా ఎన్నో పథకాలు, కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ విషయాలను కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాష్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలిపారు.
***
(Release ID: 1785112)
Visitor Counter : 160