ఆయుష్
azadi ka amrit mahotsav

ఘనంగా ఐదవ సిద్ధ దినోత్సవం

Posted On: 23 DEC 2021 5:38PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు  అయిదవ సిద్ధ వైద్య దినోత్సవం ఘనంగా జరిగింది. భారత వైద్య విధానాల్లో సిద్ధ వైద్యం అతి పురాతన వైద్య విధానం గా గుర్తింపు పొందింది. భారత ఉపఖండంలో ఉద్భవించి క్రోడీకరించబడిన పురాతన వైద్య సంప్రదాయాలలో సిద్ధ వైద్య విధానం ఒకటి.ఈ  విధానంలో ప్రాధమికంగా పంచభూతాలు, రుచి, వాతం, పిత్తం, కఫం ఆధారంగా వైద్యం అందించడం జరుగుతుంది. ఆయుష్ వైద్య విధానాల్లో సిద్ధ వైద్య విధానాన్ని  గుర్తించిన ప్రభుత్వం దీనికి మరింత ప్రాచుర్యం కల్పించడానికి చర్యలు అమలు చేస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సేవల ద్వారా ఎక్కువ మంది ప్రజలు సిద్ధ వైద్య సేవలు పొందుతున్నారు. 

ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని ఆయిల్యం నక్షత్రంలో వచ్చే అగతియార్ జన్మదినోత్సవం రోజున   ఆయుష్ మంత్రిత్వ శాఖ   సిద్ధ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం "సాంక్రమిక వ్యాధుల కోసం సిద్ధ ఔషధం ఉపయోగాలు " అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ  ఐదవ సిద్ధ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని తమిళనాడు ప్రభుత్వం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అండ్  హోమియోపతి, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ సంయుక్తంగా నిర్వహించాయి.  ప్రధాన కార్యక్రమానికి ముందు గత రెండు నెలలుగా ప్రధాన సంస్థల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు, సిద్ధ డాక్టర్లు, సిద్ధ వైద్య కళాశాలలకు చెందిన సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

సిద్ధ దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ఓడరేవులుషిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్తమిళనాడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మా సుబ్రమణియన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ సర్బానంద సోనోవాల్ పురాతన భారత వైద్య విధానాలకు పూర్వ వైభవం సిద్దిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. వ్యాధులను తగ్గించడానికి, ప్రజల ఆరోగ్య సంరక్షణకు భారతీయ వైద్య విధానాలు సహకరిస్తాయని అన్నారు. సిద్ధ దినోత్సవ నిర్వహణతో ప్రజల్లో ఈ వైద్య విధానంపై విశ్వాసం పెంచుతుందని ఆయన అన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన సీసీఆర్ఎస్, ఎన్ఐఎస్, డైరెక్టరేట్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ మరియు హోమియోపతి,విద్యా సంస్థలుస్వచ్చంధ సేవా సంస్థలను మంత్రి అభినందించారు. కోవిడ్ సమయంలో వారు అందించిన సేవలను మంత్రి కొనియాడారు. 

ప్రజల రోగ నిరోధక శక్తిని పెంచాలన్న లక్ష్యంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ వివిధ సంస్థల ద్వారా వ్యాధి నివారణ మందులను ప్రజలకు ఉచితంగా అందించిందని శ్రీ సోనోవాల్ తెలిపారు. భారతదేశంలోని ప్రముఖ వైద్య కళాశాలలతో కలిసి  సీసీఆర్ఎస్, ఎన్ఐఎస్ మూడు ఆర్ సి టీఎస్, రెండు పరిశీలనలతో సహా 10 అధ్యయనాలను నిర్వహించాయని ఆయన అన్నారు. అధ్యయన ఫలితాలు ప్రముఖ జర్నల్ లలో  ప్రచురితమయ్యాయని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కోవిడ్-19 కి సంబంధించిన రెండు పేటెంట్ల కోసం సీసీఆర్ఎస్ దరఖాస్తు చేసిందని మంత్రి వివరించారు.  సిద్ధ వైద్య విధానానికి గుర్తింపు, ప్రాచుర్యం కల్పించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ మరియు హోమియోపతితమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల పట్ల  శ్రీ సోనోవాల్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1079 సిద్ధ యూనిట్ల ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్నారని ఆయన చెప్పారు. 

సమావేశంలో ప్రసంగించిన కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ ఆధ్యాత్మికమానసిక మరియు శారీరక శ్రేయస్సు అంశాలకు సిద్ధ వైద్య విధానం   ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధ వైద్యం అమలు జరుగుతున్నదని పేర్కొన్నారు. ప్రజారోగ్య విధానాలతో ఆయుష్ వ్యవస్థను అనుసంధానం ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని అన్నారు. 

ప్రత్యేక కార్యదర్శి శ్రీ ప్రమోద్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ ఐసీఎంఆర్, డీబీటీ, సీఎస్ఐఆర్, ఎయిమ్స్, ఆయుష్ సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు సభ్యులుగా ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. టాస్క్ ఫోర్స్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా కోవిడ్-19 నిరోధక ఔషదాలపై  అధ్యయనాలను ఈ బృందాలు చేపట్టాయని ఆయన వివరించారు. 2015-20 ల మధ్య    అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభించేందుకు  సిద్ధ మెడికల్ కాలేజీ తో సహా 184 సంస్థలకు అనుమతి ఇచ్చామని ఆయన తెలిపారు. దీనితో అదనంగా 16824 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు మరియు 2258 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. సిద్ధ వైద్య విధానానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించేలా చూసేందుకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు. 

ఆయుర్వేద సలహాదారు డాక్టర్ మనోజ్ నేసరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అభివృద్ధి   ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జె. రాధాకృష్ణన్డైరెక్టరేట్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ & హోమియోపతితమిళనాడు డైరెక్టర్ శ్రీ.ఎస్  గణేష్జాయింట్ డైరెక్టర్ శ్రీ. పి పార్థిభన్  ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. 

***(Release ID: 1784795) Visitor Counter : 62


Read this release in: English , Urdu , Hindi , Tamil