వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సిఇసిఎ) సంప్రతింపులను వేగవంతం చేసేందుకు ఆస్ట్రేలియా వాణిజ్యమంత్రితో చర్చించిన పీయూష్ గోయల్
Posted On:
23 DEC 2021 1:15PM by PIB Hyderabad
ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సిఇసిఎ) సంప్రతింపులను వేగవంతం చేసేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆస్ట్రేలియా వాణిజ్య, పర్యాటక, పెట్టుబడుల మంత్రి డాన్ తెహాన్ ఎంపితో ఈ వారం చర్చలు జరిపారు.
డిసెంబర్ 21, 2021న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో , ఇరుపక్షాల ముఖ్య ప్రతినిధులు, సంధానకర్తల మధ్య జరిగిన వివిధ దశల చర్చలలో సాధించిన పురోగతిని ప్రశంసిస్తూ, తాత్కాలిక ఒప్పందాన్ని త్వరగా సమాప్తి చేసే దిశగా ముందుకు వెళ్ళడం గురించి మంత్రులు చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు అత్యంత పురోగమనంలో ఉండటాన్ని ఇరువురు మంత్రులూ ప్రశంసిస్తూ, ఒప్పందాన్ని మరింత బలోపేతం చేయాలనే నిర్ణయంతో, సమగ్ర ఒప్పందానికి మార్గాన్ని సుగమం చేయడానికి చర్చలను వేగవంతం చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.
రెండు ఆర్థిక వ్యవస్థలకు, ప్రజలకు లబ్ధి చేకూర్చడమే కాక నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థకు తాము కట్టుబడి ఉన్నామనే విషయాన్ని ప్రతిఫలించే సమతుల వాణిజ్య ఒప్పందాన్ని చేసుకునేందుకు ఎదురుచూస్తున్నట్టు మంత్రులు అంగీకరించారు.
***
(Release ID: 1784587)
Visitor Counter : 170