సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఎస్.సి/ఎస్.టి/ఓ.బి.సి. విద్యార్థులకు - ఉపకార వేతనాలు
Posted On:
22 DEC 2021 4:55PM by PIB Hyderabad
ఎస్.సి., ఓ.బి.సి. విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం కోసం, కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత విభాగం, క్రింది పథకాలను అమలు చేస్తోంది:
1. ఎస్.సి. విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్
2. తొమ్మిది, పది తరగతులు చదువుతున్న ఎస్.సి. విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్
3. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్
4. ఉన్నత శ్రేణి విద్య
5. ఓ.బి.సి. విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్
6. ఓ.బి.సి. విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్
7. ఈ.బి.సి. విద్యార్థులకు డాక్టర్ అంబేద్కర్ పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్
8. డి.ఎన్.టి. విద్యార్థులకు డాక్టర్ అంబేద్కర్ ప్రీ-మెట్రిక్ మరియు పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్.
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన, ఎస్.సి. విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ మరియు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం రాష్ట్ర ప్రభుత్వ / కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగం ద్వారా అమలు చేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు దరఖాస్తులను ఆహ్వానించి, లబ్ధిదారులకు స్కాలర్‌షిప్ మొత్తాన్ని పంపిణీ చేస్తాయి. అర్హులైన వారందరికీ ఈ పథకాలు అందుబాటులో ఉంటాయి. షెడ్యూల్డ్ కులాలకు చెందిన తక్కువ ఆదాయ విద్యార్థులు విదేశాలలో మాస్టర్ డిగ్రీ లేదా పి.హెచ్.డి. కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక స్థితి ని మెరుగుపరచుకుని, ప్రయోజనం పొందటానికి వీలుగా నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ (ఎం.ఓ.ఎస్) ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఎన్.ఓ.ఎస్. పథకం కింద, అభ్యర్థులు ప్రవేశం పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ కు సంబంధిత భారతీయ మిషన్ / రాయబార కార్యాలయం ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించడం జరుగుతుంది. నిర్వహణ మరియు ఆకస్మిక భత్యం సంబంధిత భారతీయ మిషన్ / రాయబార కార్యాలయం ద్వారా అభ్యర్థికి అతని / ఆమె విదేశీ బ్యాంకు ఖాతా ద్వారా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రాతిపదికన చెల్లిస్తారు.
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన - ఓ.బి.సి. విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్; ఈ.బి.సి. విద్యార్థులకు డాక్టర్ అంబేద్కర్ పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్; డి.ఎన్.టి. విద్యార్థులకు డాక్టర్ అంబేద్కర్ ప్రీ-మెట్రిక్ మరియు పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ లను రాష్ట్ర ప్రభుత్వం / కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా అమలు చేయడం జరుగుతోంది. అర్హులైన విద్యార్థులందరికీ ఈ పథకాలు వర్తింపజేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు పైన పేర్కొన్న కేంద్ర సహాయానికి అదనంగా నిధుల కోసం తగిన ఏర్పాటు చేస్తాయి.
దేశంలోని ఎస్.టి. విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడానికి, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ క్రింది పథకాలను అమలు చేస్తోంది:
i) తొమ్మిది, పది తరగతులు చదువుతున్న ఎస్.టి. విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్
ii) 11వ తరగతి మరియు అంతకు మించి చదువుతున్న ఎస్.టి. విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్
iii) ఉన్నత విద్య అభ్యసించే ఎస్.టి. విద్యార్థులకు జాతీయ ఫెలోషిప్ మరియు స్కాలర్‌షిప్.
iv) ఎస్.టి. విద్యార్థులకు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్.
పైన పేర్కొన్న పథకాలలో, క్రమ సంఖ్య (i) నుండి (ii) వరకు ఉన్న స్కాలర్‌షిప్ పథకాలు - తల్లిదండ్రుల ఆదాయం 2 లక్షల 50 వేల వరకు ఉండి, 9వ తరగతి నుండి పీ.హెచ్.డీ వరకు చదువుకోవడానికి అర్హులైన విద్యార్థులందరికీ వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలకు ఈ నిధులు విడుదల చేయడం జరుగుతుంది. తదనంతరం, వారు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి) ద్వారా అర్హులైన ఎస్.టి. విద్యార్థులందరి బ్యాంక్ ఖాతాకు ఈ స్కాలర్‌షిప్ మొత్తాన్ని పంపిణీ చేస్తారు.
పైన క్రమ సంఖ్య (iii) లో పేర్కొన్న పథకాన్ని, మంత్రిత్వ శాఖ అమలుచేసి, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి) ద్వారా, విద్యార్థులు లేదా విద్యా సంస్థలకు నిధులు విడుదల చేస్తుంది. ప్రతిభ ఆధారంగా ఉన్నత విద్య కోసం అమలు చేసే ఈ పథకంలో నేషనల్ ఫెలోషిప్ మరియు నేషనల్ స్కాలర్‌షిప్ అనే రెండు భాగాలు ఉన్నాయి. నేషనల్ ఫెలోషిప్ కింద, ఎం.ఫిల్. మరియు పి.హెచ్.డి. అభ్యసించడం కోసం ప్రతి సంవత్సరం 750 అవార్డులు ఇస్తున్నారు. అదేవిధంగా, నేషనల్ స్కాలర్‌షిప్ కింద, ఐ.ఐ.టి., ఎయిమ్స్; ఎన్.ఐ.ఐ.టి. వంటి అత్యున్నత ప్రమాణాలు గల విద్యాసంస్థలలో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం ప్రతి సంవత్సరం 1000 ఉపకారవేతనాలు అందిస్తారు.
క్రమ సంఖ్య (iv) వద్ద ఉన్న పథకాన్ని, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. సంబంధిత భారతీయ మిషన్ / రాయబార కార్యాలయం ద్వారా ఉపకార వేతనాల మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేయడం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం ప్రతి సంవత్సరం 20 మందికి ఈ ఉపకార వేతనాలు అందజేస్తారు.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ ఎ. నారాయణ స్వామి ఈరోజు రాజ్యసభ కు లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు.
*****
(Release ID: 1784471)
Visitor Counter : 222