మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

జాతీయ శిశు సంర‌క్ష‌ణశాల‌ ప‌థ‌కం

Posted On: 22 DEC 2021 1:38PM by PIB Hyderabad

పని చేసే తల్లుల యొక్క పిల్లల సంర‌క్ష‌ణ  కోసం కేంద్ర  మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 01.01.2017 నుండి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా  కేంద్ర ప్రాయోజిత పథకంగా 'జాతీయ శిశు సంర‌క్ష‌ణ శాల‌ల ప‌థ‌కం'ను (నేష‌న‌ల్ క్రెచ్ స్కీమ్‌)  అమలు చేస్తోంది, ఈ ప‌థ‌కం కింద ప‌ని చేసే త‌ల్లుల పిల్లలకు (6 నెలల నుండి 6 సంవత్సరాల వయస్సు గల వారికి) డే కేర్ సౌకర్యాలను అందిస్తారు.  ఈ పథకం యొక్క మూడవ పక్ష మూల్యాంకనంలో భాగంగా 2020లో నీతీ అయోగ్ ద్వారా.. పని చేసే తల్లుల పిల్లల కోసం, జాతీయ‌ పిల్లల సంర‌క్ష‌ణ శాల‌ల‌ అధ్యయనం నిర్వహించారు, ఈ అధ్య‌య‌నం పిల్లల సంర‌క్ష‌ణ శాల కవరేజీని మ‌రింత‌గా పెంచాలని సిఫార్సు చేసింది. మౌలిక సదుపాయాల అంతరాలను పూడ్చడం, స్థానిక అవసరాలను తీర్చడంతో పాటుగా స్థానిక కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంపొందించడం, పిల్లల సంర‌క్ష‌ణ శాల‌ల‌ వర్కర్లు, సహాయకులకు శిక్షణ వంటి చర్యలను కూడా అయోగ్ సిఫార‌సు చేసింది; వ్యయ నిబంధనలకు సవరణను కూడా సూచించింది.  అంతేకాకుండా, పని చేసే తల్లుల పిల్లల కోసం జాతీయ‌ పిల్లల సంర‌క్ష‌ణ శాల‌ పథకం మార్గదర్శకాల ప్రకారం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో జిల్లా స్థాయిలో శిశు సంర‌క్ష‌ణ శాల‌ల సేవల అవసరాల‌ సర్వే మరియు ప్రస్తుత  శిశు సంర‌క్ష‌ణ శాల‌ల మ్యాపింగ్ ద్వారా విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ ప‌థ‌కం  ప్రయోజనం కోసం పని చేసే తల్లులు, పిల్లల ఆవశ్యకత, సుముఖతను నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు బేస్‌లైన్ సర్వేలను కూడా నిర్వహిస్తాయి. రిజిస్ట్రేషన్ కోసం నిబంధనలు.  శిశు సంర‌క్ష‌ణ శాల‌ల ఏర్పాటు మరియు నిర్వహణ. పరిశుభ్రత విషయాలతో సహా ప్రథమ చికిత్స. తల్లిపాలు మరియు పోషకాహారం పథకం మార్గదర్శకాలు నిర్దేశించబడ్డాయి. పని చేసే తల్లుల పిల్లల కోసం జాతీయ పిల్లల సంర‌క్ష‌ణ శాల‌ పథకంలో భాగంగా దేశంలో గత మూడు సంవత్సరాలలో, అంటే 2017-18, 2018-19 మరియు 2019-20లో ప‌ని చేస్తున్న‌పిల్లల సంర‌క్ష‌ణ శాల‌ సంఖ్య వరుసగా 18040, 8018 మరియు 6458గా నిలిచింది. కోవిడ్  మహమ్మారి వ్యాప్తిని నిరోధించే విష‌యంలో భాగంగా కోవిడ్‌-19 వ్యాప్తి చెందినప్పటి నుండి దేశంలో పిల్లల సంర‌క్ష‌ణ శాల‌ పనిచేయడం లేదు. ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి  స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక‌ సమాధానంలో తెలిపారు.
                                                                            ****



(Release ID: 1784414) Visitor Counter : 222


Read this release in: Urdu , English , Tamil