మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో 23 న "హునార్ హాత్" 35వ ఎడిషన్ ను ప్రారంభించనున్న కేంద్ర పర్యావరణ, అటవీ ,వాతావరణ మార్పు కార్మిక -ఉపాధి శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ , కేంద్ర విదేశీ వ్యవహారాలు , సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి


కళ , కళాత్మకత వారసత్వాన్ని రక్షించడమే కాకుండా, దేశీయ ఉత్పత్తులకు కొత్త శక్తి, మార్కెట్ ,అవకాశాలను కల్పించిన ప్రభుత్వం:శ్రీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ

Posted On: 22 DEC 2021 5:23PM by PIB Hyderabad

"వోకల్ ఫర్ లోకల్" ,"పాపులర్ అండ్ పర్ఫెక్ట్ బ్రాండ్" అయిన "హునార్ హాత్"ను కేంద్ర పర్యావరణ, అటవీ ,వాతావరణ మార్పు ,కార్మిక -ఉపాధి శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ,కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి డిసెంబర్ 23, 2021 న న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభించనున్నారు.

డిసెంబర్ 23, 2021 నుంచి జనవరి 5, 2022 వరకు నిర్వహించే ఈ 14 రోజుల "హునార్ హాత్"లో 30 కి పైగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన 700 మందికి పైగా కళాకారులు, చేతివృత్తుల వారు పాల్గొంటున్నారు

ఈ కార్య క్ర మంలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ డాక్ట ర్ హర్ష వర్ధన్ , ఎంపిలు శ్రీ హన్స్ రాజ్ హన్స్ , శ్రీ మనోజ్ కుమార్ తివారీ, శ్రీ రమేష్ బిధురి, శ్రీ పర్వేష్ సాహిబ్ సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.

కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ రోజు న్యూఢిల్లీలో మాట్లాడుతూ, "హునార్ హాత్" "3వి" - ల "విశ్వకర్మ విరాసాత్ కా వికాస్" యొక్క "శక్తివంతమైన పరిపూర్ణ వేదిక" గా నిరూపితం అయిందని అన్నారు.  దేశ కళ ,కళాత్మకత వారసత్వాన్ని ప్రభుత్వం రక్షించడమే కాకుండా, దేశీయ ఉత్పత్తులకు కొత్త శక్తి , మార్కెట్ అవకాశాలను కూడా ప్రభుత్వం అందించిందని ఆయన అన్నారు.

గత 6 సంవత్సరాలలో 7 లక్షల 50 వేల మందికి పైగా కళాకారులు, చేతివృత్తుల వారు ,వారితో సంబంధం ఉన్న వ్యక్తులకు "హునార్ హాత్" ద్వారా ఉపాధి ,స్వయం ఉపాధి అవకాశాలను కల్పించినట్లు శ్రీ నఖ్వీ తెలిపారు. వారిలో 40 శాతానికి పైగా మహిళా కళాకారులనీ చెప్పారు.

ఆస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, లడఖ్, జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, నాగాలాండ్, మేఘాలయ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్, గోవా, పుదుచ్చేరి, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, చండీగఢ్, హర్యానాతో సహా 30 కి పైగా రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల నుండి అద్భుతమైన ,ఆకర్షణీయమైన దేశీయ చేతితో తయారు చేసిన ఉత్పత్తులను "హునార్ హాత్" 35 వ ఎడిషన్ లో ప్రదర్శిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సాంప్రదాయ వంటకాలు కూడా ఈ "హునార్ హాత్" వద్ద అందుబాటులో ఉంటాయి.

పంకజ్ ఉధాస్ అల్తాఫ్ రాజా, దలేర్ మెహందీ, సురేష్ వాడేకర్, సుదేశ్ భోన్స్లే, కవితా కృష్ణమూర్తి, అమిత్ కుమార్, మనోజ్ తివారీ, పవన్ సింగ్, భూమి త్రివేది, మోహిత్ ఖన్నా, జస్వీర్ జస్సీ, ప్రియా మాలిక్, అహ్సాన్ ఖురేషి, రేఖా రాజ్ ,ప్రఖ్యాత నటులు పునీత్ ఇస్సార్, గుఫి పెయింటాల్ వంటి కళాకారుల సాంస్కృతిక, సంగీత ప్రదర్శనలు, చారిత్రాత్మక సీరియల్ "మహాభారత్" ప్రత్యక్ష ప్రదర్శన, సంప్రదాయ సర్కస్ న్యూఢిల్లీ లోని "హునార్ హాత్"కు ప్రధాన ఆకర్షణ కానున్నాయి.

                                                                       

****



(Release ID: 1784399) Visitor Counter : 117


Read this release in: English , Urdu , Hindi , Punjabi