వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
తెలంగాణసహా దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
తెలంగాణ నుంచి మూడు రెట్లు పెరిగిన వరి, బియ్యం సేకరణ
గత ఐదేళ్లలో ఎంఎస్ పి 1.5 రెట్లు పెరిగిన ఎం ఎస్ పి తో రైతులకు 4-5 రెట్లు లాభం
భవిష్యత్తులో ఎఫ్ సిఐకి ఉప్పుడు బియ్యం సరఫరాను నిలిపివేస్తామని 2021 అక్టోబర్ లో
లిఖితపూర్వకంగా తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
గత ఏడాది రబీ సీజన్ లో పండించిన 27 లక్షల టన్నుల బియ్యాన్ని అందించడంలో తెలంగాణ విఫలం
Posted On:
21 DEC 2021 3:25PM by PIB Hyderabad
గత ఐదేళ్లలో తెలంగాణ నుంచి వరి, బియ్యం సేకరణ మూడు రెట్లు పెరిగిందని, కనీస మద్దతు ధర కూడా గణనీయంగా పెరిగిందని, రాష్ట్ర రైతులకు నాలుగు నుంచి ఐదు రెట్లు ప్రయోజనం పెరిగిందని వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు తెలిపారు.
గత ఏడాది రబీ సీజన్ లో తెలంగాణ రైతులు పండించిన బియ్యం , వరి అంగీకరించిన పరిమాణాన్ని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి అన్నారు. ఇప్పటివరకు, రాష్ట్రం ఇంకా ఎఫ్ సిఐ గోడౌన్లకు 27 లక్షల టన్నులను పంపిణీ చేయలేదనీ, ఇందులో సుమారు 14 లక్షల టన్నుల వుప్పుడు బియ్యం, 13 లక్షల టన్నుల ముడి బియ్యం ఉన్నాయని చెప్పారు. దేశానికి అదనపు పరిమాణం అనవసరమైనప్పటికీ తెలంగాణ రైతుల పట్ల ప్రత్యేక గౌరవంగా గత ఏడాది రబీ సీజన్ లో వారు పండించిన 20 లక్షల టన్నుల పార్బాయిల్డ్ బియ్యం ను సేకరించడానికి కేంద్రం అంగీకరించిందని గోయల్ తెలిపారు. బియ్యం పంపిణీ కోసం కేంద్రం పదేపదే రాష్ట్ర ప్రభుత్వానికి పొడిగింపులు కూడా ఇచ్చిందని ఆయన చెప్పారు.
పార్బాయిల్డ్ రైస్ అంశంపై గోయల్ మాట్లాడుతూ, ఎఫ్ సిఐ నాలుగు సంవత్సరాల పాటు డిమాండ్ ను తీర్చడానికి తగినంత నిల్వలను కలిగి ఉందని , సెంట్రల్ పూల్ కోసం ఎఫ్ సిఐ బియ్యం కొనుగోలు చేయడం దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో డిమాండ్ పై ఆధారపడి ఉంటుందని రాష్ట్రంతో చేసుకున్న ఎంఒయు స్పష్టంగా
చెబుతోందని , దీని ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 4, 2021 నాటి లేఖలో రాష్ట్రం భవిష్యత్తులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పార్బాయిల్డ్ బియ్యం పంపిణీ చేయదని లిఖిత పూర్వక హామీ ఇచ్చిందని
గోయల్ చెప్పారు.
ముడి బియ్యం కొనుగోలులో ఎలాంటి సమస్య లేదని, ఎఫ్ సిఐ రాష్ట్రం నుండి కొనుగోళ్లను గణనీయంగా పెంచిందని మంత్రి తెలిపారు. తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన చెప్పారు.ఒప్పందం ప్రకారం తెలంగాణలో గత ఏడాది రబీ సీజన్ లో పండించిన అంగీకరించిన పరిమాణాన్ని తెలంగాణ ప్రభుత్వం త్వరగా సరఫరా చేయాలని, రాష్ట్రంలోని రైతులను తప్పుదోవ పట్టించరాదని ఆయన అన్నారు.
రేక్ లు , స్టోరేజీ స్థలం లభ్యత గురించి అడిగిన ప్రశ్నలకు శ్రీ గోయల్ సమాధానమిస్తూ, అటువంటి సమస్య ఏదీ లేదని, దారుణమైన ఆరోపణలు చేయడానికి బదులుగా రాష్ట్రం అంగీకరించిన పరిమాణంలో ధాన్యాన్ని సరఫరా చేయాలని స్పష్టం చేశారు.
భార త ప్ర భుత్వం ఎల్లప్పుడూ తెలంగాణ రైతులతో, తెలంగాణ ప్రజలతో ఉంటుందని, , వారి సంక్షేమం కోసం అన్ని వేళలా చర్యలు తీసుకుంటుందని శ్రీ గోయల్ నొక్కి చెప్పారు..
*******
(Release ID: 1783957)
Visitor Counter : 555