పర్యటక మంత్రిత్వ శాఖ

'స్వదేశ్ దర్శన్' పథకం కింద ఐదు బౌద్ధ సర్క్యూట్ ప్రాజెక్టులను మంజూరు చేసిన పర్యాటక మంత్రిత్వ శాఖ: జి. కిషన్ రెడ్డి

Posted On: 20 DEC 2021 5:20PM by PIB Hyderabad

దేశంలో పర్యాటక మౌలిక సదుపాయాలను సృష్టించాలనే లక్ష్యంతో పర్యాటక మంత్రిత్వ శాఖ, 'స్వదేశీ దర్శన్', 'తీర్థయాత్ర పునరుజ్జీవనం -ఆధ్యాత్మిక, వారసత్వ పెంపుదల ప్రచారం’' (ప్రషాద్) పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు,/ కేంద్ర సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తోంది.

స్వదేశ్ దర్శన్' పథకం కింద మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ లో బౌద్ధ సర్క్యూట్ థీమ్ కింద ఉత్తరప్రదేశ్ లో ఒకటి సహా  5 ప్రాజెక్టులను మంజూరు చేసింది.  అదనంగా, రు. 17.93 కోట్లతో  ఉత్తర ప్రదేశ్ ,బీహార్ లో వేసైడ్ సౌకర్యాల అభివృద్ధి' అనే మరో ప్రాజెక్ట్; వారణాసి-గయ; లక్నో-అయోధ్య- లక్నో; గోరఖ్ పూర్ కుషినగర్; కుషినగర్ - గయ కుషినగర్ మార్గాలు కూడా మంజూరు అయ్యాయి. పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రషాద్ పథకం కింద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సారనాథ్ లోని ధమెక్ స్థూపం వద్ద రూ. 7.34 కోట్ల సౌండ్ అండ్ లైట్ షో , సారనాథ్ వద్ద రూ. 2.20 కోట్ల వ్యయంతో బుద్ధ థీమ్ పార్క్ మంజూరు చేశారు.

ఈ ప్రాంతానికి అనుసంధానాన్ని పెంపొందించే కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి 20 అక్టోబర్ 2021న ప్రారంభించారు. దీనికి అదనంగా, "బోధగయపై ప్రత్యేక దృష్టి సారించి బౌద్ధ సంస్కృతి -పర్యాటకం గ్లోబల్ సెంటర్ గా భారతదేశ పునరుద్ధరణ" కోసం సమన్వయ వ్యూహాన్ని రూపొందించే ఉద్దేశ్యంతో ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేశారు. కార్యాచరణ ప్రణాళికలో 4 వర్టికల్స్ కింద జోక్యం ఉంటుంది: ఐ) కనెక్టివిటీ; 2) మౌలిక సదుపాయాలు - లాజిస్టిక్స్; 3) సాంస్కృతిక వారసత్వం, పరిశోధన ,విద్య; 4) ప్రజా అవగాహన , కమ్యునికేషన్ . అవుట్ రీచ్ . కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖను నోడల్ మంత్రిత్వ శాఖగా చేశారు

పర్యాటక మంత్రిత్వ శాఖ తన ప్రస్తుత ప్రచార కార్యకలాపాల్లో భాగంగా దేశంలోని బౌద్ధ ప్రదేశాలతో సహా వివిధ పర్యాటక ప్రదేశాలను దేశీయ , అంతర్జాతీయ మార్కెట్లలో సంపూర్ణంగా ప్రోత్సహించడం పై దృష్టి పెట్టింది.

ఈ సమాచారాన్ని పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు

 

*******



(Release ID: 1783638) Visitor Counter : 157


Read this release in: English , Urdu , Hindi , Punjabi