రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

'ఈ-చ‌వ్వానీ' ప్రాజెక్ట్ కింద కంటోన్మెంట్ బోర్డ్ పౌరులకు జీఐఎస్‌ ఆధారిత ఆటోమేటిక్ నీటి సరఫరా వ్యవస్థ

Posted On: 20 DEC 2021 11:21AM by PIB Hyderabad

కంటోన్మెంట్ బోర్డుల పౌరుల కోసం జీఐఎస్‌ ఆధారిత ‘ఆటోమేటిక్ వాటర్ సప్లై సిస్టమ్’ ను ఇటీవలే కేంద్ర  రక్ష‌ణ శాఖ‌ మంత్రి ప్రారంభించారు. 'డిఫెన్స్ ఎస్టేట్స్ డే 2021' సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ఈ విధానాన్ని ప్రారంభించారు. కంటోన్మెంట్ బోర్డుల కోసం జీఐఎస్‌ ఆధారిత నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన మాడ్యూల్‌ను 'భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్‌' (బీఐఎస్ఏజీ) ర‌క్ష‌ణ శాఖ కార్య‌ద‌ర్శి మరియు డిఫెన్స్ ఎస్టేట్స్ డైరెక్టర్ జనరల్ మార్గదర్శకత్వంలో అభివృద్ధి చేయబడింది,
           కంటోన్మెంట్ పౌరులకు మెరుగైన నీటి కనెక్షన్‌ని అందించడానికి ఇది సులభమైన మరియు వేగవంతమైన ఆటోమేటెడ్ అప్లికేషన్‌ను అందిస్తుంది:
             ఎ) నీటి సరఫరా కనెక్షన్ యొక్క స్థానాన్ని గుర్తించేందుకు వీలుగా పౌరుల‌కు సౌకర్యాన్ని క‌ల్పిస్తుంది.
             బి) ఇది స్వయంచాలకంగా సమీపంలోని నీటి పైప్‌లైన్‌ను గుర్తిస్తుంది.
              సీ) అన్ని నీటి సరఫరా లైన్ల సామర్థ్యమును కూడా ఇందులో నిర్వచించబడింది.
              డి) ఇది స్థానం ఆధారంగా దూరాన్ని గణిస్తుంది మరియు;
             ఈ) కనెక్షన్ ఛార్జీలతో సహా దరఖాస్తుదారు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా ఆన్‌లైన్‌లో చెల్లించే వీలు క‌ల్సిస్తుంది.

           ఈ మాడ్యూల్ ఆన్‌లైన్‌లో నీటి కనెక్షన్ కోసం మంజూరును మరింత సులభతరం చేస్తుంది. సిస్టమ్ అనుమతిని జారీ చేసిన తర్వాత, కాంటో్న్మెంట్‌ బోర్డ్‌లోని సంబంధిత డిపార్ట్‌మెంట్ ఇచ్చిన సమయ వ్యవధిలో అసలు నీటి కనెక్షన్‌ని నిర్ధారిస్తుంది. ఈ విధానం వాడ‌కందారుల‌కు అత్యంత సానుకూలంగా,  సమర్థవంతంగా మరియు పారదర్శకంగా ఉంటుంది. జీఐఎస్ ఆధారిత నీటి స‌ర‌ఫ‌రా  వ్యవస్థ దేశంలోనే మొట్టమొదటిది. ఇది "కనీస ప్రభుత్వం జోక్యంపై  ఆధారపడింది మరియు నీటి కనెక్షన్ యొక్క క్లియరెన్స్/ మంజూరీ కోసం వ్య‌క్తుల‌ జోక్యం లేనందున "గరిష్ట పాలన" భావనకు మద్దతునిస్తుంది. సాంప్రదాయ నీటి సరఫరా వ్యవస్థలో, పౌరులు స్థానిక సంస్థలకు దరఖాస్తు చేస్తారు. ఆ త‌రువా దరఖాస్తు ప్రాసెస్ చేయబడుతుంది, దీనికి చాతా సమయం పడుతుంది. ఛార్జీలు ఆఫ్‌లైన్‌లో జమ చేయాల్సి ఉంటుంది. నీటి కనెక్షన్ మంజూరు చేసేందుకు గాను ఎటువంటి కాల వ్యవధి నిర్వచించబడలేదు. బీఐఎస్ఏజీ  జీఐఎస్ మాడ్యూల్‌ని విజయవంతంగా అమలు చేసింది. ఈ -చ‌వ్వానీ పోర్టల్‌తో ఈ వ్య‌వ‌స్థను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్‌) ఏకీకరణను చేసింది. 'డిఫెన్స్ ఎస్టేట్స్ డే'ను డిసెంబర్ 16, 2021న డిఫెన్స్ ఎస్టేట్స్ డైరెక్టర్ జనరల్ జరుపుకున్నారు.

***

 



(Release ID: 1783476) Visitor Counter : 150