రక్షణ మంత్రిత్వ శాఖ
నేషనల్ క్యాడెట్ కోర్స్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగం చేసేందుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి
Posted On:
18 DEC 2021 4:11PM by PIB Hyderabad
ముఖ్య ముఖ్యాంశాలు:
• 127 కోస్టల్ ఏరియా NCC విభాగాల నుండి మొత్తం 3,40,000 మంది క్యాడెట్‌లు నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
• వివిధ ప్రదేశాలలో NCC క్యాడెట్లు దాదాపు ఆరు టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు
• సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను రహదారి నిర్మాణంలో ఉపయోగించేందుకు NHAIకి అప్పగించాలి
జాతీయ క్యాడెట్ కార్ప్స్ (NCC) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా NHAI చే రోడ్ల నిర్మాణం కోసం పునీత్ సాగర్ అభియాన్ ఇతర స్వచ్ఛతా కార్యకలాపాల సమయంలో NCC క్యాడెట్‌లు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి ఉపయోగించేందుకు అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి. పర్యావరణ భద్రతకు అనుకూలమైన పరిస్థితులను ప్రోత్సహించడానికి, సృష్టించడానికి, NCC సముద్ర తీరాలు/బీచ్‌ల నుంచి వ్యర్థాలను తొలగించి, ప్లాస్టిక్ వ్యర్థాలు లేని సముద్ర తీరాలను చూడడం గురించి అవగాహన పెంచడానికి పునీత్ సాగర్ అభియాన్ అనే దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది.
స్థానిక జనాభాలో భవిష్యత్ తరాలలో 'పరిశుభ్రమైన సముద్ర తీరాలు/బీచ్‌ల ప్రాముఖ్యత' అనే సందేశాన్ని ప్రచారం చేయడం ఈ ప్రచారం లక్ష్యం. 127 కోస్టల్ ఏరియా ఎన్‌సిసి యూనిట్‌ల నుండి మొత్తం 3,40,000 మంది క్యాడెట్‌లు నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు వివిధ ప్రదేశాలలో NCC క్యాడెట్లు దాదాపు ఆరు టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు.
సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించడానికి NHAIకి అప్పగించాలని చూస్తున్నారు. NCC మరియు NHAI మధ్య అవగాహన ఒప్పందంపై 17 డిసెంబర్ 2021న డైరెక్టర్ జనరల్ NCC లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్ NHAI చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల్ కుమార్ మిశ్రా సంతకం చేసారు.
నేషనల్ క్యాడెట్ కోర్స్ కూడా IITలు NIITలు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ లాభదాయకమైన వినియోగానికి సహకారం కోసం సంప్రదించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ ఇప్పటికే తమ సాంకేతిక నైపుణ్యాన్ని ఇందులో పంచేందుకు అంగీకరించింది. నేషనల్ క్యాడెట్ కోర్స్ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంలో నిమగ్నమై ఉన్న స్వచ్చంద సంస్థలను సంప్రదిస్తుంది, వారిలో ఒకరైన ఒడిశా యువ చేతన సంఘటన్ సహాయం అందించడానికి ఇప్పటికే అంగీకరించింది.
బీచ్‌లను శుభ్రపరచడంతో పాటు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, హాని గురించి మన సహజ వనరులకు ప్లాస్టిక్ చేస్తున్న నష్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్యాడెట్‌లు సామూహిక అవగాహన ప్రచారాన్ని చేపట్టారు. క్యాడెట్‌లు ప్రజలు, పర్యాటకులు, స్థానిక దుకాణదారులు/విక్రయదారులు తీరప్రాంతంలో ఉన్న మత్స్యకారులతో కూడా సంభాషిస్తున్నారు, కరపత్రాలు పంపిణీ చేయడం, ప్రజలతో ప్రమాణాలు చేయించడం, థీమ్ ఆధారిత వీధి నాటకాలు, ర్యాలీలు/ఫుట్ పెట్రోలింగ్‌లు నిర్వహిస్తూ సముద్ర తీరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు.. ఇప్పటి వరకు, 64 వేర్వేరు స్థానాల్లో దాదాపు 1.5 లక్షల మంది క్యాడెట్లు పునీత్ సాగర్ అభియాన్‌లో పాల్గొన్నారు. సుమారు 17 లక్షల జనాభాపై తమ ప్రభావం చూపారు.
(Release ID: 1783182)
Visitor Counter : 131