ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
18 DEC 2021 9:27AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 136.66 కోట్ల డోసులను అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 84,565. ఇది 569 రోజుల కనిష్ట స్థాయి.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.24% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
రికవరీ రేటు 98.38% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.
గత 24 గంటల్లో 8,706 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,41,71,471 కు పెరిగింది.
గత 24 గంటల్లో 7,145 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు (0.57%) గత 75 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.
వారపు పాజిటివిటీ రేటు (0.62%) గత 34 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 66.28 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1783040)
Visitor Counter : 152