రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్‌ను ప్రారంభించిన రక్షణ మంత్రి

Posted On: 18 DEC 2021 2:27PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ కెపాసిటీ బిల్డింగ్ చొరవలో భాగంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్ ప్రధానమైన సెంట్రల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ల్యాండ్ సర్వేను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని 16 డిసెంబర్ 2021న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.

డిఫెన్స్ ఎస్టేట్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన  డొమైన్ స్పెషలైజేషన్‌లో భాగంగా నిరంతరం భూ సర్వేలను నిర్వహిస్తుంది.తద్వారా ఈ కార్యాచరణ రంగంలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డ్రోన్ సర్వేలు మరియు శాటిలైట్ ఇమేజరీ ఆధారిత సర్వేల వంటి అభివృద్ధి చెందుతున్న సర్వే టెక్నాలజీలలో ప్రత్యేకంగా సర్వేలలో పాల్గొనే ప్రభుత్వ అధికారులు మరియు సాంకేతిక సిబ్బంది శిక్షణ అవసరాలను తీరుస్తుంది. ఈ రోజుల్లో డిజిటల్ ఫోటోగ్రామెట్రిక్ టెక్నిక్‌లు, హై-రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ, ఎయిర్‌బోర్న్ మరియు టెరెస్ట్రియల్ లేజర్ స్కానర్ పరికరాల ఆధారంగా రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్‌లు రేఖాగణిత సర్వేయింగ్ మరియు మోడలింగ్ కోసం శక్తివంతమైన సాధనాల సమితిని అందించగలవు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సర్వేలో అటువంటి కొత్త పద్ధతులపై దృష్టి సారించింది. ఈ విషయంలో అభివృద్ధి చేయబడిన నైపుణ్యం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించబడే ప్రాతిపదిక మరియు ప్రత్యేక కోర్సులకు పాల్గొనేవారిని స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న స్వయంప్రతిపత్త సంస్థలతో సహా ఇతర కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో భాగస్వామ్యం చేయబడుతుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎన్‌ఆక్‌ఎస్‌సి, ఎన్‌ఐజిఎస్‌టీ, ఎస్‌పిఏ ఢిల్లీ వంటి ప్రీమియర్ సంస్థల నుండి సేవలను పొందుతుంది. సర్వే పరిశ్రమకు చెందిన నిపుణులను రిసోర్స్ ఫ్యాకల్టీగా పొందుతుంది.అతి త్వరలో ఇన్‌హౌస్ సామర్థ్యాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉంది.

రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..నిరంతర ప్రాతిపదికన భూ సర్వే చేపట్టాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాండ్ సర్వేను ఏర్పాటు చేయడానికి మార్గనిర్దేశం చేసినందుకు డిఫెన్స్ ఎస్టేట్ డిపార్ట్‌మెంట్‌ను సత్కరించారు. మరియు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా సదుపాయాన్ని తెరవడానికి గల ఆవశ్యకతను కూడా రక్షణమంత్రి నొక్కి చెప్పారు.

ఈ సందర్భంగా డిజిడిఇ శ్రీ అజయ్ కుమార్ శర్మ మాట్లాడుతూ డిజిడిఇ కెపాసిటీ బిల్డింగ్ ప్రాసెస్‌లో భాగంగా డిఫెన్స్ సెక్రటరీ డాక్టర్ అజయ్ కుమార్ చెప్పిన ఆలోచనా ప్రక్రియలో ఎన్‌ఐడిఎమ్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక పరాకాష్ట అని తెలియజేసారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని జాతీయ రంగంలోకి తీసుకురావడానికి, తాజా టెక్నిక్‌లలో సర్వే కోసం ఒక ప్రీమియర్ ట్రైనింగ్ సెంటర్‌గా మారడానికి తీసుకోబడిందని తెలిపారు.


 

***



(Release ID: 1783033) Visitor Counter : 89


Read this release in: English , Urdu , Hindi , Tamil