ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంపై నవీకరణ
Posted On:
17 DEC 2021 2:20PM by PIB Hyderabad
ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2025 నాటికి క్షయని అంతం చేయడానికి జాతీయ వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేస్తోంది. గ్లోబల్ TB నివేదిక, 2021 ప్రకారం, దేశం క్షయ వ్యాధి సంభావ్యతను 2015లో లక్ష జనాభాలో 217 నుండి 2020లో లక్ష జనాభాకు188 కు తగ్గించింది. (13% క్షీణత). మరణాల రేటు 2015లో లక్ష జనాభాకి 36గా ఉండగా 2019లోలక్షకు 33కు తగ్గింది.
కోవిడ్ మహమ్మారి సమయంలో, అంతరాయం లేని రోగనిర్ధారణ , చికిత్స సేవలను అందించడానికి చురుకైన కార్యక్రమాలు చేపట్టారు. TB కేసులను గుర్తించడానికి ప్రత్యేక క్షేత్రస్థాయి కార్యక్రమాలు కూడా చేపట్టారు.
2020 సంవత్సరంలో (జనవరి - డిసెంబర్), మొత్తం 18.12 లక్షల TB కేసులు నమోదు అయ్యాయి ఇది 2019 లో నోటిఫై చేయబడిన మొత్తం కేసుల కంటే 25% తక్కువ (ఇది 24.00 లక్షలు). 2021లో, COVID-19 పెద్ద ప్రభావం ఉన్నప్పటికీ, 17.6 లక్షల క్షయ కేసులను (అక్టోబర్, 2021 వరకు) కనిపెట్ట గలిగింది, ఇది 2020తో పోలిస్తే 18% ఎక్కువ.
కోవిడ్ ప్రభావాన్ని తగ్గించడానికి , గర్భిణీ స్త్రీలతో సహా TB రోగులందరికీ మందులు అందుబాటులో ఉండేలా, రోగనిర్ధారణకు అంతరాయం లేకుండా మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంది:
జనాభాలో క్షయ అనారోగ్యకేసుల వివరాల వెలికితీతకు మార్గాలు
i. వ్యాధి నిర్దారణ , చికిత్సలను వికేంద్రీకరించడానికి ఆయుష్మాన్ భారత్- హెల్త్ & వెల్‌నెస్ సెంటర్‌లతో ఏకీకరణ
ii. కోవిడ్ సమయంలో ఇంటింటికీ ఉచిత TB మందులను అందించే కాలం పొడిగించారు
iii. ఇన్‌ఫ్లుఎంజా వంటి అనారోగ్యం (ILI) , తీవ్ర అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు (SARI) వంటి అన్ని అనుమానిత కేసులకు ద్వి-దిశాత్మక TB-COVID స్క్రీనింగ్ , TB స్క్రీనింగ్/టెస్టింగ్ అమలు
iv. మాలిక్యులర్ డయాగ్నస్టిక్ లాబొరేటరీస్ ఉప-జిల్లా స్థాయిలకు పెంచండం
v. ఉప కేంద్రం నుండి ప్రజా రోగ్యకేంద్రం- PHC వరకు, PHC నుండి కేంద్రీయ ఆరోగ్య కేంద్రం CHC వరకు , CHC నుండి జిల్లా / రాష్ట్ర స్థాయి ప్రయోగశాలలకు నమూనా సేకరణ , రవాణా.
vi. కమ్యూనిటీ అవగాహన పెంచడానికి IEC ప్రచారాలను( సమాచారం- విజ్ఞానం-సూచన లను) తీవ్రతరం చేయడం
రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా TB సమాచారం
|
వరుస నెం.
|
రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రాంతాలు
|
2019
|
2020
|
2021 (జనవరి నుంచి అక్టోబరు వరకూ)
|
1
|
అండమాన్ , నికోబార్
|
587
|
480
|
417
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
98869
|
64119
|
70130
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
2938
|
2523
|
2347
|
4
|
అస్సాం
|
48669
|
35486
|
30776
|
5
|
బీహార్
|
122671
|
99661
|
108869
|
6
|
చండీగఢ్
|
7026
|
4319
|
3948
|
7
|
ఛత్తీస్‌గఢ్
|
43718
|
29387
|
26294
|
8
|
దాద్రా మరియు నగర్ హవేలీ, డామన్ , డయ్యూ
|
1497
|
964
|
821
|
9
|
ఢిల్లీ
|
107982
|
87019
|
87669
|
10
|
గోవా
|
2410
|
1666
|
1634
|
11
|
గుజరాత్
|
159158
|
120623
|
119800
|
12
|
హర్యానా
|
73997
|
62967
|
58203
|
13
|
హిమాచల్ ప్రదేశ్
|
17446
|
13450
|
12396
|
14
|
జమ్మూ & కాశ్మీర్
|
11860
|
8850
|
9165
|
15
|
జార్ఖండ్
|
56632
|
45767
|
44061
|
16
|
కర్ణాటక
|
91703
|
65955
|
59035
|
17
|
కేరళ
|
25617
|
20925
|
18021
|
18
|
లడఖ్
|
#N/A
|
238
|
229
|
19
|
లక్షద్వీప్
|
15
|
20
|
12
|
20
|
మధ్యప్రదేశ్
|
187407
|
138059
|
136988
|
21
|
మహారాష్ట్ర
|
227348
|
160629
|
156672
|
22
|
మణిపూర్
|
2553
|
1581
|
1495
|
23
|
మేఘాలయ
|
5528
|
4147
|
3436
|
24
|
మిజోరం
|
2944
|
2223
|
1504
|
25
|
నాగాలాండ్
|
4794
|
3575
|
3159
|
26
|
ఒడిషా
|
53612
|
45726
|
42708
|
27
|
పుదుచ్చేరి
|
4606
|
2772
|
2927
|
28
|
పంజాబ్
|
58204
|
46379
|
43539
|
29
|
రాజస్థాన్
|
175218
|
137958
|
125999
|
30
|
సిక్కిం
|
1432
|
1335
|
1165
|
|
వరుస
|
రాష్ట్రం/ప్రాంతం
|
2019
|
2020
|
2021 (Jan-Oct)
|
31
|
తమిళనాడు
|
110845
|
70550
|
67551
|
32
|
తెలంగాణ
|
71655
|
63351
|
49596
|
33
|
త్రిపుర
|
2761
|
2072
|
2082
|
34
|
ఉత్తర ప్రదేశ్
|
486385
|
368348
|
380520
|
35
|
ఉత్తరాఖండ్
|
26060
|
20091
|
19073
|
36
|
పశ్చిమ బెంగాల్
|
110668
|
79428
|
75385
|
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
***
(Release ID: 1782999)