భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
సముద్రయాన్ ప్రాజెక్టు
Posted On:
16 DEC 2021 2:56PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం ప్రారంభించిన "డీప్ ఓషన్ మిషన్" కింద, లోతైన సముద్ర అన్వేషణ కోసం మానవ సహిత శాస్త్రీయ సబ్మెర్సిబుల్ ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రాజెక్టు కు "సముద్రయాన్" అని పేరు పెట్టారు. సముద్ర జలాల్లో 500 మీటర్ల లోతున ప్రయాణించే ఒక మానవ సహిత సబ్మెర్సిబుల్ వ్యవస్థ కోసం, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ, జాతీయ సముద్ర సాంకేతిక సంస్థ (ఎన్.ఐ.ఓ.టి), ఒక " 'పర్సనల్ స్పియర్' ని అభివృద్ధి చేసి పరీక్షించింది.
500 మీటర్ల నీటి లోతు వరకు సిబ్బంది మాడ్యూల్ గా ఉపయోగించేందుకు 2.1 మీటర్ల వ్యాసం కలిగిన పర్సనల్ స్పియర్ ను తేలికపాటి ఉక్కును ఉపయోగించి అభివృద్ధి చేయడం జరిగింది. సాగర్ నిధి అనే పరిశోధన నౌకను ఉపయోగించి బంగాళాఖాతం జలాల్లో 600 మీటర్ల లోతు వరకు దీనిని 2021 అక్టోబర్ లో పరీక్షించారు.
ఇదేవిధంగా, 6000 మీటర్ల నీటి లోతు వరకు ప్రయాణించే మానవ సహిత సబ్మెర్సిబుల్ వ్యవస్థ కోసం, టైటానియం మిశ్రమం తో తయారు చేసిన "పర్సనల్ స్పియర్" ను విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, తిరువనంతపురం లోని ఇస్రో సంస్థ తో కలిసి అభివృద్ధి చేస్తోంది.
భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మరియు శాస్త్ర, సాంకేతిక శాఖల సహాయ (ఇంచార్జి) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు.
*****
(Release ID: 1782442)