సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

విజయనగరం కాయర్ క్లస్టర్

Posted On: 16 DEC 2021 12:45PM by PIB Hyderabad

ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సాంప్రదాయ పరిశ్రమలు మరియు చేతివృత్తుల కళాకారులను సమిష్టిగా నిర్వహిండానికి హస్త కళాకారులకు స్థిరమైన ఉపాధిని కల్పించడానికి ‌'సంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి  నిధి'ని (ఎస్ఎఫ్‌యుఆర్‌టీఐ) ఏర్పాటు చేసి నిర్వ‌హిస్తోంది. ఎస్ఎఫ్‌యుఆర్‌టీఐ కింద, విజయనగరం కాయిర్ క్లస్టర్ క్రియాత్మకంగా మారింది. రబ్బరైజ్డ్ కొబ్బరి ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ కింద, ఉమ్మడి సౌకర్యాల కేంద్రం నిర్మాణం, యంత్రాల సేకరణ,  ముడిసరుకు కొనుగోలు మొదలైన హార్డ్ ఇంటర్వెన్షన్స్ కింద కార్యకలాపాలు చేపట్టేందుకు రూ.203.32 లక్షల నిధుల కేటాయింపున‌కు ఆమోదం ల‌భించింది. వీటిలో రూ. 40 లక్షలతో కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. పథకం యొక్క సాఫ్ట్ ఇంటర్వెన్షన్ కాంపోనెంట్ కింద, రూ. 25 లక్షల నిధుల‌కు ఆమోదం ల‌భించింది. ఇందులో ఉత్పత్తి అభివృద్ధి, సామర్థ్య పెంపుదల, మంచి మార్కెట్ ప్రోత్సాహాన్ని అందించ‌డం వంటి కార్యకలాపాలు ఉండ‌నున్నాయి. సాఫ్ట్ ఇంటర్వెన్షన్ కార్యకలాపాలకు కేటాయించిన మొత్తం రూ.25 లక్షల నిధుల మొత్తంను సామర్థ్యం పెంపుదల, మార్కెట్ ప్రమోషన్ మొదలైన వాటిపై వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు క్లస్టర్‌కు విడుదల చేయబడింది. ఈ విష‌యాన్ని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ‌ మంత్రి శ్రీ నారాయణ్ రాణే ఈరోజు లోక్‌స‌భ‌కు అందించిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియ‌జేశారు.
                                                              ****



(Release ID: 1782438) Visitor Counter : 86


Read this release in: English , Urdu , Tamil