మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మహిళా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం

Posted On: 15 DEC 2021 2:32PM by PIB Hyderabad

భవన‌, ఇతర నిర్మాణ కార్మికుల ఉపాధి మరియు సేవల నిబంధనలను క్రమబద్ధీకరించడం, అందించడానికి ప్రభుత్వం 'ది బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ (ఉపాధి నియంత్రణ మరియు సేవా నిబంధనలు) చట్టం, 1996 [బీఓసీడ‌బ్ల్యు(ఆర్ఈ & సీఎస్‌) చట్టం, 1996]'ని రూపొందించింది. దీనితో పాటుగా వారి భద్రత, ఆరోగ్యం, సంక్షేమ చర్యలు మరియు వాటికి సంబంధించిన ఇతర విషయాల కోసం దీనిని రూపొందించింది. కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ బీఓసీడ‌బ్ల్యు(ఆర్ఈ & సీఎస్‌) చట్టం, 1996 మరియు బీఓసీడ‌బ్ల్యు సంక్షేమ సెస్ చట్టం, 1996 మరియు ఆయా నియమాలను నిర్వహిస్తోంది. బీఓసీడ‌బ్ల్యు సంక్షేమ సెస్సు చట్టం, 1996లోని సెక్షన్ 3 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు సెస్‌ని వసూలు చేయడం తప్పనిసరి. బీఓసీడ‌బ్ల్యు(ఆర్ఈ & సీఎస్‌) చట్టం, 1996లోని సెక్షన్ 22 ప్రకారం, రాష్ట్ర/య‌టీ  భవనాలు మరియు ఇతర నిర్మాణ కార్మికుల ద్వారా రాష్ట్రాలు/ యుటీల‌ సంక్షేమ బోర్డులు భవనం మరియు ఇతర నిర్మాణ కార్మికుల రిజిస్ట్రేషన్ & రిజిస్ట్రేష‌న్‌ పునరుద్ధరణ సంబంధిత వివిధ అధికారాల‌ను అప్పగించబడ్డాయి. దీనికి తోడు సామాజిక భద్రత కల్పించడం మరియు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాల అమలు కోసం, మహిళా నిర్మాణ కార్మికులతో సహా, జీవిత బీమా మరియు అంగవైకల్య రక్షణ, ఆరోగ్యం, ప్రసూతి కవరేజీ, నమోదిత భవనం మరియు ఇతర నిర్మాణ కార్మికుల పిల్ల‌ల విద్య కోసం ఆర్థిక సాయం  ట్రాన్సిట్ హౌసింగ్, స్కిల్ డెవలప్‌మెంట్, అవగాహన కార్యక్రమాలు, పెన్షన్ క‌ల్ప‌న మొద‌లైన అంశాలు అప్ప‌గించ‌బ‌డ్డాయి. ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈరోజు రాజ్యసభకు తెలిపిన ఒక‌  లిఖితపూర్వకంగా సమాధానంలో వెల్ల‌డించారు.

***



(Release ID: 1781969) Visitor Counter : 519


Read this release in: English , Marathi , Tamil