గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎస్సీ/ ఎస్టీ ల‌పై అత్యాచారాల‌కు వ్య‌తిరేకంగా జాతీయ హెల్ప్‌లైన్ సోమ‌వారం ప్రారంభం


టోల్ ఫ్రీ నెంబ‌రు 14566పై ఇర‌వైనాలుగు గంట‌లు హిందీ, ఇంగ్లీషు, ప్రాంతీయ భాష‌ల‌లో అందుబాటులో ఉండ‌నున్న ఎన్‌హెచ్ఎఎ షెడ్యుల్డు కులాలు, షెడ్య‌ల్డు తెగ‌లు (అత్యాచారాల నిరోధ‌క‌) చ‌ట్టం,1989 స‌రైన అమ‌లును నిర్ధారిస్తుంది

ప్ర‌తి ఫిర్యాదును ఎఫ్ఐఆర్‌గా ఎన్‌హెచ్ ఎఎ న‌మోదు చేస్తుంద‌న్న డాక్ట‌ర్ వీరేంద్ర కుమార్‌

షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగ‌ల ప‌ట్ల వివ‌క్ష‌త‌ను, అత్యాచారాల‌ను అంతం చేయ‌డం మా అత్యంత ప్ర‌ధాన ల‌క్ష్యంః డాక్ట‌ర్ వీరేంద్ర కుమార్

Posted On: 13 DEC 2021 5:14PM by PIB Hyderabad

 అత్యాచారాల‌కు వ్య‌తిరేకంగా జాతీయ హెల్ప్ లైన్‌ను కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రి డాక్ట‌ర్ వీరేంద్ర కుమార్ నేడు ప్రారంభించారు. ఈ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నెంబ‌ర్ 14566పై దేశ‌వ్యాప్తంగా హిందీ, ఇంగ్లీషు, రాష్ట్రాలు/    యుటిల ప్రాంతీయ భాష‌ల‌లో ఇర‌వై నాలుగు గంట‌లూ అందుబాటులో ఉంటుంది. 
షెడ్యూల్డు కులాలు, షెడ్యుల్డు తెగ‌ల (అత్యాచారాల నిరోధ‌క‌) (పిఒఎ) చ‌ట్టం, 1989 అమ‌లును నిర్ధారించ‌డ‌మే కాక దేశ‌వ్యాప్తంగా ఉన్న టెలికాం ఆప‌రేట‌ర్ల‌కు చెందిన మొబైల్ లేదా ల్యాండ్ నెంబ‌రు నుంచి వాయిస్ కాల్‌/  విఒఐపి ద్వారా హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుంది. షెడ్యూల్డు కులాలు (ఎస్పీలు), షెడ్యూల్డు తెగ‌లు (ఎస్టీలు)పై అత్యాచారాల‌ను నిరోధించే ప్ర‌ధాన ల‌క్ష్యంతో పిఒఎ చ‌ట్టాన్ని రూపొందించారు. 
కేవ‌లం హెల్ప్‌లైన్ నెంబ‌ర్ గానే కాక వెబ్ ఆధారిత‌ సెల్ఫ్ స‌ర్వీస్ పోర్ట‌ల్ గా అందుబాటులో ఉన్న ఎన్‌హెచ్ఎఎ, వివిక్ష‌ను అంతం చేసి, అంద‌రికీ ర‌క్ష‌ణ క‌ల్పించాల‌న్న ల‌క్ష్యంతో చేసిన‌ అత్యాచారాల నిరోధ‌క (పిఒఎ) చ‌ట్టం, 1989, పౌర హ‌క్కుల సంర‌క్ష‌ణ (పిసిఆర్‌) చ‌ట్టం, 1955 గురించి సంపూర్ణ అవ‌గాహ‌న‌ను క‌ల్పిస్తుంది. చేసిన ప్ర‌తి ఫిర్యాదునూ ఎఫ్ఐఆర్‌గా న‌మోదు  చేయ‌డం, ఉప‌శ‌మ‌నాన్ని క‌ల్పించ‌డం, న‌మోదు చేసిన అన్ని ఫిర్యాదుల‌పై విచార‌ణ జ‌రిపి, చార్జిషీట్ల‌ను కోర్టులో విచార‌ణ, తీర్పు కోసం దాఖ‌లా చేసేలా నిర్ధారిస్తుంది. ఇవ‌న్నీ కూడా చ‌ట్టంలో పేర్కొన్న స‌మ‌య ప‌రిమితుల‌కు లోబ‌డి ఉండేలా చ‌ర్య తీసుకుంటుంది.
ఎ) హెల్ప్‌లైన్ ప్రాథ‌మిక వివ‌రాలుః
* టోల్ ఫ్రీ సేవ‌
* దేశ‌వ్యాప్తంగా ఉన్న టెలికాం ఆప‌రేట‌ర్ ఎవ‌రి మొబైల్ లేదా ల్యాండ్ లైన్ నుంచి 14566కు వాయిస్ కాల్‌/   విఒఐపి ద్వారా అందుబాటులో ఉంటుంది. 
*సేవ‌ల అందుబాటుః ఇర‌వై నాలుగు గంట‌లూ
* సేవ‌లు హిందీ, ఇంగ్లీషు, రాష్ట్రాలు/  యుటిల‌కు చెందిన ప్రాంతీయ భాష‌ల‌లో అందుబాటు
* మొబైల్ అప్లికేష‌న్ కూడా ల‌భ్యం.

బి) హెల్ప్‌లైన్ విశేష‌త‌లుః 

*ఫిర్యాదుల ప‌రిష్కారంః బాధితులు లేదా ఫిర్యాదుదారు/ ఎన్జీవో నుంచి పిసిఆర్ చ‌ట్టం, 1955ను, పిఒఎ చ‌ట్టం, 1989ని  ఉల్లంఘించ‌డంపై వ‌చ్చిన ఫిర్యాదుల‌కు డాకెట్ నెంబ‌రును ఇవ్వ‌డం జ‌రుగుతుంది. 

* అనుగామి వ్య‌వ‌స్థ (ట్రాకింగ్ సిస్టం)ః ఫిర్యాదు పై చ‌ర్య‌లు ఏ స్థితిలో ఉన్నాయో ఫిర్యాదుదారు/ ఎన్జీవో ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవ‌చ్చు.

* చ‌ట్టాల‌కు స్వీయ అమ‌లు (ఆటో కంప్ల‌యెన్స్ ఆఫ్ ది యాక్ట్స్‌)ః  బాధితుల‌కు సంబంధించి చ‌ట్టాల‌లోని ప్ర‌తి అంశాన్నీ ప‌ర్య‌వేక్షిస్తూ, చ‌ట్టాన్ని అమ‌లు చేసే అధికారుల‌కు సందేశాలు/ ఇమెయిళ్ళ‌ను పంప‌డం ద్వారా ఉత్త‌ర‌ప్ర‌త్యుత్త‌రాలు/ గ‌ఉర్తు చేయ‌డం ద్వారా వారు చ‌ట్టానికి క‌ట్టుబ‌డి ఉండేలా చూడ‌డం.

* అవ‌గాహ‌న క‌ల్పించ‌డంః ఏ ప్ర‌శ్న‌కైనా ఐవిఆర్ లేదా ఆప‌రేట‌ర్లు హిందీ, ఇంగ్లీషు, ప్రాంతీయ భాష‌ల‌లో స‌మాధానం 

* రాష్ట్రాలు/  యుటిల కోసం డాష్‌బోర్డ్ః  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పిసిఆర్ చ‌ట్టం, 1955, పిఒఎ చ‌ట్టం, 1989 అమ‌లుకు సంబంధించి కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కం దార్శ‌నిక‌త ,(అత్యాచార కేసుల‌ను త‌గ్గించ‌డం స‌హా) వారి ప‌ని తీరుపై   కెపిఐల‌ను డాష్‌బోర్డ్ పైనే అందుబాటులో ఉంచుతారు.

* ఫీడ్‌బ్యాక్ వ్య‌వ‌స్థ అందుబాటులో ఉంటుంది. 

* ఏకీకృత సంప్ర‌దింపుల భావ‌న‌ను అవ‌లంబిస్తున్నారు. 

 

****
 


(Release ID: 1781131)
Read this release in: English , Hindi , Malayalam