గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

రాబోయే ఐదేళ్లలో దేశంలోని నగరాలను పరిశుభ్రంగా(చెత్త రహితంగా), నీటి భద్రతగల ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ్ భారత్ మిషన్ (అర్బన్) 2.0 మరియు అమృత్ 2.0 .

Posted On: 13 DEC 2021 3:51PM by PIB Hyderabad

అక్టోబర్ 1, 2021న ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ మిషన్ (అర్బన్) 2.0 మరియు అమృత్ 2.0 పథకాల లక్ష్యం.. వచ్చే ఐదేళ్ల మిషన్ కాలం(2021–2026)లో  దేశంలోని నగరాలను చెత్తరహితంగా, నీటిభద్రత కలిగిన ప్రాంతాలుగా తీర్చదిద్దడమే .

స్వచ్ఛభారత్(అర్బన్) 2.0 యొక్క ముఖ్యాంశాలు క్రింది విధంగా ఉన్నాయి:
– పట్టణాల్లోని అన్ని గృహాలు, ప్రాంగణాలు వ్యర్థాలను  "తడి వ్యర్థాలు" (వంటగది మరియు తోటల నుండి) మరియు.. "పొడి వ్యర్థాలు" (కాగితం, గాజు, ప్లాస్టిక్ మరియు గృహ ప్రమాదకరమైనవి) వ్యర్థాలను వేరు చేసేలా చర్యలు తీసుకోవడంతోపాటు ప్రతి ఇంటి నుంచి ఇలా వేరుచేయబడిన వ్యర్థాలను 100%  సేకరించడం.
– సేకరించిన చెత్తను సురక్షిత ప్రాంతంలో డంప్ చేయడంతోపాటు  100 శాతం శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం.  
– ఇప్పటికే అన్ని డంప్యార్డుల్లో చెత్తను శాస్త్రీయ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.
– భూగర్భ జలాలు కలుషితం కాకుండా మురుగునీటిని సురక్షితంగా రవాణా చేయడంతోపాటు శుద్ధిచేయడం.  లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల్లో మురికినీరు భూమిని, నీటివనరులను కలుషితం చేయదు.
– సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని దశలవారీగా తగ్గించడం.

అమృత్ 2.0 యొక్క ముఖ్యాంశాలు క్రింది విధంగా ఉన్నాయి:
– 500 నగరాల నుంచి 4వేల 800 పట్టణాలకు సార్వత్రిక నీటి సరఫరా కవరేజీ.
– నగరాలను స్వయం ఆధారిత, నీటి భద్రత కలిగిన ప్రాంతాలుగా మార్చడంపై దృష్టిపెట్టడం.
– 500 అమృత్ నగరాల్లో సార్వత్రిక మురుగునీటి పారుదల మరియు సెప్టేజీ నిర్వహణ చేపట్టడం.
– 2.68 కోట్ల తాగునీటి కుళాయి కనెక్షన్లు, 2.64 కోట్ల మురుగునీటి కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
– మెరుగైన రుణ యోగ్యత మరియు మార్కెట్ రుణాల ద్వారా పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టడం.
– నగరాల్లో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి  'పే జల్ సర్వేక్షన్'ను అమలు చేయడం.
– నీటి రంగంలో నిరూపితమైన మరియు సంభావ్య ప్రపంచ సాంకేతికతలను గుర్తించడంలో అమృత్ 2.0 కింద సాంకేతిక ఉప-మిషన్ సహాయపడుతుంది.
– తక్కువ -ధర స్వదేశీ పరికరాలు మరియు ప్రక్రియలలో పాలుపంచుకున్న వ్యవస్థాపకత/ స్టార్టప్‌లు ప్రోత్సహించబడతాయి.
– ఫిరోజాబాద్‌తో సహా ఉత్తరప్రదేశ్‌లోని అన్ని నగరాలు స్వచ్ఛభారత్(అర్బన్) 2.0 కింద కవర్ చేయబడ్డాయి. అంతేకాకుండా కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం అన్ని రకాల ప్రయోజనాలను పొందేందుకు అర్హత సాధించాయి.

4,372 అర్బన్ లోకల్ బాడీస్లలో, పశ్చిమ బెంగాల్ (పురూలియా నగరం)లో ఒకటి మినహా దేశంలోని ఫిరోజాబాద్‌తో సహా 4,371 అర్బన్ లోకల్ బాడీస్లు స్వచ్ఛభారత్ మిషన్(అర్బన్, స్వచ్ఛభారత్ మిషన్(అర్బన్)2.0 మరియు AMRUT 2.0 కింద బహిరంగ మలవిసర్జన రహితంగా నగరాలుగా ప్రకటించబడ్డాయి. 2021–2026 మిషన్ కాలంలో వాటిని చెత్తరహితంగా, నీటి భద్రత కలిగిన ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి  కౌశల్ కిషోర్ సోమవారం  రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

***



(Release ID: 1781127) Visitor Counter : 179


Read this release in: English , Tamil