పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

పౌర విమానయానం నుండి సిఒ2 ఉద్గారాలను పరిష్కరించడానికి చర్యలు


భారతీయ ఆపరేటర్ ల కోసం 2027 నుంచి కోర్సియా ఆఫ్ సెట్టింగ్ ఆవశ్యకతల వర్తింపు

Posted On: 13 DEC 2021 2:44PM by PIB Hyderabad

అంతర్జాతీయ పౌర విమానయానం నుంచి సిఒ2 ఉద్గారాలను పరిష్కరించడానికి కార్బన్ ఆఫ్ సెట్టింగ్ అండ్ రిడక్షన్ స్కీం (కోర్సియా) రూపంలో గ్లోబల్ మార్కెట్ ఆధారిత మెజర్ (జిఎంబిఎం) పథకాన్ని అమలు చేయాలని 39వ జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఐసిఎఒ నిర్ణయించింది. భారతదేశంలో సిఒఆర్ ఎస్ ఐఎ అమలు దిశగా తీసుకున్న చర్యలు ఈ విధంగా ఉన్నాయి:

వాటాదారులతో సంప్రదించిన తరువాత డిజిసిఎ "కోర్సియా"పై పౌర విమానయాన ఆవశ్యకతలను జారీ చేసింది.

సిఒఆర్ఎస్ఐఎ యొక్క డిజైన్ అంశాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఎయిర్ లైన్ ఆపరేటర్లు ,ఇతర వాటాదారులకు డిజిసిఎ గైడెన్స్ మెటీరియల్ జారీ చేసింది.

అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఎటిఎ) ,యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఎఎస్ఎ) సహకారంతో సిఆర్ఎస్ఐఎ ఆవశ్యకతలపై వాటిని చైతన్యవంతం చేయడానికి పరిశ్రమ కోసం వివిధ వర్క్ షాప్ లు, ,సెమినార్లు/శిక్షణలను డిజిసిఎ నిర్వహించింది.

విమానయాన సంస్థల కోసం కోర్సియాపై ధృవీకరణ కార్యకలాపాలను నిర్వహించడానికి రెండు ధృవీకరణ సంస్థలను ఎంప్యానెల్ చేయడానికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ (ఎన్ ఎబిసిబి)తో డిజిసిఎ సమన్వయంతో పనిచేసింది.

భారతీయ ఆపరేటర్ల కోసం , కోర్సియా

ఆఫ్ సెట్టింగ్ ఆవశ్యకతలు 2027 నుంచి వర్తిస్తాయి, అంటే కోర్సియా అమలు తప్పనిసరి (రెండో) దశ నుంచి. కోర్సియా ప్రస్తుత నిర్మాణానికి సంబంధించి 2019 లో 40వ ఐసిఎఒ అసెంబ్లీలో భారతదేశం అభ్యంతరాలు దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఐసిఎఒ కౌన్సిల్ లో భారత ప్రతినిధి ద్వారా కౌన్సిల్ స్థాయిలో చేపట్టారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఈ విషయాన్ని ఇతర భావ సారూప్య దేశాలతో కూడా చేపట్టారు.

ఈ సమాచారాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి (జనరల్ (డాక్టర్) వి.కె.సింగ్ రిటైర్డ్) ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***



(Release ID: 1781119) Visitor Counter : 137


Read this release in: English , Urdu , Bengali