సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఆలిండియా వందే భారతం నిత్య ఉత్సవ్ నాలుగవ జోనల్ స్థాయి పోటీ ఢిల్లీలో రేపు జరగనుంది.
ఉత్తర జోన్ కు చెందిన రాష్ట్ర, కేంద్ర పాలిత స్థాయిఇఇ సుమారు 25 విన్నర్ గ్రూప్‌లు ఈ ఈవెంట్ లో పాల్గొన నున్నాయి.
Posted On:
11 DEC 2021 6:06PM by PIB Hyderabad
75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలను పురస్కరించుకుని ఆజాదికా అమృత్ మహొత్సవ్ లో భాగంగా రక్షణ మంత్రిత్వశాఖ, సాంస్కృతిక మంత్రిత్వశాఖ వందే భారతం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాయి. 2022 జనవరి 26 న న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్ లో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు నృత్య పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇవి కీలక దశకు చేరుకున్నాయి. ఈ పోటీలకు సంబంధించచి నాలుగవ జోనల్ స్థాయి ఈవెంట్ రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. (డిసెంబర్ 12, 2021)
ఇది చివరి జోనల్ స్థాయి పోటీ కానుంది. రాష్ట్రస్థాయి పోటీకి సంబంధించి ఉత్తరాది జోన్ కు చెందిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారుగా 25 విజేతల బృందాలు ఈ పోటీలో పాల్గొంటాయి.
జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీఘడ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన గ్రూప్‌లు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హత కలిగి ఉన్నాయి. రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొనేందుకు డాన్స్ గ్రూప్‌లను ఆలిండియా పోటీల ద్వారా ఎంపిక చేయనుండడం ఇదే ప్రథమం.
వందే భారతం పోటీ జిల్లా స్థాయిలో నవంబర్ 17న ప్రారంభమైంది. 323 గ్రూప్‌లకు చెందిన 3 వేలా 870 మంది పోటీదారులు ఇందులో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్రస్థాయి పోటీలలో 2021 నవంబర్ 30 నుంచి పాల్గొన్నారు. 2021 డిసెంబర్ 4 వరకు 5 రోజులలో రాష్ట్రస్థాయి పోటీలో భాగంగా 20 కి పైగా వర్చువల్ ఈవెంట్లు నిర్వహించడం జరిగింది. రాష్ట్రస్థాయి పోటీలకు 300కు పైగా గ్రూప్‌లు పాల్గొన్నాయి. ఇందులో 3వేల మంది డాన్సర్లు పాల్గొన్నారు. దీనితో ఒక నెలరోజులలో ఈ ఈవెంట్ జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు , తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఔత్సాహికులకు తగిన అవకాశం కల్పించింది.
ఢిల్లీలో జరిగే నాలుగవ జోనల్ స్థాయి ఈవెంట్ సందర్భంగా గొప్ప డాన్స్ రూపాలు, సంగీతం, సంప్రదాయ, జానపద, గిరజన, సమకాలీన పాటల రూపాలలో తమ తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ ఈవెంట్ సివిల్ లైన్స్ లోని షా ఆడిటోరియంలో ఉదయం 10 గంటలనుంచి జరుగుతుంది.
జోనల్ స్థాయి పోటీకి 2 ,400 మందిని 200కు పైగా బృందాలనుంచి ఎంపిక చేశారు. ఈ రౌండ్ నుంచి ఎంపిక అయిన బృందాలు న్యూఢిల్లీలో జరిగే గ్రాండ్ ఫైనల్స్‌లో పాల్గొంటారు. ఫైనల్స్ లో గెలుపొందిన 480 మంది డాన్సర్లు 2022 జనవరి 26 వ తేదీన న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ లో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్‌లో తమ ప్రదర్శన నిస్తారు.
***
(Release ID: 1780623)
Visitor Counter : 160