నీతి ఆయోగ్

'కాన్వోక్ 2021–-22'ని ప్రారంభించినట్లు నీతి ఆయోగ్ మరియు భారతి ఫౌండేషన్ ప్రకటించాయి


జనవరి 2022లో జరగనున్న జాతీయ స్థాయి సింపోజియం కోసం పరిశోధన పత్రాలను ఆహ్వానిస్తోంది

9 డిసెంబర్ 2021 నుంచి ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు/పాఠశాలల అధిపతుల వద్ద నమోదు చేసుకోవచ్చు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యాసంస్థలు, భాగస్వాములు పాల్గొన్నారు

Posted On: 10 DEC 2021 3:04PM by PIB Hyderabad

భారతీ ఎంటర్‌ప్రైజెస్ యొక్క దాతృత్వ విభాగం అయిన భారతీ ఫౌండేషన్‌తో భాగస్వామ్యంతో  నీతి  ఆయోగ్ కాన్వోక్ 2021–-22ని ప్రారంభించింది.
కాన్వోక్ అనేది జాతీయ పరిశోధనా సింపోజియం. ఇది భారతదేశంలోని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పాఠశాలల అధిపతులందరిపై ప్రత్యేక దృష్టి సారించి...  విద్యను అందించడంలో సవాళ్లను పరిష్కరించడం మరియు దాని నాణ్యతను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా..  శాస్త్రీయ విధానం ద్వారా పరిశోధన- ఆధారిత పరిష్కారాలను ఉపయోగించేలా పాఠశాల ఉపాధ్యాయులు/ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్స్ మరియు భారతి ఫౌండేషన్ నెట్‌వర్క్‌లోని ఉపాధ్యాయులను  ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా  అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంలో అట్టడుగు స్థాయిలో వారి ప్రయత్నాలను ప్రదర్శించారు.

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 కూడా ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులను అభ్యాస ప్రక్రియ యొక్క గుండెగా గుర్తిస్తుంది. ఉపాధ్యాయులు తమ తరగతి గదులలో అభ్యాస ఫలితాలను మెరుగుపరిచే బోధనకు సంబంధించిన వినూత్న విధానాలకు గుర్తింపు పొందాలని ఇది సిఫార్సు చేస్తోంది.  విస్తృత విద్యావ్యాప్తి కోసం ఉత్తమ అభ్యాసాలను ఉపాధ్యాయులు తమ ఆలోచనలు పంచుకునేలా ప్రత్యేక వేదిక ఏర్పాటును కూడా జాతీయ విద్యావిధానం సిఫార్సు చేస్తుంది.

లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులకు మద్దతుగా మరియు ఇంకా ఎక్కువ సహాయం చేయడానికి ఉపాధ్యాయులు సంవత్సరాలుగా వినూత్నమైన పరిష్కారాన్ని అందజేస్తున్నారు. కాన్వోక్ ద్వారా వారు ఇప్పుడు తమ సూక్ష్మ పరిశోధన పత్రాలను పంచుకోవచ్చు. ఈ పరిశోధనా పత్రాలను విద్యావేత్తల బృందం విశ్లేషిస్తుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన రీసెర్చ్ పేపర్‌లు 2022 జనవరిలో షెడ్యూల్ చేయబడిన ‘నేషనల్ రీసెర్చ్ సింపోజియం’లో సమర్పించబడతాయి.

ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ అధ్యక్షత వహించగా..  నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ సలహాదారు (విద్య) డాక్టర్ ప్రేమ్ సింగ్, భారతి ఫౌండేషన్ కో-చైర్మన్ రాకేష్ భారతీ మిట్టల్, సీఈవో మమతా సైకియాతోపాటు విద్యా మంత్రిత్వశాఖ, ఎన్ఐఈపీఏ, విద్యాశాఖల అధికారుల, అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎస్సీఈఆర్టీల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రాథమిక విద్య సార్వత్రిక ప్రవేశానికి దగ్గరగా ఉన్నందున నాణ్యతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ 19 కారణంగా పాఠశాలలు మూసివేసినందున ఏర్పడిన లెర్నింగ్ రిగ్రెషన్ కారణంగా  విద్యా నాణ్యతపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కన్వో అనేది పాన్-ఇండియా వేదికగా మారుతుందని మరియు సంతోషకరమైన బోధన మరియు అభ్యాసం ద్వారా అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి ఇది ఒక ఉద్యమంగా మారుతుందని తాను ఆశిస్తున్నానన్నారు.  మన యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి నాణ్యమైన విద్యను ఒక మిషన్‌గా మార్చాలని విద్యా భాగస్వామ్యులందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు. గణనీయ సంఖ్యలో పిల్లలు ప్రీ-స్కూల్‌కు హాజరు కాకపోవడం మరియు పాఠశాలల్లోకి ప్రవేశించినప్పుడు అభ్యాస ఫలితాలలో వెనుకబడి ఉన్నందున ప్రీ-స్కూల్ విద్యపై కూడా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

 శాస్త్రీయ పద్దతిని ఉపయోగించి పరిష్కారాలను కనుగొనడం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల్లో 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించడానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ –2020 చాలా ప్రాధాన్యతనిస్తుంది. ఇది భారతదేశంలో పరిశోధన యొక్క నాణ్యత మరియు పరిమాణాన్ని మార్చడానికి ఒక సమగ్ర విధానాన్ని సూచించింది.  ఇందులో పాఠశాల విద్యలో ఖచ్చితమైన మార్పులు శాస్త్రీయ పద్ధతి మరియు విమర్శనాత్మక ఆలోచనకు ప్రాధాన్యతనిస్తూ  ఆటలు మరియు ఆవిష్కరణ- ఆధారిత అభ్యాసనకు ఇందులో ప్రాధాన్యత ఉంటుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  అమితాబ్ కాంత్ మాట్లాడుతూ...  “విద్యారంగంలో విద్యావేత్తలు, విధాన రూపకర్తలు మరియు అభ్యాసకుల మధ్య అంతరాన్ని తగ్గించడంలో కాన్వోక్ ఎంతగానో సహాయపడుతుంద’న్నారు.  అట్టడుగు స్థాయి నుంచి ఉపధ్యాయులు కనుగొన్న విషయాలు.. విధాన రూపకర్తలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇది అభ్యసన ఫలితాలను మెరుగుపర్చడంతోపాటు అభ్యసనకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో ఉపాధ్యాయులు పరిశోధకులుగా ఉండేలా  చేస్తుందన్నారు.

నీతి  ఆయోగ్ సలహాదారు (విద్య) డాక్టర్ ప్రేమ్ సింగ్  అభ్యాస ఫలితాలను మెరుగుపరచాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ..  “కన్వోక్ వారి తరగతి గదులలో అభ్యాస ఫలితాలను మెరుగుపరిచే బోధనకు సంబంధించిన నవలా విధానాలను గుర్తించడంపై జాతీయ విద్యా విధానం 2020 యొక్క సూచనలను ప్రోత్సహిస్తుందన్నారు. పాఠశాల విద్యలో అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి పరిశోధన- ఆధారిత బోధనా శాస్త్రాన్ని ఉపయోగించే సంస్కృతిని రూపొందించడంలో కాన్వోక్  ఎంతగానో  సహాయపడుతుందని పేర్కొన్నారు..

ఈ సందర్భంగా సభను ఉద్దేశించి భారతీ ఫౌండేషన్ కోచైర్మన్  రాకేష్ భారతి మిట్టల్ మాట్లాడుతూ...  “ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య బోధనా నాణ్యతను మెరుగుపరచడానికి మరియు అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి భారతీ ఫౌండేషన్లో  తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఎన్ఈపీ 2020ని జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న కీలక సమయంలో కాన్వోక్ 2021 కోసం నీతి ఆయోగ్‌తో భాగస్వామ్యం కావడం తమకు గౌరవంగా ఉందన్నారు. ఎన్ఈపీ 2020లో నిర్దేశించబడిన లక్ష్యాలను వేగంగా మరియు స్థిరత్వంతో సాధించేందుకు వీలుగా విద్యావేత్తలు తమ జ్ఞానాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి తామంతా కలిసి ఒక వేదికను ఏర్పాటు చేస్తామన్నారు.

భారతి ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీమతి మమతా సైకియా మాట్లాడుతూ... ఉపాధ్యాయుల పరస్పర చర్చల చిన్నస్థాయి చర్చా వేదిక నుంచి ఇప్పడు జాతీయస్థాయి చర్చా వేదికగా అభివృద్ధి చెందినదే కాన్వోక్ అన్నారు. ఇది ఉపాధ్యాయుల సూక్ష్మ పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారా విధాన రూపకర్తలకు మార్గం సుగమం చేస్తుందన్నారు.

కాన్వోక్ కోసం దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.   జనవరి నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని  వివరాలను https://bhartifoundation.org/convoke/ వెబ్ లింక్  ద్వారా తెలుసుకోవచ్చు.

***

 



(Release ID: 1780512) Visitor Counter : 130


Read this release in: English , Hindi , Punjabi