పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
జాతీయ నగదీకరణ క్రమం కింద ఆస్తుల నగదీకరణ కోసం 25 ఏఏఐ విమానాశ్రయాలు కేటాయింపు
పీపీపీ విధానంలో విమానాశ్రయాల కార్యకలాపాలు, నిర్వహణ మరియు అభివృద్ధి కోసం 13 విమానాశ్రయాల గుర్తింపు
Posted On:
09 DEC 2021 5:45PM by PIB Hyderabad
జాతీయ నగదీకరణ క్రమం (ఎన్ఎంపీ) ప్రకారం 2022- 2025 సంవత్సరాల మధ్య కాలంలో భువనేశ్వర్, వారణాసి, అమృత్‌సర్, తిరుచీ, ఇందోర్, రాయ్‌పూర్, కాలికట్, కోయంబత్తూర్, నాగ్‌పూర్, పాట్నా, మదురై, సూరత్, రాంచీ, జోధ్‌పూర్, చెన్నై, వడోదర, విజయవాడ, భోపాల్, తిరుపతి, హుబ్లీ, ఇంఫాల్, అగర్తల, ఉదయపూర్, డెహ్రాడూన్ మరియు రాజమండ్రి. వంటి మొత్తం 25 ఏఏఐ విమానాశ్రయాలను ఆస్తుల నగదీకరణ కోసం కేటాయించబడ్డాయి. దీనికితోడు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో విమానాశ్రయ కార్యకలాపాలు, నిర్వహణ మరియు అభివృద్ధి తదితరాల
కోసం 13 విమానాశ్రయాలను గుర్తించింది. ఇందులో తమిళనాడులోని తిరుచిరాపల్లి (తిరుచ్చి) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రజా ప్రయోజనాలలు మరియు విమానాశ్రయాల మెరుగైన నిర్వహణ కోసం గుర్తించింది. ఈ విమానాశ్రయాలను పీపీపీ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్‌లోకి తీసుకువచ్చిన తర్వాత కూడా, ఏఏఐ విమానాశ్రయాల యజమానిగా ఉంటుంది. రాయితీ వ్యవధి ముగిసిన తర్వాత ఈ విమానాశ్రయాలన్నీ ఏఏఐ పరిధిలోకి తిరిగి వస్తాయి. ఈ రోజు లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (జనరల్ (డా.) వి. కె.సింగ్ రిటైర్డ్) ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1779924)
Visitor Counter : 145