వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
చిన్న పరిశ్రమలు, ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించాలి; ఉక్కు ఉత్పత్తి దారులకు శ్రీ పీయూష్ గోయల్ విజ్ఞప్తి
చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఎగుమతిదారుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని మంత్రికి హామీ ఇచ్చిన ఉక్కు పరిశ్రమ వర్గాలు
प्रविष्टि तिथि:
09 DEC 2021 7:26PM by PIB Hyderabad
చిన్న పరిశ్రమలు మరియు ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించే అవకాశాలు అన్వేషించాలని స్టీల్ తయారీదారులకు వాణిజ్యం, పరిశ్రమలు, జౌళి, వినియోగదారుల వ్యవహారాలు,ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు.
చిన్న పరిశ్రమలు మరియు ఎగుమతిదారుల సమస్యలను పరిష్కరించడానికి ఈ రోజు సమావేశం జరిగింది.దీనికి ఉక్కు పరిశ్రమ, ఉక్కు వాస్తవ వినియోగదారులు హాజరయ్యారు. ఉక్కు ధరల వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను చిన్న పరిశ్రమలు, ఎగుమతిదారులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దీనికి స్పందించిన మంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సమావేశంలో మాట్లాడిన మంత్రి ఎంఎస్ఎంఈల అవసరాల మేరకు ఉక్కు సులువుగా తక్కువ ఖర్చుతో సరఫరా చేయడానికి చర్యలు అవసరమని గోయల్ అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంజనీరింగ్ వస్తువులు , విడి భాగాల తయారీకి ఉక్కును ముడిపదార్థంగా వినియోగిస్తున్న చిన్న పరిశ్రమలకు ఉపశమనం కలిగించడానికి ఉక్కు ఉత్పత్తి పరిశ్రమ ప్రయత్నించాలని ఆయన కోరారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అండగా ఉంటామని ఉక్కు ఉత్పత్తి దారులు హామీ ఇచ్చారు. కోవిడ్ రూపంలో ఎదురైన సవాళ్ల నేపథ్యంలో చిన్న సంస్థలు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఉక్కు ఉత్పత్తి పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
సమావేశానికి కేంద్ర ఉక్కు మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్, ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీ నారాయణ్ టాటు రాణే, సెయిల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి సోమ మొండల్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సీఎండీ శ్రీ అతుల్ భట్ జేఎస్ డబ్ల్యు స్టీల్ లిమిటెడ్. సీఎండీ శ్రీ సజ్జన్ జిందాల్, టాటా స్టీల్ సీఈవో ఎండీ శ్రీ టీవీ నరేంద్రన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్ ఆర్గనైజేషన్ డీజీ సీఈఓ డాక్టర్. అజయ్ షాయ్, ఆటో కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నుంచి శ్రీ మోహిత్ జౌహరి, ఈఈపీసీ చైర్మన్ శ్రీ మహేశ్ దేశాయ్, ఆల్ ఇండియా సైకిల్ తయారీ దారుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే.బీ. ఠాకూర్, సంబంధిత మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.
***
(रिलीज़ आईडी: 1779918)
आगंतुक पटल : 153