మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పిల్లల పోషకాహార స్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పథకం

Posted On: 08 DEC 2021 3:39PM by PIB Hyderabad

పోషకాహార లోపం అనేది బహుముఖ సమస్య. ప్రారంభ జీవితంలో పోషకాహార లోపానికి ప్రధాన కారణాలు బాల్య వివాహం,  శిశువులకు,  చిన్న పిల్లలకు సరైన ఆహారం ఇవ్వకపోవడం, చిన్ననాటి అనారోగ్యాలు,  తక్కువ బరువుతో పుట్టడం వంటివి ముఖ్యమైనది.  ఈ సమస్యను పరిష్కరించడానికి  బహుముఖ విధానం అవసరం.

ప్రధాన్ మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (పీఎం పోషణ్) పథకాన్ని గతంలో 'పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం జాతీయ కార్యక్రమం'గా పిలిచేవారు. ఇది బాలల హక్కుల ఆధారిత కేంద్ర ప్రాయోజిత పథకాలలో ప్రధానమైనది. ఈ పథకం ప్రభుత్వ,  ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల్లో 4–8 తరగతులలో చదువుతున్న పాఠశాల పిల్లలందరికీ వర్తిస్తుంది. పాఠశాల హాజరు పెరగడం వల్ల  పిల్లల పోషణను పెంపొందిస్తుంది. ఈ పథకంలో ముఖ్యమైన సామాజిక విలువ ఉంది. చిన్నారుల మధ్య  సమానత్వాన్ని పెంపొందిస్తుందని సూచించడానికి ఆధారాలు కూడా ఉన్నాయి.

జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ), 2013 షెడ్యూల్ II, ఈ పథకం కింద ప్రాథమిక తరగతి పిల్లలకు 450 కేలరీలు,  12 గ్రాముల ప్రోటీన్ , 700 కేలరీలు,  20 గ్రాముల ప్రోటీన్లతో కూడిన వేడి వేడి భోజనం అందించాలని ఆదేశించింది. పప్పులు, కూరగాయలు, వంటనూనెలు, ఇతర నూనెలు,  మసాలాలను కొనేందుకు ధరలను కూడా నిర్ణయించారు.  అన్ని పని దినాలలో ప్రాథమిక స్కూల్ విద్యార్థికి రోజుకు వంట ఖర్చు కోసం రూ. 4.97  చొప్పున, ప్రాథమికోన్నత విద్యార్థికి రూ. 7.45 చొప్పున ఈ పథకం చెల్లిస్తుంది.

పథకం మార్గదర్శకాల ప్రకారం... ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రతివారం ఒక ప్రత్యేకమైన మెన్యూ ఉంటుంది.  స్థానికంగా లభించే  సాంస్కృతికంగా ఆమోదయోగ్యమైన ఆహార పదార్థాలను ఉపయోగించి విభిన్నమైన,  ఆరోగ్యకరమైన  పోషకమైన మెనూలను రూపొందించడానికి స్థానికుల మద్దతును కోరాలని పాఠశాలలను ప్రోత్సహిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాలు స్థానిక ఆహారపు అలవాట్లను బట్టి స్థానిక ఉత్పత్తులను ప్రతిబింబించే మెనూను తయారు చేసుకోవాలని పాఠశాలలకు సూచించడం జరిగింది.

విద్యార్థులకు వేడిగా వండిన భోజనం/ఆహార భద్రతా భత్యం (ఎఫ్ఎస్ఏ) అందించడమే కాకుండా, దిగువ పేర్కొన్న విధంగా పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం అనేక చర్యలు తీసుకుంది:

–కరువు సమయంలో (జిల్లాలను కరువు ప్రాంతాలునూ ప్రకటించారు)  మహమ్మారి కాలంలో వేడిగా వండిన భోజనం/ఎఫ్ఎస్ఏను అందిస్తున్నారు.

–ప్రతి పాఠశాలలో పాఠశాల పోషకాహార (వంటగది) గార్డెన్లను ఏర్పాటు చేశారు. పాఠశాల పిల్లల ఆహారంలో పోషకమైన ఆకు కూరలను,  పండ్లను చేర్చారు.

–అనుబంధ పోషకాహారాన్ని అందిస్తున్నారు. అంటే ఫ్లెక్సీ కాంపోనెంట్ కింద రక్తహీనత ఎక్కువగా ఉన్న జిల్లాలు  జిల్లాల్లో గుడ్లు, పండ్లు, చిక్కీలు మొదలైనవి (ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం) అందిస్తున్నారు.

–పీఎం పోషణ్ కింద భోజనంలో చిరుధాన్యాలను చేర్చాలని రాష్ట్రాలకు,  కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా ఇవ్వడం జరిగింది.

–పీఎం పోషణ్ భోజనంలో ‘ఆయుర్వేద ఉత్పత్తులు/వస్తువులను’ చేర్చారు.

–‘తిథి భోజనం’ కింద పూర్తి భోజనం/అదనపు వస్తువులను అందించడం జరుగుతోంది (పుట్టినరోజులు, వార్షికోత్సవం, జాతీయ ప్రాముఖ్యత ఉన్న రోజుల్లో ప్రత్యేక భోజనం/అదనపు ఆహార పదార్థాలు పెడుతున్నారు)

–ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రం కింద పాఠశాల పిల్లలకు ఆరోగ్య తనిఖీలు చేస్తున్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం కింద సంవత్సరానికి ఒకసారి నులిపురుగుల నివారణ మందులను ఇస్తున్నారు.

–డబ్ల్యూఐఎఫ్ఎస్ (వీక్లీ ఐరన్ & ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్) కింద ఐరన్  ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందించడం జరుగుతోంది. ఈ కార్యకలాపాలు ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి నిర్వహించబడుతున్నాయి.

–ఇవేకాకుండా కొన్ని రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాలు తమ బడ్జెట్ల నుండి గుడ్లు, పండ్లు, పాలు మొదలైన అదనపు ఆహార పదార్థాలను కూడా అందజేస్తున్నాయి.

ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు. 

***


(Release ID: 1779427) Visitor Counter : 254
Read this release in: English , Bengali , Tamil