ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యాధుల నిర్మూలన కార్యక్రమం దేశవ్యాప్త అమలు

Posted On: 07 DEC 2021 3:47PM by PIB Hyderabad

మలేరియా, లింఫాటిక్ ఫైలేరియాసిస్, కాలా-అజర్, క్షయ, కుష్ఠు వ్యాధి వంటి వివిధ వ్యాధులను నిర్మూలించే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం అమలు చేసింది.నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ (ఎన్ సివిబిడిసి) వెక్టర్ బోర్న్ వ్యాధుల నివారణ, నియంత్రణ కోసం నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్ సి వి బి డి సి పి) అనే ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎన్ విబిడిసిపి కింద, మలేరియా, ఫైలేరియా కాలా-అజర్ అనే మూడు వ్యాధులు ఎలిమినేషన్ (నిర్మూలన)ప్రోగ్రామ్ కింద ఉన్నాయి. ఈ వ్యాధులు నిర్మూలనకు లక్ష్యంగా నిర్దేశిత మయ్యాయి.నివారణ కోసం కాదు.

వ్యాధి నిర్మూలన అనేది నిర్దిష్ట ఏజెంట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సంభవించే ఇన్ఫెక్షన్‌లను జోక్యం చర్యలు ఇకపై అవసరం లేకుండా సున్నా స్థాయికి  శాశ్వతంగా తగ్గించడం.

 

ఉద్దేశాలు, ఆశయాలు, లక్ష్యాలు, దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి..

 

I.మలేరియా 2030 నాటికి నిర్మూలన లక్ష్యంగా ఉంది

II.లింఫాటిక్ ఫిలారియాసిస్ 2030 నాటికి నిర్మూలన లక్ష్యంగా ఉంది

III.కాలా అజర్ 2023 నాటికి నిర్మూలన లక్ష్యంగా ఉంది.

 

కుష్ఠు వ్యాధి కోసం, ప్రభుత్వం జాతీయ నివారణ కుష్ఠు వ్యాధి నివారణ కార్యక్రమం (ఎన్ ఎల్ ఇ పి ) ను అమలు చేస్తోంది. భారత దేశాన్ని కుష్టు వ్యాధి రహితంగా మార్చడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఎన్ ఎల్ ఈపి అనేది నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎమ్) కింద చేపట్టిన కేంద్ర ప్రాయోజిత పథకం. జిల్లా స్థాయిలో 1/10,000 కంటే తక్కువ జనాభాకు కుష్ఠు వ్యాధి ప్రాబల్య రేటును తగ్గించడానికి ఎన్ ఎల్ ఇ పి లక్ష్యంగా ఉంది; జిల్లా స్థాయిలో ప్రతి మిలియన్ జనాభాకు గ్రేడ్ 2 వైకల్యత రేటు సున్నా; కొత్త కేసుల్లో గ్రేడ్ 2 ఐ వైకల్యం నుంచి జీరో వరకు , పిల్లల కుష్ఠు వ్యాధి కేసులు సున్నా స్థాయికి చేరతాయి.  కుష్ఠు వ్యాధి గురించి అవగాహన కల్పించడం కూడా దీని లక్ష్యం.

 

క్షయ వ్యాధి కోసం, 2030 సుస్థిర అభివృద్ధి (ఎస్ డిజిలు) ప్రపంచ లక్ష్యాల కంటే ఐదు సంవత్సరాల ముందు, అంటే 2025 నాటికి క్షయను అంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం జాతీయ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్ టిఇపి) అమలు చేస్తోంది.

 

వెక్టర్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, కుష్ఠు వ్యాధి , టిబి కి సంబంధించి సవిస్తరమైన రాష్ట్ర/యుటి వారీగ బడ్జెట్ అనుబంధం లో ఇవ్వబడింది.

 

బి. లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం క్రింది చర్యలు తీసుకుంది.

 

మలేరియా

 

*ముందస్తు రోగనిర్ధారణ, రాడికల్ చికిత్స: రాపిడ్ డయగ్నాస్టిక్ టెస్ట్ కిట్ లను ఉపయోగించడం, రోగనిర్ధారణ కొరకు ఆషా ప్రోత్సాహకాలు ,సంపూర్ణ చికిత్సను ధృవీకరించడం

*కేస్ ఆధారిత నిఘా ,వేగవంతమైన ప్రతిస్పందన

*ఇంటిగ్రేటెడ్ వెక్టర్ మేనేజ్ మెంట్ (ఐవిఎమ్)

*ఇండోర్ అవశేష పిచికారీ (ఐఆర్ ఎస్)- 2 వార్షిక పరాన్నజీవి ఘటన >2 ఉన్న ప్రాంతాల్లో వెక్టర్ కంట్రోల్ కోసం ఐఆర్ ఎస్ 2 రౌండ్లు.

*దీర్ఘకాలిక కీటక వలలు (ఎల్ ఎల్ ఐఎన్ లు) / క్రిమిసంహారిణి చికిత్స చేయబడ్డ బెడ్ నెట్ లు (ఐటిఎన్ లు):

*వార్షిక పరాన్నజీవి ఘటనలతో సబ్ సెంటర్ లను కవర్ చేయడం కోసం ఈ కార్యక్రమంలో ఎల్ ఎల్ ఐఎన్ లు ఉపయోగించబడుతున్నాయి >1.

*లార్వా సోర్స్ మేనేజ్ మెంట్ (ఎల్ ఎస్ ఎమ్)

*అంటువ్యాధి సంసిద్ధత ,ముందస్తు ప్రతిస్పందన

*ప్రవర్తన మార్పు కమ్యూనికేషన్ -కమ్యూనిటీ సమీకరణ

 

 

లింఫాటిక్ ఫైలారియాసిస్:

·

వ్యాధి వ్యాప్తి నియంత్రణ కోసం మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎం డి ఎ): వ్యాధి నిర్మూలనను వేగవంతం చేయడానికి, లింఫాటిక్ ఫైలేరియాసిస్ (ఎపిఎల్ ఎఫ్) 2018, ట్రిపుల్ డ్రగ్ థెరపీ (ఐవర్మెక్టిన్ + డైథైల్కార్బామజిన్ (డిఇసి) + అల్బెండజోల్) నిర్మూలన కోసం యాక్సిలరేటెడ్ ప్లాన్ 30 జిల్లాల్లో అమలు అయింది. ఇంకా పెంచబడుతోంది.

 

మోర్బిడిటీ మేనేజ్ మెంట్ & డిసెబిలిటీ ప్రివెన్షన్ (ఎం ఎం డి పి) లింఫోడెమా కేసులకు సంబంధించి  హైడ్రోసీల్ సర్జరీ ,ఇంటి ఆధారిత మోర్బిడిటీ మేనేజ్ మెంట్ సర్వీసుల కోసం 100% కవరేజీని లక్ష్యంగా చేసుకుంది.

 

ట్రాన్స్ మిషన్ అసెస్ మెంట్ సర్వే (టిఎఎస్) ద్వారా <1% మైక్రోఫైలేరియా రేటు సాధించబడింది.

·

కాలా-అజర్:

 

చికిత్స కోసం సింగిల్ డోస్ లిపోసోమల్ యాంఫోటెరిసిన్ బి (లాంబ్)

ఐఆర్ ఎస్ కోసం డిడిటి స్థానంలో సింథటిక్ పైరెథ్రాయిడ్ ఉపయోగించడం

ఐఆర్ ఎస్ సౌలభ్యం ,నాణ్యత కోసం స్టిరప్ పంపుల స్థానంలో హ్యాండ్ కంప్రెషన్ పంపులను ప్రవేశపెట్టడం

2018 లో పికెడిఎల్ రోగులకు రూ. 2,000/- నుంచి 4,000/- ,ఆషాకు రూ.300/- నుంచి 500/- వరకు సవరించిన ప్రోత్సాహకాలు

కె ఎ ప్రభావిత గ్రామాలలో పి ఎం ఎ వై-జి కింద పక్కా ఇళ్ళ నిర్మాణం : 2017-18లో మొత్తం 25,955 ఇళ్లు (బీహార్ లో 1371 ఇళ్లు , జార్ఖండ్ లో 24584) నిర్మాణం.

 

జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్ ఎల్ ఈపి):

 

గ్రేడ్ ఐఐ వైకల్యాలను నిరోధించడం కోసం రెగ్యులర్ గా ఇంకా ప్రారంభ దశలో కుష్ఠువ్యాధి కేసులను గుర్తించడానికి గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో, ఆషాలు ,ఫ్రంట్ లైన్ వర్కర్ ల ద్వారా యాక్టివ్ కేస్ డిటెక్షన్ ,రెగ్యులర్ సర్వైవలెన్స్ కోసం పటిష్టంగా రూపొందించిన ఆపరేషనల్ స్ట్రాటజీ ని అమలు చేశారు.

 

పిల్లల (0-18 సంవత్సరాలు) స్క్రీనింగ్ కోసం రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమ్ (ఆర్ బిఎస్ కె) ,రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమ్ (ఆర్ కెఎస్ కె)లతో కుష్ఠు వ్యాధి స్క్రీనింగ్ ను  సమన్వయం చేశారు.

 

30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల స్క్రీనింగ్ కోసం ఆయుష్మాన్ భారత్ - హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ (ఎబి-హెచ్ డబ్ల్యుసి) కింద సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలతో కుష్ఠు వ్యాధి స్క్రీనింగ్ ను సమన్వయం చేశారు.

 

కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి కమ్యూనిటీ లెవల్ వద్ద ట్రాన్స్ మిషన్ ఛైయిన్ ను అడ్డు కునేలా  ఇండెక్స్ కేస్ అర్హత కలిగిన కాంటాక్ట్ లకు పోస్ట్ ఎక్స్ పోజర్ ప్రొఫైలాక్సిస్ (పి పి పి ) ఇస్తారు..

 

వైకల్య నివారణ ,వైద్య పునరావాసం (డిపిఎమ్ ఆర్) అంటే స్పందన నిర్వహణ, మైక్రోసెల్యులర్ రబ్బర్ (ఎంసిఆర్) పాదరక్షలు, సహాయ, ఉపకరణాలు, స్వీయ సంరక్షణ కిట్లు మొదలైన వాటి ఏర్పాటు కోసం ఈ కార్యక్రమం కింద వివిధ సేవలు అందిస్తున్నారు.

 

జిల్లా ఆసుపత్రులు/మెడికల్ కాలేజీలు/సెంట్రల్ లెప్రోసీ ఇనిస్టిట్యూట్ ల్లో రీ కనస్ట్రక్టివ్ సర్జరీలు (ఆర్ సిఎస్) నిర్వహిస్తారు. ఆర్ సిఎస్ చేయించుకునే ప్రతి రోగికి రూ.8000 సంక్షేమ భత్యం చెల్లిస్తారు.

 

జాతీయ క్షయ నివారణ కార్యక్రమమం (ఎన్ టి ఇ పి ):

 

క్షయ రోగులందరి ముందస్తు నిర్ధారణ, నాణ్యతా హామీ ఔషధాలతో సకాలంలో చికిత్స ,చికిత్సా నియమావళితో పాటుగా తగిన రోగి మద్దతు వ్యవస్థలు కట్టుబడి ఉండడాన్ని ప్రోత్సహించడం

 

ప్రయివేట్ సెక్టార్ లో సంరక్షణ కోరుకునే రోగులతో నిమగ్నం కావడం

 

అధిక ప్రమాదం/దుర్బల జనాభాలో యాక్టివ్ కేస్ గుర్తింపు, కాంటాక్ట్ ట్రేసింగ్ తో సహా నివారణ వ్యూహాలు

 

గాలి ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్ నియంత్రణ.

 

సామాజిక నిర్ణయాత్మకాలను పరిష్కరించడానికి బహుళ రంగాల ప్రతిస్పందన..

 

అనుబంధం

 

ప్రస్తుత సంవత్సరానికి విబిడిలు, ఎన్ ఎల్ ఈపి ,ఎన్ టిఇపి లకు ఇంటిగ్రేటెడ్ బడ్జెట్ కింద సమకూర్చిన ఆర్థిక సాయం

--------------------------------------------------------------------------------------------------

                                                                                                              రు.లక్షలలో.

----------------------------------------------------------------------------------------------------------

రాష్ట్రాలు/యుటి లు                  వి బి డి లు.             ఎన్ ఎల్ ఈపి         ఎన్ టిఇపి

---------------------------------------------------------------------------------------------------------                                                                                                             

ఆంధ్రప్రదేశ్.                             2182.36.                       160.                      5587

అరుణాచల్ ప్రదేశ్.                          6.78.                         95.                     1783

అస్సాం.                                     991.92.                       120.                     4828

బీహార్.                                      246.35.                       263                      4118

చత్తీస్ గఢ్.                                215.32.                       153.                     3832

గోవా.                                            4.68.                           5.                       322

గుజరాత్.                                 1691.42.                      132.                      5755

హర్యానా.                                     80.27.                        47.                      4454

హిమాచల్ ప్రదేశ్.                           1.67.                         26.                     1662

జార్ఖండ్.                                    327.82.                      190.                     4257

కర్ణాటక.                                     788.02.                        88.                      699

కేరళ.                                        210.35.                         25.                     4163

మధ్యప్రదేశ్.                                 33.03.                       198.                     7767

మహారాష్ట్ర.                                 75.82.                       430                    10492

మణిపూర్.                                    1.00.                         20.                     2359

మేఘాలయ.                               152.00.                        35.                     1128

మిజోరం.                                      14.64.                        25.                     1414

నాగాలాండ్.                                   0.56.                        75.                     1909

ఒడిశా.                                       154.17.                      219.                     5237

పంజాబ్.                                    123.26.                        66.                      413

రాజస్థాన్.                                   113.14.                        62.                     4002

సిక్కిం.                                           1. 00.                        35.                       941

తమిళనాడు.                                48.06.                       165.                     6497

తెలంగాణ.                                   21.97.                       132.                     5215

త్రిపుర.                                      655.86.                         22.                     1135

ఉత్తరప్రదేశ్.                             1879.45.                       420.                   13517

ఉత్తరాఖండ్.                                 8.51.                         16                      2227

పశ్చిమ బెంగాల్.                           83.33.                       195.                     7940

ఢిల్లీ.                                             0.00.                         85.                     1796

పుదుచ్చేరి.                                     0.00.                          5.                       417

జమ్మూ & కాశ్మీర్.                             0.00.                        28.                     2300

అండమాన్ -నికోబార్ దీవులు.         1.58.                          9.                        206

చండీగఢ్.                                      7.85.                          9.                        418

దాద్రా & నాగర్ హావేలీ

డామన్ & డయు.                         52.45.                        10.                        323

లడఖ్.                                          0.00.                          2.                        390

లక్షద్వీప్                                         ౦.౦౦.                         9.                          62

మొత్తం.                                  10174.64.                   3576.                   129579

 

*అక్టోబర్ 31, 2021 వరకు

 ——————————————————————————————————

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.

 

****(Release ID: 1779022) Visitor Counter : 113


Read this release in: English , Bengali , Tamil