ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ సంక్షోభం మళ్ళీ వచ్చే ముప్పు తగ్గించటానికి తీసుకున్న చర్యలు

Posted On: 07 DEC 2021 3:48PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా కోవిడ్  పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉంది. పరీక్షలు జరపటం, సోకే అవకాశమున్నవారి ఆచూకే కనిపెట్టటం, చికిత్స అందించటం, కోవిడ్  నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు పాటించేలా చూడటం, టీకాలివ్వటం అనే ఐదంచెల వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆ విధంగా దేశంలో మళ్ళీ కోవిడ్  తలెత్తకుండా జాగ్రత్తపడుతోంది. అదే విధంగా ఇండియన్ సార్స్ –కోవిడ్ -2 జీనోమీక సర్వైలెన్స్ కన్సార్షియం  - ఇన్సాకార్గ్  ఏర్పాటు చేయటం ద్వారా జీనోమ్ సీక్వెన్సింగ్ తో కొత్త వేరియెంట్ల ఆనవాలు పట్టే చర్యలు తీసుకుంది.

నేషనల్ బయోఫార్మా మిషన్,  ఇండ్ – సెపి  మిషన్  అనే రెండు కీలక కార్యక్రమాల అమలుకు బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ అండగా నిలిచింది.  ఇలాంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు సక్రమంగా స్పందించేలా ఇవి జాతీయ టీకా కార్యక్రమాల రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తాయి. అదే విధంగా మిషన్ కోవిడ్  సురక్ష అని పిలిచే  భారత కోవిడ్  టీకా అభివృద్ధి మిషన్ ను ఆత్మనిర్భర భారత్ మూడో పాకేజ్ లో భాగంగా ప్రారంభించిన సంగతి  తెలిసిందే. దీనివలన కోవిడ్  టీకా మీద పరిశోధన, అభివృద్ధికి అవకాశం మెరుగుపడింది. ఈ మిషన్ కు బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ సారధ్యం వహించగా బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అమలు చేసింది.

కోవిడ్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కోవటానికి, అప్రమత్తంగా ఉండటానికి, మరేవైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడితే రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అండగా నిలబడటానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంది. సాంకేతిక మార్గదర్శనం అందించటంతోబాటు ఆరోగ్య మౌలికసదుపాయాల పెంపుదలలోనూ చొరవ చూపింది. అందులో ఔషధాల సరఫరా, వైద్యపరమైన ఆక్సిజెన్ సరఫరా లాంటివి ఉన్నాయి. అందులో కొన్ని ప్రధానమైన చొరవలు ఇలా ఉన్నాయి.

     i.        రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 150 కి పైగా మార్గదర్శకాలు, సలహాలు ప్రణాళికలు అందజేసింది.

    ii.        ఎప్పటికప్పుడు వస్తున్న శాస్త్ర సాంకేతిక అధ్యయన ఫలితాలను, చికిత్సావిధానాల మీద మార్గదర్శకాలను అందించటం

  iii.        పిల్లల్లో కోవిడ వ్యాప్తి మీద అప్రమత్తం  చేసి మార్గదర్శకాలను ఇవ్వటం, పిల్లల్లో మల్టీ సిస్టమ్ ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్ కు, కోవిడ్  కు మధ్య ఉన్న తాత్కాలిక సంబంధం గురించి తెలియజెప్పటం

   iv.        కోవిడ్ నిర్థారణ లేబరేటరీలను 2021 డిసెంబర్ 1 నాటికి 3062 కు పెంచటం

    v.        మ్యూకార్మైకాసిస్ వ్యాధి గురించి అప్రమత్తం చేసి అన్నీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు  నివారణ, నియంత్రణ మీద మార్గదర్శకాలు అందించి, చికిత్సావిధానాలు తెలియజేయటం

   vi.        నిపుణులను సంప్రదించినమీదట కోవిడ్ అనంతర పరిస్థితులను ఎదుర్కోవటం మీద డాక్టర్లకు కూడా సమగ్ర మార్గదర్శకాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తయారుచేసి అందజేయటం

 vii.        పీపీఇ  కిట్లు, ఎన్-95 మాస్కులు, వెంటిలేటర్లతోబాటు  హైడ్రాక్సీ క్లోరోక్విన్, రెమిడిసెవిర్ లాంటి మందుల రవాణా తదితర అంశాలలో రాష్ట్రాలకు సహకారం అందించటం

viii.        ఆక్సిజెన్ సిలిండర్లు, ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు సరఫరా చేయటం ద్వారా రాష్ట్రాలకు కేంద్రం సాయపడింది. అదే విధంగా ఆక్సిజెన్ కాన్సంట్రేటర్ ప్లాంట్లు  నెలకొల్పటంలో కూడా సహాయం చేసింది.  ఆస్పత్రులలో ఆకసీజెన్ వినియోగం మీద ఆడిట్ చేపట్టాలని కూడా రాష్ట్రాలకు సలహా ఇచ్చింది. అందుబాటు సమాచారాన్ని అందుబాటులో ఉంచటం ద్వారా ఎక్కడా లోటు రాకుండా సమర్థవంతంగా వాడుకునే వీలు కల్పించింది.

   ix.        దేశంలో 18 ఏళ్ళు పైబడినవారందరికీ వారి సామాజిక, ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేకుండా అన్నీ ప్రభుత్వ టీకా కేంద్రాలలోనూ ఉచితంగా కోవిడ్  టీకా ఇచ్చే ఏర్పాటు  చేసింది. వృద్ధులకు, వికలాంగులకు , మానసిక వికలాంగులకు, అనాథలకు టీకా మందు సులభంగా అందుబాటులో ఉండే ఏర్పాటు కూడా చేసింది. హర్  ఘర్ దస్తక్  కార్యక్రమం ద్వారా తీకాల వేగం పెరిగింది. స్థానిక సంఘాల నాయకులు, ఎన్జీవోలు. ఎన్ ఎస్ ఎస్ తదితర సంస్థల సేవలను వాడుకుంటూ టీకాల ప్రచారోద్యమాన్ని సమర్థంగా నిర్వహించారు.  దీనివలన అర్హులైన జనాభాలో అత్యధికభాగం టీకాలు వేయించుకోవటం సాధ్యమైంది. 

    x.        వివిధ మార్గాల ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు అందజేయటం కూడా సాధ్యమైంది.

   xi.        2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. .1113.21 కోట్లమేరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద కోవిడ్ నియంత్రణ కోసమే కేటాయించారు.

 xii.        సెప్టెంబర్ 2020 నుంచి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం వివిధ కోవిడ్  సంబంధం కార్యకలాపాలకోసం నిధుల వాడకానికి అనుమతి ఇచ్చింది.

xiii.         2020-21 లో కోవిడ్ అత్యవసర చికిత్స అవసరాల దృష్ట్యా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ. 8257.88 కోట్లమేరకు నిధులు విడుదలయ్యాయి. ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటానికి, లేబరేటరఎఎలా నెట్ వర్క్ ను విస్తరించటానికి, నిఘా పెంచి కోవిడ్ సోకే అవకాశమున్నవారి ఆనవాలు పట్టుకోవటానికి. పీపీ కీటలు, ఎన్ 95 మాస్కులు, వెంటిలేటర్ల కొనుగోలుకు ఇవి పనికొచ్చాయి.

xiv.        ఇవే కాకుండా కోవిడ్ 19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్యవయవస్థల సమాయత్తత పాకేజ్ రెండో దశను కూడా రూ. 23,123 కోట్లతో కాబినెట్ ఆమోదించింది. ఇందులో 15 వేలకోట్లు కేంద్ర ప్రభుత్వ వాటా కాగా  రూ. 8,123 కోట్లు రాష్ట్రాల వాటా. దీన్ని 2021 జులై 1 నుంచివ అమలు చేస్తున్నారు.

18 ఏళ్ళు పైబడ్డవారందరికీ  డిసెంబర్ 2021 లోగా అవసరమైన టీకా డోసులు తగినన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉండేట్టు చేస్తాం.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి  డాక్టర్ భారతీ  ప్రవీణ్ పవార్ ఈ మేరకు రాజ్యసభకు ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

 

 

 

****


(Release ID: 1778956) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Manipuri , Tamil