విద్యుత్తు మంత్రిత్వ శాఖ
గోవా & కేంద్రపాలిత ప్రాంతాల జెఇఆర్ సి సభ్యురాలితో ప్రమాణ స్వీకారం చేయించిన విద్యుత్ శాఖ మంత్రి
Posted On:
06 DEC 2021 5:40PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్, ఎంఎన్ఆర్ఇ శాఖల మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ గోవా, కేంద్రపాలిత ప్రాంతాల జెఇఆర్ సి సభ్యురాలు శ్రీమతి జ్యోతి ప్రసాద్ తో (లీగల్) ప్రమాణ స్వీకారం చేయించారు. విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్, మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గోవా, కేంద్రపాలిత ప్రాంతాల సభ్యురాలుగా (లీగల్) శ్రీమతి జ్యోతి ప్రసాద్ నియమితులయ్యారు. ఆమె ఎల్ఎల్ బి; బిఎస్ సి చేశారు. 2021 జూన్ 30వ తేదీన పిజిసిఐఎల్ సీనియర్ జనరల్ మేనేజర్ (లీగల్)గా ఆమె పదవీ విరమణ చేశారు. అంతకు ముందు ఆమె పిజిసిఐఎల్ లోనే డిప్యూటీ జనరల్ మేనేజర్, ఎజిఎం, చీఫ్ మేనేజర్, లా ఆఫీసర్ (కార్పొరేట్ సెంటర్) హోదాల్లో పని చేశారు. పిజిసిఐఎల్ లో చేరడానికి ముందు ఆమె 1985 ఆగస్టు నుంచి 1993 మార్చి వరకు ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు.
2003 విద్యుత్ చట్టం కింద ఢిల్లీ మినహా కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటికీ కలిపి జాయింట్ ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (జెఇఆర్ సి) ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గోవా కూడా ఆ జాయింట్ కమిషన్ లో చేరింది. ఈ కమిషన్ లో చైర్ పర్సన్, ఒక సభ్యుడు ఉంటారు.
చట్టం ప్రకారం గోవా, కేంద్రపాలిత ప్రాంతాల జెఇఆర్ సి విద్యుత్ ఉత్పత్తి టారిఫ్ లు, సరఫరా, ట్రాన్స్ మిషన్, వీలింగ్, డిస్ర్టిబ్యూషన్ లైసెన్సీల సేకరణ ప్రాసెస్ వ్యవహారాలు నిర్ణయించడంతో పాటు విద్యుత్ కొనుగోలును నియంత్రించడం, గోవా, 6 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ట్రాన్స్ మిషన్, వీలింగ్ కు అవకాశాలు కల్పించడం వంటి విధులు నిర్వర్తిస్తుంది. అలాగే రాష్ట్రప్రభుత్వం/ కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలకు జాతీయ విద్యుత్ విధానం, టారిఫ్ విధానంలో సలహాలు ఇస్తుంది. అంతే కాదు కార్యకలాపాల్లో పరస్పర పోటీ, సమర్థత, పొదుపును ప్రోత్సహించడం; విద్యుత్ పరిశ్రమకు అవసరమైన పెట్టుబడుల సమీకరణకు ప్రోత్సాహం ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటుంది.
***
(Release ID: 1778767)
Visitor Counter : 151