ఆయుష్
azadi ka amrit mahotsav g20-india-2023

ఔషధ మొక్కల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన లక్నోకి చెందిన ఎన్ఎంపిబి, సిఎస్ఐఆర్-సీమాప్

Posted On: 06 DEC 2021 12:44PM by PIB Hyderabad

జాతీయ ఔషధ మొక్కల బోర్డు (ఎన్ఎంపిబి), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్, (సిఎస్ఐఆర్-సీమాప్), ఔషధ మొక్కలకు సంబంధించి నాణ్యమైన మొక్కలు ఉత్పత్తి (క్యూపిఎం)ని ప్రోత్సహించడానికి ఉమ్మడి సహకార ప్రయత్నాలను విస్తరించడానికి ఈ రోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. 

ఈ ఎమ్ఒయు ఎన్ఎంపిబి ద్వారా గుర్తించిన ఔషధ మొక్కలు, మూలికల క్యూపిఎం అభివృద్ధిని సులభతరం చేస్తుంది మరియు వివిధ వ్యవసాయ-వాతావరణ మండలాల్లో తగిన ఔషధ మొక్కలను అభివృద్ధి, ప్రచారం, సంరక్షణ మరియు పెంపకం కోసం ఆయా నర్సరీలను స్థాపించడంలో సహాయపడుతుంది.  లక్నోసిఎస్ఐఆర్-సీమాప్, సామూహిక గుణకారం, వ్యవసాయ-సాంకేతికత అభివృద్ధి, ఎంపిక చేసిన ఔషధ మొక్కలు మరియు మూలికల నాణ్యమైన నాటడం మెటీరియల్ ఉత్పత్తిపై పరిశోధనను కూడా చేపట్టవచ్చు.

ఎమ్‌ఓయు కాలంలో,  ఎన్ఎంపిబి తన అమలు చేసే ఏజెన్సీల ద్వారా అంటే రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డులు, రాష్ట్ర ఉద్యానవన శాఖలు, సిఎస్ఐఆర్-సీమాప్ లక్నోతో కలిసి మరియు సహకారంతో భారతదేశం అంతటా ప్రాంతీయ, సులభతర కేంద్రాలు, ఔషధ మొక్కల క్యూపిఎం  అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇస్తుంది. 

ఆయుష్ మంత్రిత్వ శాఖ క్రింద పని చేస్తున్న ఎన్ఎంపిబి,  ఔషధ మొక్కలకు సంబంధించిన అన్ని విషయాలను సమన్వయం చేయడం మరియు వాణిజ్యం, ఎగుమతి, సంరక్షణ సంబంధించిన విధానాలు మరియు కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం తప్పనిసరి.

 

****(Release ID: 1778649) Visitor Counter : 114


Read this release in: English , Urdu , Hindi