సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

తయారీకి రంగానికి ఎంఎస్ఎంఈల స‌హ‌కారం

Posted On: 06 DEC 2021 1:30PM by PIB Hyderabad

భారత ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల (ఎంఎస్ఎంఈ) రంగం కీల‌క‌మైనది. కేంద్ర గ‌ణాంకాలు, కార్య‌క్రమాల అమ‌లు శాఖ‌కు చెందిన కేంద్ర గ‌ణాంకాల కార్యాల‌యం అందిన సమాచారం ప్రకారం  2018-19 మరియు 2019-20 సంవత్సరాల్లో అఖిల భార‌త త‌యారీ స్థూల విలువ ఉత్పత్తిలో ఎంఎస్ఎంఈ రంగం తయారీ వాటా వరుసగా 36.9% మరియు 36.9%గా ఉంద‌ని తెలిపింది.  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంస్థ నుండి అందిన సమాచారం ప్రకారం 2019-20-  2020-21 సంవత్సరాలలో ఆల్ ఇండియా ఎగుమతులకు పేర్కొన్న ఎంఎస్ఎంఈ రంగా ఉత్పత్తుల ఎగుమతి వాటా వరుసగా 49.8% మరియు 49.4%గా ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక‌ లిఖితపూర్వక సమాధానంలో తెలియ‌జేశారు.
                                                                         

***


(Release ID: 1778451) Visitor Counter : 157


Read this release in: English , Urdu , Malayalam