ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో సోదాలు నిర్వహించిన ఆదాయం పన్ను శాఖ
Posted On:
06 DEC 2021 11:37AM by PIB Hyderabad
తక్కువ పన్ను ఉన్న విదేశాలలో ప్రయోజనం పొందడానికి ఒక ట్రస్టును, ఒక కంపెనీని సృష్టించి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక పన్ను చెల్లింపు దారుడి నివాసం, కార్యాలయంపై ఆదాయం పన్ను శాఖ అధికారులు 24.11.2021 న దాడి చేసి సోదాలు నిర్వహించారు. రెండు ప్రాంతాలపై అధికారులు ఒకేసారి దాడి చేసి సోదాలు చేపట్టారు.
మనుగడలో లేని సంస్థ పేరిట 40 కోట్ల రూపాయల విలువ చేసే స్థిర, చర ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దేశంలో శాఖలు కలిగి ఉన్న ఒక విదేశీ బ్యాంకు సేవలను ఈ వ్యక్తి వినియోగించుకున్నట్లు అధికారులు గుర్తించారు. సంపద నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, ఆస్తుల కేటాయింపు, పెట్టుబడుల అధ్యయనం, స్థిర ఆదాయం, పెట్టుబడి వ్యూహాలు లాంటి సేవలను బ్యాంకు ద్వారా సదరు పన్ను చెల్లింపుదారుడు పొందుతున్నట్టు అధికారులు గుర్తించారు.
విదేశీ ఆస్తులను తన పేరు మీద కలిగివున్నట్టు రుజువు చేసే ఆధారాలను అధికారులు ఈ-మెయిల్, ఇతర పత్రాల రూపంలో గుర్తించారు. విదేశీ ఆస్తులను కలిగివున్నట్టు ఆ వ్యక్తి అధికారుల విచారణలో అంగీకరించాడు. కార్యాలయంలో ఖాతాల పుస్తకాల సమాంతర సెట్ రూపంలో డేటాను కలిగి ఉన్న ఒక హార్డ్ డిస్క్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన ఆధారాలను పరిశీలించిన అధికారులు దేశంలో నిర్వహించిన వ్యాపార లావాదేవీలను 30 కోట్ల రూపాయల మేర తగ్గించి చూపినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
కేసును అధికారులు విచారిస్తున్నారు.
***
(Release ID: 1778416)
Visitor Counter : 149