పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రాజెక్టుల విజ‌య‌మే కోవిడ్ అనంత‌ర కాలంలో ప‌ర్యాట‌క రంగం పున‌రుజ్జీవానికి కార‌ణం : సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖ‌ల మంత్రి శ్రీ జి.కిష‌న్ రెడ్డి


అగాడా కోట‌, సెయింట్ కాథ‌డ్ర‌ల్ చ‌ర్చి, కుర్దీ మ‌హ‌దేవ్ దేవాల‌యాల వ‌ద్ద సంద‌ర్శ‌కుల‌కు మ‌రిన్ని స‌దుపాయాలు, అభివృద్ధి ప‌నులు ప్రారంభించిన‌ కేంద్ర‌మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 04 DEC 2021 3:40PM by PIB Hyderabad

ఉత్త‌ర‌ గోవాలోని కండోలిమ్ లో వ‌ద్ద ఉన్న అగాడా కోట‌, పాత గోవాలోని సెయింట్ కాథ‌డ్ర‌ల్ చ‌ర్చి, కుర్దిలోని మ‌హ‌దేవ్ దేవాల‌యం వంటి ప‌ర్యాట‌క స్థ‌లాల‌కు  వెలుగులు విర‌జిమ్మే వ‌స‌తులు, ప‌ర్యాట‌కుల సౌక‌ర్యాల క‌ల్ప‌న వంటి అభివృద్ధి ప‌నుల‌కు ఎగువ అగాడా కోట వ‌ద్ద జ‌రిగిన ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో కేంద్ర సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖ‌ల మంత్రి శ్రీ జి.కిష‌న్ రెడ్డి శ‌నివారం శంకుస్థాప‌న చేశారు.

ఆర్కియ‌లాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జాతీయ సాంస్కృతిక నిధితో క‌లిసి ఇండియ‌న్ ఆయిల్ ఫౌండేష‌న్ ఈ అభివృద్ధి ప‌నులు చేప‌డుతోంది. ఎఎస్ఐ గోవా స‌ర్కిల్ ప‌రిధిలోని ఎగువ పేర్కొన్న స్థ‌లాల్లో ప‌ర్యాట‌క మౌలిక వ‌స‌తులు అభివృద్ధి చేస్తున్నారు. ప‌ర్యాట‌కుల కోసం పార్కింగ్‌, టాయ్ లెట్ బ్లాక్‌, మంచినీటి వ‌స‌తులు;  ప‌ర్యాట‌కుల క‌ద‌లిక‌ల‌కు మార్గాల నిర్మాణం, లాండ్ స్కేపింగ్‌,  సిటౌట్లు, విద్యుదీక‌ర‌ణ‌, మార్గ సంకేతాలు వంటి  వ‌స‌తుల‌న్నీ అభివృద్ధి చేస్తారు.

ఒక‌ప‌క్క భార‌త‌దేశం ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ నిర్వ‌హించుకుంటున్న స‌మయంలోనే విముక్తి పోరాట 60 వ వార్షికోత్ప‌వం గోవా నిర్వ‌హించుకుంటూ ఉండడం యాదృచ్ఛిక‌మ‌ని మంత్రి శ్రీ జి.కిష‌న్ రెడ్డి అన్నారు. “ప‌ర్యాట‌క రంగాన్ని కోవిడ్‌-19 దారుణంగా దెబ్బ తీసింది. ప‌ర్యాట‌కంపై ఆధార‌నీయ‌త వ‌ల్ల తీవ్రంగా ప్ర‌భావితం అయింన రాష్ట్రం గోవా. మ‌హ‌మ్మారి కార‌ణంగా గోవా తీవ్రంగా ప్ర‌భావితం అయిన ఈ స‌మ‌యంలో గోవా ప్ర‌భుత్వానికి, గోవా ప్ర‌జ‌ల‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం పూర్తిగా అండ‌గా ఉంటుంది” అని మంత్రి హామీ ఇచ్చారు. గోవాను ప్ర‌పంచ ప‌ర్యాట‌క కేంద్రంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వానికి భార‌త ప్ర‌భుత్వం పూర్తి మ‌ద్ద‌తు అందిస్తున్నారు.

ప‌ర్యాట‌క రంగం తిరిగి సాధార‌ణ స్థితికి చేరుకోవ‌డానికి విజ‌య‌వంత‌మైన భార‌త ప్ర‌భుత్వ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మ‌మే స‌హాయ‌ప‌డింద‌ని మంత్రి అన్నారు. “విజ‌య‌వంత‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాల విజ‌యంతో ప‌ర్యాట‌క రంగాలు తిరిగి సాధార‌ణ స్థితికి వ‌చ్చాయి. ఇప్పుడు గోవా సంద‌ర్శిస్తున్న ప‌ర్యాట‌కులంద‌రూ వ్యాక్సిన్ పూర్త‌యిన వారే. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మ‌యింది” అని ఆయ‌న చెప్పారు. ప‌ర్యాట‌క కేంద్రాల వ‌ద్ద వీలైనంత వ‌ర‌కు అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని మంత్రి రాష్ట్ర ప్ర‌భుత్వ శాఖ‌ల‌ను కూడా కోరారు.

“ఈ రోజు ఆరు ఎఎస్ఐ సైట్ల‌లో ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రుగుతోంది. మ‌రిన్ని ప్ర‌దేశాల్లో కూడా మ‌నం ప‌నులు చేప‌ట్టి గోవాను ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ‌మ్యంగా తీర్చి దిద్దడంలో స‌హాయం అందించ‌వ‌చ్చు” అన్నారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల వేగం పెంచాల‌ని ఆయ‌న సంబంధిత శాఖ‌ల‌న్నింటినీ కోరారు.

గోవా రాష్ర్టానికి అన్ని ర‌కాల మ‌ద్ద‌తు ఇచ్చినందుకు కేంద్ర‌ప్ర‌భుత్వానికి, ప‌ర్యాట‌క & సాంస్కృతిక శాఖ‌ల మంత్రికి ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ ప్ర‌మోద్ సావంత్ ఒక వీడియో  సందేశంలో కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

గోవాలోని ఎఎస్ఐకి చెందిన మూడు ప్ర‌దేశాల్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నందుకు ఇండియ‌న్ ఆయిల్ ఫౌండేష‌న్ కు కేంద్ర పెట్రోలియం, స‌హ‌జ వాయువుల శాఖ మంత్రి శ్రీ హ‌ర్ దీప్ సింగ్ పురి ఒక వీడియో సందేశంలో కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ప‌ర్యాట‌క రంగం క్ర‌మ‌క్ర‌మంగా తిరిగి సాధార‌ణ స్థితికి చేరుతున్నందు వ‌ల్ల ప‌ర్యాట‌క కేంద్రాల వ‌ద్ద అభివృద్ధి ప‌నులు వీలైనంత తొంద‌ర‌గా పూర్తి చేయాల‌ని కేంద్ర ప‌ర్యాట‌క శాఖ స‌హాయ‌మంత్రి శ్రీ శ్రీ‌పాద్ నాయ‌క్ సూచించారు. గోవాలో ప‌ర్యాట‌క రంగం అభివృద్ధికి త‌గినంత మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

పోర్టులు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ మైకేల్ లోబో, జిటిడిసి చైర్మ‌న్ శ్రీ ద‌యానంద్ సోప్టే, ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ శ్రీ విన‌య్ మిశ్రా, ఆర్కియాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా రీజిన‌ల్ డైరెక్ట‌ర్ (సౌత్‌) డాక్ట‌ర్ జి.మ‌హేశ్వ‌రి;  భార‌త ప‌ర్యాట‌క శాఖ‌, జిటిడిసి, ఎఎస్ఐ సీనియ‌ర్ అధికారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

గ‌త చ‌రిత్ర

మ‌న దేశానికి చెందిన వైవిధ్య‌భ‌రిత‌మై, సుసంప‌న్న‌మైన‌ చెక్కు చెద‌ర‌ని సాంస్కృతిక వార‌స‌త్వాన్నిప‌రిర‌క్షించ‌డంలో భాగ‌స్వామ్యాలు, స‌హ‌కారాన్ని జాతీయ సాంస్కృతిక నిధి ప్రోత్స‌హిస్తుంది. మూడు ఎఎస్ఐ ప్ర‌దేశాల వ‌ద్ద నిర్వ‌హించే ప్రాజెక్టుల‌కు ఇండియ‌న్ ఆయిల్ ఫౌండేష‌న్ (ఐఓఎఫ్‌) నిధులు అందిస్తుంది.

స‌మున్న‌త‌మైన చ‌రిత్ర‌ను ప‌రిర‌క్షించి, కాపాడి, ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో ఆర్కియ‌లాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ ఐ), భార‌త ప్ర‌భుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ‌కు చెందిన జాతీయ సాంస్కృతిక నిధి స‌హ‌కారంతో ఇండియ‌న్ ఆయిల్ 2000 ఆగ‌స్టు 24వ తేదీన ఇండియ‌న్ ఆయిల్ ఫౌండేష‌న్ (ఐఓఎఫ్‌) పేరిట లాభాపేక్ష  లేని ట్ర‌స్ట్ ను ఏర్పాటు చేసింది. పూర్తిగా ఇండియ‌న్ ఆయిల్ అందించే నిధుల‌తో ప‌ని చేసే ఈ ఫౌండేష‌న్ దేశంలోని, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని సాంస్కృతిక ప్రాధాన్య‌త గ‌ల స్థ‌లాల‌ను ద‌త్త‌త తీసుకుంటుంది.


(రిలీజ్ ఐడి: 1778216) సందర్శకుల సూచీ సంఖ్య : : 175
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi