యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
అహ్మదాబాద్ సంస్కార్‌ధామ్‌లో 75 పాఠశాలల విద్యార్ధులను ఆకట్టుకున్న నీరజ్ చోప్రా
Posted On:
04 DEC 2021 5:53PM by PIB Hyderabad
కీలకాంశాలు
సమతుల్య ఆహారంపై ఫిట్‌నెస్, క్రీడలలో విద్యార్ధులకు చిట్కాలు చెప్పిన నీరజ్.
ఈ చొరవను యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, విద్యా శాఖ సంయుక్తంగా నిర్వహించాయి.
భారత దేశంలోని అత్యుత్తమ అథ్లీట్లు విడ్యార్ధులను చేరుకొనే ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని , ఒలింపిక్ క్రీడల జావలిన్ త్రో చాంపియన్ నీరజ్ చోప్రా ప్రారంభించారు. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌లోని సంస్కార్‌ధామ్‌లో దాదాపు 75 పాఠశాలలకు చెందిన విద్యార్ధులతో ఆయన సంభాషించారు.
విద్యార్ధులతో వివిద క్రీడలలో పాల్గొన్న నీరజ్ చోప్రా, జావలిన్ త్రోలో వారికి కొన్ని చిట్కాలు చెప్పి, సమతుల్య ఆహారం, ఫిట్‌నెస్, క్రీడల ప్రాధాన్యత గురించి సంబాషించారు. విద్యార్ధులు కుతూహలంతో వేసిన ప్రశ్నలకు ఆశువుగా సమాధానాలు చెప్పడం, చెప్పే విషయాన్ని కథ రూపంలో చెప్పడం శ్రద్ధతో వింటున్న ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నీకు అత్యంత ఇష్టమైన ఆహారం ఏమిటన్న ప్రశ్నకు స్పందనగా, వెజిటేబుల్ బిర్యానీని మసాలా దట్టించకుండా వండటం, దానిని పెరుగుతో తినడం ఎలాగో వివరించిన తీరుకు ప్రేక్షకులు చప్పట్లతో ప్రశంసించారు. కాయగూరలు, కార్బోహైడ్రేట్లను సరైన రీతిలో మేళవించి తినడం అన్నది మినరల్స్‌తో కూడిన ఆరోగ్యవంతమైన, సంపూర్ణ ఆహారమని ఆయన వివరించారు. సుదీర్ఘ శిక్షణా సెషన్ తర్వాత వచ్చిన అలసట నుంచి వంట చేయడం దృష్టి మళ్ళించేందుకు తోడ్పడుతుందని ఆయన చెప్పారు.
సంతులిత ఆహారాన్ని తీసుకోవడం, ఫిట్‌నెస్ కార్యకలాపాల దిశగా యువతకు రెండేళ్ళ కాలంలో 75 పాఠశాలలకు చెందిన విద్యార్ధులకు ప్రేరణ కలిగించేందుకు ఒలింపియన్లను, పారాఒలంపియన్లు వారితో సంభాషించే కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన. ఈ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడలు, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.
ఒలింపిక్స్ అనంతరం మాకు ఆతిథ్యమిచ్చినప్పుడు, ప్రధానమంత్రి ఆరోగ్యవంతమైన, ఫిట్ భారత్ గురించి తన నూతన దార్శనికతను పంచుకున్నారు. ఈ ప్రత్యేక చొరవను ముందుకు తీసుకువెడుతూ, పాఠశాలలను సందర్శించి, నాదైన పద్ధతిలో కొంత జ్ఞానాన్ని విద్యార్ధులతో పంచుకుంటున్నాను. ఈ జ్ఞానం విద్యార్ధులకు తోడ్పడమే కాక, భారత్ క్రీడా దేశం కావాలన్న ప్రధానమంత్రి కలను సాక్షాత్కారం చేస్తుందని నీరజ్ చోప్రా అన్నారు.
ఆయన సరైన ఆహారం, సరైన్ ఫిట్నెస్ పద్ధతితో పాటుగా కొన్ని ముఖ్యమైన జీవిత పాఠాలపై చిట్కాలను పంచుకున్నారు. అతిపెద్ద క్రీడా, ఫిట్‌నెస్ క్విజ్ అయిన ఫిట్ ఇండియా క్విజ్ గురించి కూడా నీరజ్ చోప్రా మాట్లాడారు. కొందరు విద్యార్ధుల సమాధానాలు విని ఆశ్చర్యపోయానంటూ, వారి జ్ఞానాన్ని మెచ్చుకుంటున్నాను. సరైన క్రమశిక్షణ, అంకితభావంతో వారు ఉన్నత ఎత్తులకు ఎదగగలరని ఆయన చెప్పారు.
అంతకు ముందు, నీరజ్ చోప్రాను సంస్కార్‌ధామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సన్మానించింది. సొసైటీ చేస్తున్న పనిని కొనియాడుతూ, విద్యార్ధులు భవిష్యత్తుకు తయారయ్యేలా వారిని సాధికారం చేయడం కోసం వారు కట్టుబడి ఉన్న తీరు, అంకిత భావాన్ని మెచ్చుకున్నారు.
రానున్న రెండు నెల్లో దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న పాఠశాలలను తరుణ్‌దీప్ రాయ్ (ఆర్చరీ), సార్థక్ భంభ్రి (అథ్లెటిక్స్), సుశీలాదేవి (జూడో), కెసి గణపతి, వరుణ్ థక్కర్ (సెయిలింగ్)లు సందర్శించనున్నారు. పారాఒలింపియన్లలో అవనీ లేఖరా (పారా షూటింగ్), భవానీ పటేల్ (పారా టేబుల్ టెన్నిస్), దేవేంద్ర ఝఝారియా (పారా అథ్లిటిక్స్) ఈ చొరవను ముందుకు తీసుకువెళ్ళనున్నారు.
(Release ID: 1778212)
Visitor Counter : 141