ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిఆర్ఐ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్

Posted On: 04 DEC 2021 7:01PM by PIB Hyderabad

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసి) ఆధ్వర్యంలో పనిచేస్తున్న అపెక్స్ యాంటీ స్మగ్లింగ్ ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఈరోజు 64వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది.

 

 

 న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈ ఉత్సవాలను  కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు.   కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి, రెవెన్యూ కార్యదర్శి శ్రీ తరుణ్ బజాజ్, సీబీఐసి  చైర్మన్ శ్రీ వివేక్ జోహ్రీ, సభ్యుడు (ఇన్వెస్టిగేషన్),సీబీఐసి శ్రీ బాలేష్ కుమార్,   డైరెక్టర్ జనరల్, డిఆర్ఐ శ్రీ అలోక్ తివారీస  సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.  

ముఖ్యంగా మహమ్మారి సమయంలో వారి పనితీరు మరియు ప్రశంసనీయమైన సేవకు డిఆర్ఐ, దాని అధికారులను శ్రీమతి నిర్మలా సీతారామన్ అభినందించారు. ప్రమాదాలు ఎదురవుతాయని తెలిసినప్పటికీ సాహసోపేతంగా  వ్యవహరించిన దాదాపు 800 మంది డిఆర్ఐ  బలాన్ని ఆర్థిక మంత్రి ప్రశంసించారు. మహమ్మారి సమయంలో ప్రాణాలు కోల్పోయిన అధికారులు, సిబ్బందికి ఆమె ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

అధికారులు తక్కువ ప్రొఫైల్‌ను కలిగి ఉండవచ్చని, అయితే వారు ముందు వరుస రక్షణ దళాల వలె వ్యవహరిస్తున్నారని, దేశ ఆర్థిక సరిహద్దులను రక్షించడంలో అద్భుతమైన పని చేస్తున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇటీవల డీఆర్‌ఐ వెలికితీసిన భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు, బంగారం, ఎర్రచందనం, ఏనుగు దంతాలు, సిగరెట్లు తదితరాల అక్రమ రవాణా ప్రయత్నాలను ఆర్థిక మంత్రి అభినందించారు. స్మగ్లింగ్‌పై ఈ దుందుడుకు ప్రయత్నాలను మొగ్గలోనే తుంచివేసేలా ఇటువంటి ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యల ద్వారా సందేశం ఉండాలని  శ్రీమతి సీతారామన్ అన్నారు.

 

 

దేశ సరిహద్దులను మరింత సమర్ధవంతంగా పరిరక్షించడంలో చట్ట అమలు మరియు గూఢచార సేకరణ ఏజెన్సీల మధ్య మెరుగైన సమన్వయం మరియు చర్య తీసుకోగల ఇంటెలిజెన్స్‌ను పంచుకోవడం ముఖ్యమని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. డ్యూయల్ యూజ్ టెక్నాలజీ వస్తువులను అడ్డుకోవడంతో పాటు విషపూరిత వ్యర్థాలను మన దేశంలోకి డంపింగ్ చేయడాన్ని నిరోధించడంపై దృష్టి పెట్టాలని శ్రీమతి సీతారామన్ డిఆర్ఐ ని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్మగ్లర్లు మరియు ఆర్థిక నేరగాళ్లపై వారి చర్య ద్వారా ప్రశంసలు తెచ్చిపెట్టిన డిఆర్ఐ అధికారుల కృషిని  ప్రశంసించారు మరియు దేశ నిర్మాణంలో మరియు దేశ ఆర్థిక సరిహద్దులను రక్షించడంలో నిర్వహించిన పాత్రను ప్రశంసించారు.

 

 

ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్, ఇంటర్‌పోల్, యుఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, రీజినల్ ఇంటెలిజెన్స్ లైసన్ ఆఫీస్-ఏషియా పసిఫిక్ ఆఫీస్ - భాగస్వామ్య కస్టమ్స్ సంస్థలు మరియు ఇంటర్నేషనల్ ఏజెన్సీలతో ప్రభావవంతంగా పాల్గొనడం కోసం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను అనుసరించి 7వ ప్రాంతీయ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మీటింగ్ కూడా జరిగింది.
 

 

***


(Release ID: 1778207) Visitor Counter : 167