ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్


మైగవ్ పోర్టల్ ప్రపంచ స్థాయికి
ఎదగాలి: మీనాక్షీ లేఖి
భారతీయ సంస్కృతిని మరింత
విస్తరింపజేయాలన్న కేంద్రమంత్రి..

మైగవ్ సాథీస్.కు, చాలెంజ్ విజేతలకు సత్కారం..
వారి సృజనాత్మకతకు ప్రశంసల జల్లు..

Posted On: 04 DEC 2021 3:23PM by PIB Hyderabad

   ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట,   దేశప్రజలంతా ఒకవైపు 75 వత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటూ ఉన్న తరుణంలో మైగవ్ పోర్టల్ ఈ రోజు దేశ పౌరుల సృజనాత్మక శక్తిని ప్రశంసించింది. మైగవ్ పోర్టల్ చాలెంజ్ పోటీలో ఎంతో చురుగ్గా, నవ్యమైన ఆలోచనా విధానాన్ని పంచుకుని, గుర్తింపు చిహ్నాల (లోగోల) రూపకల్పన ద్వారా తమ భావనలను పంచుకొన్నందుకు, తద్వారా విధానాల, కార్యక్రమాల రూపకల్పనలో ప్రభుత్వానికి సహాయపడినందుకు పోర్టల్ అభినందనలు తెలిపింది.   

    

https://ci4.googleusercontent.com/proxy/SSHiRGJOEzDc3mpYXng0cQl2J_fwQZLNneHZ9d8EbsycHYAd6cau9N8OAkp6ZPVvbq2Mz7Ur10pPRt-Dt7wwOzRimDE4EtynVZDOEDgQ7h_pTMuzKCfilHeCtA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001SFBZ.jpg

  మైగవ్ పోర్టల్ నిర్వహించిన లోగోల పోటీలో విజేతలుగా నిలిచిన వారికి సత్కారం కూడా జరిగింది.కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి మీనాక్షీ లేఖి, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నే, నేషనల్ ఈ- గవర్నెన్స్ డివిజన్  (ఎన్.ఇ.జి.డి.), మైగవ్. పోర్టల్స్ అధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) అభిషేక్ సింగ్; కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అమితేష్ కుమార్ సిన్హా తదితరులు కూడా విజేతలను సత్కరించారు.

  మైగవ్ పోర్టల్.ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 2014 జూలై 26న ప్రారంభించారు. ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండు నెలలకే ఆయన ఈ పోర్టల్.కు శ్రీకారం చుట్టారు. ఆన్.లైన్ లో పౌరుల ప్రమేయంతో కూడిన ప్రధాన వేదికగా, వివిధ ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖల సహకారంతో ఈ పోర్టల్.ను రూపొందించారు. విధాన రూపకల్పనలో పౌరులకు ప్రమేయం కల్పించడం, ప్రజా ప్రయోజనాలకు, ప్రజాసంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం వంటి లక్ష్యాలతో మైగవ్. పోర్టల్.కు రూపకల్పన జరిగింది.

  ప్రధానమంత్రి మోదీ పలుమార్లు చేసిన తన ప్రసంగాల్లోను, 2015 ఆగస్టు 15న ఎర్రకోట బురుజునుంచి చేసిన ప్రసంగంలోను పేర్కొన్నట్టుగా, పరిపాలనా ప్రక్రియలో 'ప్రజల భాగస్వామ్యం' ఉండేలా చూసుకోవడమే మైగవ్ పోర్టల్ లక్ష్యం. బృంద చర్చలు, బహిరంగ వేదికా చర్చలు, ప్రజాభిప్రాయ సేకరణలు, బ్లాగులు, పోటీలు, చర్చలు, తదితర కార్యక్రమాలద్వారా దేశపౌరులకు సాధికారితను మైగవ్ పోర్టల్ కల్పిస్తోంది. జాతీయ స్థాయిలో జరిగే విధాన రూపకల్పనలో ప్రజలు చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ పోర్టల్ ధ్యేయంగా నిర్దేశించారు.  

  2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాలసాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి,..  విధానపరమైన ఆలోచనలను, సూచనలను మైగవ్ వేదిక ద్వారానే సేకరించారు. చాలావరకు అలాంటి ఆలోచనలను అమలులో కూడా పెట్టారు.  స్మార్ట్ సిటీల పథకంపై కూడా మైగవ్ ద్వారా పౌరుల ప్రమేయంతో ప్రధాన చర్చ జరిగింది. దాదాపు 25లక్షలమందికి ఇందులో భాగస్వామ్యం లభించింది; నూతన విద్యావిధానం, నెట్ తటస్థవైఖరి తదితర అంశాలపై కూడా మైగవ్ వేదికగా చర్చలు జరిగాయి.

   స్వచ్ఛభారత్, వందకోట్లమందికి వ్యాక్సినేషన్, డిజిటల్ ఇండియా కార్యక్రమం, జాతీయ విద్యా విధానం వంటి ముఖ్యమైన జాతీయ స్థాయి పథకాలకు గుర్తింపుగా లోగోలు, నినాదాలు వంటివి మైగవ్ వేదికనుంచే అందాయి.

https://ci3.googleusercontent.com/proxy/5NEDK4-oQB4sqYwefAf_Ne1fvGzhwKBtgq1mqzPNiM8M0ISHWuVXqrFHR0TjLLjmRLiOmSqwGh-vEt1Ink6XVaUXsc6iKXTqeXGnryun9hcbxHCzhm_R-BdulQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002QOWC.jpg

  స్వచ్ఛభారత్ పథకం లోగో రూపకల్పనకు సంబంధించి అనంత్ గోపాల్ ఖాస్బర్దార్.ను కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల సహాయమంత్రి మీనాక్షీ లేఖి సన్మానించారు. 2021,.. డిసెంబరు 4వ తేదీన ఆజాదీ డిజిటల్ మహోత్సవ్ కార్యక్రమంలో ఈ సత్కారం జరిగింది. అలాగే, ‘వందకోట్ల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమ లోగో’ను రూపొందించినం యాసిన్ హరూన్ సుదేసరాను,.. ‘లోక్.పాల్’ లోగో సృష్టికర్త ప్రశాంత్ మిశ్రాను, ‘వెదురు పథకం లోగో’ను రూపొందించిన సాయిరాం గౌడ్ ఎడిజీని, ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమ లోగో రూపశిల్పి రాణా భౌమిక్.ను కేంద్రమంత్రి అభినందించారు. ’

   కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో మైగవ్ పోర్టల్ ద్వారా ఎన్నో సేవలందించిన మైగవ్ సహచరులకు (మైగవ్ సాథీస్.కు) కూడా కేంద్రమంత్రి మీనాక్షీ లేఖినుంచి సత్కారం లభించింది. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలకు చెందిన నాగరాజు, ఇండోర్.కు చెందిన అనూప్ మిశ్రా, నాసిక్ కు చెందిన రుషీకేశ్ రాజేంద్ర ఉగాలే, రాయిగనికి చెందిన సంజయ్ సర్కార్, చెన్నైకి చెందిన సుథాహర్ వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఇతర  విభాగాల్లో జోహో యాప్ రూపకల్పనకుగాను,.. పియర్లీన్ అనుగ్రహా, రఘురామ్ బలరామన్.లకు సత్కారం లభించింది. అలాగే,..జయా పరాశర్, శివీ కపిల్ శ్రీశక్తి చాలెంజ్ విజేతలుగా నిలిచారు. ఇండియన్ లాంగ్వేజీ ఇన్నవేషన్ యాప్ చాలెంజిలో అనురాధా అగర్వాల్, ప్రీతేష్ చోథానీ, సురభీ నాయక్ విజేతలయ్యారు.

  ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ యాప్.కు సంబంధించిన సృజనాత్మక పోటీలో అమిత్ శర్మ, అరుణా కుమారి విజేతలుగా నిలిచారు. డ్రగ్ డిస్కవరీ హ్యాకథనాన్ పోటీని డాక్టర్ కాళీరాజన్ రాజగోపాల్ గెలుచుకున్నారు. మైగవ్ వాట్సప్ చాట్.బాట్.లో ఆకృతీ వైష్, కూ యాప్.కు సంబంధించి అప్రమాయా రాధాకృష్ణ, కోపోవర్ కు సంబంధించి అంకుశ్ సబర్వాల్.లకు కూడా సాదర సత్కారం జరిగింది. ‘జనబాగ్దారీ’ సృజనాత్మక చాలెంజ్ పోటీలో అమిత్ కోఠీవాలాకు, పోడ్.క్యాస్ట్.కు సంబంధించి యాషికా బేగ్వానీలకు సత్కారం లభించింది.

https://ci5.googleusercontent.com/proxy/ezZZHO1mMkIY6qpTRNfhalbQ4JFYsboJ0Si11PDZdjRdyeX9RJCfWHlHF9kcmpcxlQS9-cX8USq63SA7dHK5IsXqj79b1O5kpTIDIgbruo2i7c_r2IdG8eoJaw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003Y41C.jpg

  వివిధ కేటగిరీలలో విజేతలుగా నిలిచిన వారందరినీ కేంద్రమంత్రి మీనాక్షీ లేఖి హృదయపూర్వకంగా అభినందించారు. ప్రభుత్వం, పౌరులు పరస్పరం సంప్రదింపులు జరిపేందుకు వీలు కలిగించే మైగవ్ వేదిక కృషికి కూడా ఆమె ప్రశంసలు అందజేశారు. “మైగవ్. వేదికకు శ్రీకారం చుట్టడం ద్వారా మనం మరెంతో మంది ప్రజలకు చేరువగా వెళ్లగలుగుతున్నాం. ఇక్కడ సత్కారం అందుకున్న వారిలో ఎక్కువ మంది సమాజసేవకోసం స్వచ్చందంగా ముందుకు వచ్చినవారే.” అని ఆమె అన్నారు.

  “మైగవ్ వేదికను మరింతగా విస్తృత స్థాయిలో వినియోగించుకోవలసిన అవసరం ఉంది. విధాన రూపకల్పనలో మనమంతా భాగస్వామ్యం వహించాల్సి ఉంది. ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి, మరిన్ని ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవడం అవసరం. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. అందువల్ల, ప్రభుత్వం పౌరులకు చేరువగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే, ప్రజలు కూడా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి అందించడం చాలా అవసరం.” అని ఆమె అన్నారు.

  ఎంతో విశిష్టమైన భారతదేశ సంస్కృతిని గురించి ప్రపంచానికి విస్తరింపజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పౌరులకు ఉందని మీనాక్షీ లేఖి స్పష్టం చేశారు. “మన సామర్థ్యం ఏమిటో, మనం సొంతంగా ఏం చేయగలమో కోవిడ్ సంక్షోభం మనకు తెలియజేసింది. అదే మన మానసిక స్థైర్యాన్ని గొప్పగా ఉంచుతోంది. పరస్పరం ఆహార పంపిణీ ద్వారా, మరిన్ని కార్యక్రమాల ద్వారా మనకు తగిన సహాయం అందిస్తోంది. ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్ లేకుంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అసంపూర్తిగా మిగిలిపోతుంది. ఎందుకంటే,..దేశంలోని ఏదైనా ప్రాంతంగురించి నేను తెలుసుకోవాలనుకుంటే అందుకు మార్గం డిజిటల్ విధానం మాత్రమే. సదరు సమాచారం ఇచ్చేందుకే మైగవ్ పోర్టల్ సిద్ధంగా ఉంటుంది,” అని ఆమె అన్నారు.

   కాగా, మైగవ్ పోర్టల్.ను ప్రపంచ స్థాయి వేదికగా తీర్చిదిద్దాలని ఎన్.ఇ.జి.డి., మైగవ్ పోర్టల్ అధ్యక్షుడు, సి.ఇ.ఒ. అయిన అభిషేక్ సింగ్.ను కేంద్రమంత్రి లేఖి కోరారు. మైగవ్ ఇప్పటికే14 రాష్ట్రాల్లో ఉనికిని నిరూపించుకుందన్నారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, త్రిపుర, చత్తీస్.గఢ్, జార్ఖండ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న మైగవ్ వేదిక ఇకపై ప్రపంచ స్థాయి వెర్షన్.గా రూపుదిద్దుకోగలదని ఆమె అన్నారు.

  ఈ సందర్భంగా, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నే మాట్లాడుతూ, మైగవ్ పోర్టల్.కు అందిన లోగోల శైలిలో సృజనాత్మకత అద్భుతంగా ఉందని అన్నారు.  లోగోలను పంపించి పారితోషికం గెలుచుకున్న విజేతల సృజనాత్మక శైలిని కూడా ఆయన అభినందించారు.  “మైగవ్ పోర్టల్ విషయంలో మాకు అందిన లోగోల సృజనాత్మకశైలి ఎంతో హృద్యంగా ఉంది. పోటీ సందర్భంగా మాకు ఏదైనా మంచి ఆలోచన లేదా లోగో అందినా, దానిపై మేం ఎంతో శ్రద్ధ తీసుకున్నాం. విషయాన్ని వెంటనే ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాం.” అని ఆయన అన్నారు.

  ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నా,  “అందుకు సంబంధించిన సమాచారాన్ని మైగవ్ పోర్టల్ ద్వారా మేం జనంతో పంచుకున్నాం. మాకు అందిన ఆలోచనలను, భావనలను కార్యక్రమాన్ని ఖరారు చేసేందుకు వినియోగించుకున్నాం” అని అన్నారు.

  కోవిడ్-19 మహమ్మారి వైరస్ వ్యాప్తి సమయంలో మైగవ్. పోర్టల్ చేసిన కృషిని అజయ్ సాహ్నే ఎంతగానో ప్రశంసించారు. ఈ వేదిక సరైన సమయంలో ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని అందించిందని, ప్రజలకు ఎంతో అవసరమైన నిర్మాణాత్మక ధోరణిని వ్యాప్తి చేసిందని ఆయన అన్నారు.

   “కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో మైగవ్ పోర్టల్ చేసిన కృషి అద్భుతం. –మాస్కుల ధారణపై అవగాహన కల్పించడంలో, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడంలో మైగవ్.. ఎంతో కృషి చేసింది.  కోవిడ్ వ్యాప్తి కారణంగా విదించిన లాక్ డౌన్ ఆంక్షలతో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత నిరాశానిస్పృహలకు గురికాగా, అలాంటి తరుణంలో సానుకూల వాతావరణాన్ని మైగవ్ సృష్టించింది. పెద్దపెద్ద కళాకారులు ఈ వేదికపైకి వచ్చి తమ సంగీత ప్రదర్శనలను పంచుకున్నారు. అంటే,..కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాదు., ఈ సమాజానికి తమ వంతుగా ఏదైనా ఇవ్వాలన్న తపనతో ప్రజలు కూడా తమ సృజనాత్మకతను వినియోగించారు. మైగవ్ పోర్టల్ అనేది ఇకపై కేవలం వెబ్.సైట్ మాత్రమే కాదు. అది ‘ప్రజా భాగస్వామ్యం’తో కూడిన వేదికగా రూపుదిద్దుకుంది.”  అని అజయ్ సాహ్నే అన్నారు.

 

*****


(Release ID: 1778139) Visitor Counter : 209


Read this release in: English , Urdu , Hindi , Tamil