జల శక్తి మంత్రిత్వ శాఖ

ఉత్తరాఖండ్.లో రూ. 267.66కోట్లతో తాగునీటి పథకాలకు ఓకె!


జలజీవన్ మిషన్ కింద పనుల అమలు..

6 జిల్లాల్లోని 23,000 ఇళ్లకు ప్రయోజనం..

వచ్చే ఏడాదికి పల్లెల్లో 15.18లక్షల ఇళ్లకు
నీటి కుళాయిల ఏర్పాటుకు సంకల్పం..

జలజీవన్ మిషన్ కింద 2020-21లో
కేంద్రం కేటాయింపు రూ.1,443.80కోట్లు.

Posted On: 03 DEC 2021 3:10PM by PIB Hyderabad

  జలజీవన్ మిషన్ పథకం కింద ఉత్తరాఖండ్.లో రూ. 267.66కోట్ల విలువైన తాగునీటి సరఫరా పథకాలకు ఆమోదం లభించిది. ఈ ఏడాది డిసెంబరు 2వ తేదీ జరిగిన ఉత్తరాఖండ్ రాష్ట్రస్థాయి మంజూరు కమిటీ (ఎస్.ఎల్.ఎస్.ఎస్.సి.) సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర పడింది. ఇలా ఆమోదం పొందిన 13 నీటిసరఫరా పథకాలూ బహుళ గ్రామ పథకాలుగానే ఉన్నాయి. ఈ పథకాల ద్వారా పల్లె ప్రాంతాల్లోని 23,000కుపైగా ఇళ్లకు కుళాయిల ద్వారా మంచినీరు అందుతుంది.

  అంటే, గత వారం రోజుల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో ఉన్న 681 గ్రామాలకు రూ. 492.90కోట్ల వ్యయంతో తాగునీరందించే పథకానికి ఆమోదం లభించింది. ఈ రోజువరకూ అందిన సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని 15.18లక్షల గ్రామీణ ఇళ్లలో 7.43లక్షల ఇళ్లకు (అంటే 49శాతం ఇళ్లకు) కుళాయిల ద్వారా నీటిసరఫరా అందుతోంది. ఇక, 2021-22వ సంవత్సరంలో 2.64లక్షల ఇళ్లకు మంచినీటి కుళాయిల కనెక్షన్లు అందించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంకల్పించింది. 

https://ci5.googleusercontent.com/proxy/B9yfHAzn-eGg4wEPeI1m7CwhQ6wAqEi8qa_kMwaY7IJdUaTsVBIj_sx70HuaRIboej1JnzsdDM2kzjasnQCCfvnYoEM2_LIBUoIzoM1w_sOjdHrfQKHCrKoSSQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0014J17.jpg

  జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) నిబంధనల ప్రకారం రాష్ట్ర స్థాయిలో మంజూరు కమిటీ ఏర్పాటుకు అవకాశం కల్పించారు.  గ్రామీణ ఇళ్లకు కుళాయిల ద్వారా మంచినీరు అందించే పథకాలను పరిశీలించి, ఆమోదం తెలిపేందుకు ఈ కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నీటి సరఫరా పథకాలను, ప్రాజెక్టులను ఈ కమిటీ రాష్ట్రస్థాయిలో పరిశీలన జరుపుతుంది. జాతీయ జలజీవన్ మిషన్ (ఎన్.జె.జె.ఎం.) ప్రతినిధికి కూడా ఈ కమిటీలో సభ్యత్వం ఉంటుంది.

 ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నీటిని అందించాలని, ఎంతో దూరం నడిచివెళ్లి నీటిని మోసుకువచ్చే వ్యయ ప్రయాసలనుంచి మహిళలకు విముక్తి కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్న కలలను సాకారం చేసేందుకు 2021-22లో రూ. 360.95కోట్లను ఉత్తరాఖండ్. రాష్ట్రానికి సహాయ గ్రాంటు మొత్తంగా జలజీవన్ మిషన్ విడుదల చేసింది. ఈ పథకం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2019-20వ సంవత్సరంలో రూ. 170.53 కోట్లను కేటాయించింది. ఈ సంవత్సరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెఖావత్ రూ. 1,443.80 కోట్లను కేటాయించారు. అంటే, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ మొత్తం నాలుగు రెట్లకు పెరిగింది. వచ్చే ఏడాది డిసెంబరుకల్లా పల్లెల్లోని ప్రతి ఇంటికీ ఒక నీటి కుళాయిని ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్రానికి అన్ని విధాల సహాయం అందిస్తామంటూ నిధుల విడుదల సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారు.

  2019 ఆగస్టు 15వ తేదీన జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రకటించే నాటికి, కేవలం లక్షా 30వేళ ఇళ్లకు (అంటే 8.58 శాతానికి) మాత్రమే కుళాయిల ద్వారా నీరందుతోంది. కేవలం 27 నెలల్లోనే, కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి, లాక్.డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం 6.13లక్షల ఇళ్లకు (అంటే 40.41శాతానికి) నీటి కుళాయిల కనెక్షన్లను అందించగలిగింది.

  ఈ నేపథ్యంలో జలజీవన్ మిషన్ పథకం అమలును మరింత వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని జాతీయ జలజీవన్ మిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ ఏడాది రాష్ట్రంలోని 2.64లక్షల గ్రామీణ ఇళ్లకు నీటి సరఫరా అందించాలని కోరింది.

  ఈ సంవత్సరం కేంద్రం కేటాయించిన రూ. 1,443.80 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ. 111.22 కోట్లు, 2021-22వ సంవత్సరపు రాష్ట్రం తరఫు మ్యాచింగ్ గ్రాంటు, తదితర మొత్తాలన్నీ కలిపి,. జలజీవన్ మిషన్ అమలుకోసం ఉత్తరాఖండ్ వద్ద రూ. 1,733 కోట్లు అందుబాటులో ఉంది. ఈ విధంగా చూస్తే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ప్రత్యేక నీటి పథకం అమలుకోసం ఎలాంటి నిధుల కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నట్టుగా భావించవచ్చు.

   దీనికి తోడు, మరో వైపు రూ. 256కోట్లు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మంజూరయ్యాయి. 2021-22వ సంవత్సరంలో గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలకు, పంచాయతీ రాజ్ సంస్థలకు నీరు, పారిశుద్ధ్య సదుపాయాల కల్పనకోసం 15వ ఆర్థిక సంఘంతో అనుసధానించిన గ్రాంటుగా ఈ మొత్తాన్ని ఉత్తరాఖండ్.కు కేటాయించారు. తదుపరి ఐదేళ్లవరకూ అంటే, 2025-26వరకూ అనుసంధాన నిధుల కింద రూ. 1,344 కోట్ల మేర సరఫరా అవుతుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో  జలజీవన్ మిషన్ అమలుకోసం పెట్టనున్న ఈ భారీస్థాయి పెట్టుబడితో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఉత్తరాఖండ్  గ్రామీణ ఆర్థిక పరిస్థితికి  తగిన ఊతం లభిస్తుంది. దీనితో గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి అవకాశాలు, ఆదాయ మార్గాలు కూడా గణనీయంగా పెరుగుతాయి

      మరోవైపు.., పథకం అమలులో ప్రజలకు ప్రమేయం కల్పించాల్సిన అవసరం ఉందని ఎన్.జె.జె.ఎం. స్పష్టంచేసింది. మురుగునీటి నిర్వహణ, మరుగుదొడ్లనుంచి వెలువడే వ్యర్థజలం మినహా, మిగతా జల వ్యర్థాల నిర్వహణను కూడా నీటి సరఫరా వ్యవస్థల కింద చేపట్టాలని ఎన్.జె.జె.ఎం. పేర్కొంది. నీటి నాణ్యతా పరీక్షల నిర్వహణకు ఈ పథకంలో అగ్రప్రాధాన్యం ఇచ్చారు. ఒక్కో గ్రామానికి ఐదుగురు చొప్పున మహిళలకు నీటి పరీక్షల నిర్వహణలో శిక్షణ ఇస్తారు. పథకం కోసం ఉపయోగపడే, నీటి వనరుల వద్ద, సరఫరా అందే చోట, క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు నీటిని పరీక్షించడం, ఇందుకోసం క్షేత్రస్థాయి పరీక్షా కిట్లను (ఎఫ్.టి.కె.లను) వినియోగించడం వీరి విధిగా నిర్దేశించారు. ఈ కిట్ల వినియోగంలో ఇప్పటివరకూ 38 వేల మంది మహిళలకు శిక్షణ ఇప్పించారు. రాష్ట్రంలో నీటి పరీక్షలను నిర్వహించే లేబరేటరీల స్థాయిని కూడా నవీకరించారు. నామమాత్రపు ధరతో ప్రజలంతా నీటి నమూనాలను పరీక్షించుకునే సదుపాయాన్ని ఈ లేబరేటరీల్లో ఏర్పాటు చేశారు.

https://ci4.googleusercontent.com/proxy/exhQyzByz_KYwVEwpHhdr-Jkwc6TZLKo7Dk-_nv21yk30F20vi65Yuz7i1fLbNsSNrvjj8xO_bM5Qear09T2lKezEq1tNfiC670--EnPZGP6wQge1oKQ_DmTfQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002W7QR.jpg    

  ఇక,  రాష్ట్రంలోని నీటి నాణ్యత దెబ్బతిన్న జనావాసాలు, ఆశావహ జిల్లాలు, మెదడువాపు వ్యాధి ప్రభావిత జిల్లాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజల ప్రాబల్యం ఉన్న గ్రామాలు, సంసద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్.ఎ.జి.వై.) పథకం అమలులో ఉన్న గ్రామాలు, ఇలా అన్ని గ్రామాలకు జల జీవన్ మిషన్ పథకంలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

    2019వ సంవత్సరంలో ఈ పథకం ప్రారంభమైనపుడు,..దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 19.10కోట్ల ఇళ్లలో కేవలం 3.23కోట్ల ఇళ్లకు (17శాతం ఇళ్లకు) మాత్రమే నీటికుళాయిలు ఉన్నాయి. గడిచిన 27 నెలల్లో కోవిడ్ వైరస్ మహమ్మారి సంక్షోభం, లాక్ డౌన్ ఆంక్షల ద్వారా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, జలజీవన్ మిషన్ పనులు మాత్రం వేగవంతంగానే జరిగాయి. ఇప్పటికే, గ్రామీణ ప్రాంతాల్లోని 5.32 కోట్ల ఇళ్లకు నీటి కుళాయిల ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం మొత్తం 8.56కోట్ల ఇళ్లకు (44.52శాతం ఇళ్లకు) నీటి కుళాయిలు అందుబాటులో ఉన్నాయి. గోవా, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, దాద్రా నాగర్ హవేళీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న పల్లెల్లోని ఇళ్లకు, వందకు వందశాతం నీటి కనెక్షన్లు ఏర్పాటుకు  చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం,..83 జిల్లాల్లోని ప్రతి ఇంటికీ, 1.24లక్షల పైచిలుకు గ్రామాలకు ఇపుడు కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా అవుతోంది. 

 

****



(Release ID: 1777816) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Hindi