సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
స్ఫుర్తి పథకం కన్వర్జెన్స్
Posted On:
02 DEC 2021 2:00PM by PIB Hyderabad
సమీక్షా సమావేశాల నిర్వహణ, క్లస్టర్‌ల సందర్శన మరియు థర్డ్‌పార్టీ మూల్యాంకనం మొదలైన వాటి ద్వారా ఫంక్షనల్ స్ఫుర్తి లాభదాయకత మరియు మార్కెట్‌కు సంబంధించిన ఆంశాలను ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా అంచనా వేస్తుంది. దీని ఆధారంగా క్లస్టర్‌ల మార్కెట్ సామర్థ్యం మరియు లాభదాయకత గమనించబడింది. కొవిడ్ 19 మహమ్మారి కారణంగా వీటికి ప్రత్యేక మద్దతు అవసరం. దీనిని నిర్ధారించడానికి మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి డిజైన్ డెవలప్‌మెంట్ మరియు ఉత్పత్తుల వైవిధ్యంపై శిక్షణ, ఇ-కామర్స్ పోర్టల్‌లతో అనుసంధానాలను ప్రోత్సహించడం మొదలైన అనేక కార్యక్రమాలను మంత్రిత్వ శాఖ చేపట్టింది.
స్ఫుర్తి పథకం దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అయితే ఈ పథకం యొక్క పరిధిని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆమోదించబడిన స్ఫుర్తి క్లస్టర్ మరియు ఆస్పిరేషనల్ జిల్లాలు లేని జిల్లాల నుండి స్వీకరించిన ప్రతిపాదనలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. మంత్రిత్వ శాఖ స్ఫుర్తి పథకాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్ల ఇతర సంక్షేమ పథకాలతో కలిపేలా ప్రోత్సహిస్తుంది. క్లస్టర్‌ల అమలు చేసే ఏజెన్సీలు ఇప్పటికే బ్యాంకు ఖాతాలను తెరిచి, కళాకారులందరికీ సాధారణ మరియు ఆరోగ్య బీమాను అందించాలి.
స్ఫుర్తి కింద హస్తకళాకారులకు కనీస వేతనం పేర్కొనబడలేదు. అయినప్పటికీ సాంప్రదాయ కళాకారుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి మరియు వారి ఉత్పత్తులకు విలువను జోడించడానికి వారికి మౌలిక సదుపాయాలను అందించడానికి, తద్వారా వారి ఆదాయాన్ని స్థిరమైన రీతిలో పెంచడానికి మంత్రిత్వ శాఖ ఈ పథకం కింద అవసరమైన చొరవలను తీసుకుంటుంది.
స్ఫుర్తి క్లస్టర్ ఆమోదం పొందినప్పటి నుండి దాని ఫంక్షనలైజేషన్ కోసం కాలపరిమితి సాధారణ క్లస్టర్‌కు (500 మంది కళాకారుల వరకు) 12 నెలలు మరియు మేజర్ క్లస్టర్‌కు 18 నెలలు (500 కంటే ఎక్కువ మంది కళాకారులు). క్లస్టర్ల ఫంక్షనలైజేషన్ కోసం టైమ్‌లైన్‌కు కట్టుబడి ఉండేలా మంత్రిత్వ శాఖ అమలులో ఉన్న క్లస్టర్‌లను క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది.
ఈ రోజు లోక్‌సభలో కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి శ్రీ నారాయణ్ రాణే లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
*****
(Release ID: 1777354)