నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించిన - పారాదీప్ పోర్ట్ ట్రస్ట్‌

Posted On: 01 DEC 2021 3:08PM by PIB Hyderabad

"హెచ్.ఐ.వి. మహమ్మారి ముగింపు కోసం అందరూ సమానంగా గొంతు కలుపుదాం"  అనే ఇతివృత్తంతో పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ (పి.పి.టి) ఆసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు.   ఈ సందర్భంగా పోర్టు టౌన్‌షిప్‌ లో నివసిస్తున్నవారికి ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు "వాకథాన్‌" నిర్వహించారు.  చైర్మన్ శ్రీ పి.ఎల్. హరనాధ్ ఈ అవగాహన వాకథాన్‌ ను జెండా ఊపి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో, పి.పి.టి. ఉన్నతాధికారులతో పాటు, పి.పి.టి. ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది;  సి.ఐ.ఎస్.ఎఫ్. సిబ్బంది; పారాదీప్ సాక్షరతా సమితి కార్యకర్తలు;   ఎయిడ్స్ పై పనిచేస్తున్న ఎన్.జి.ఓ.(ఐ.ఆర్.డి.ఎంఎస్. మరియు సి.ఏ.ఎస్.డి) లకు చెందిన కార్యకర్తలు.;  సామాన్య ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి గుర్తుగా ఈ వాక్ ధాన్ లో పాల్గొన్న వారందరూ  ఎర్ర రంగు రిబ్బన్లు ధరించారు.

సి.ఏ.ఎస్.డి. / ఐ.ఆర్.డి.ఎం.ఎస్. సహకారంతో ఎయిడ్స్ పరీక్ష శిబిరాన్ని కూడా నిర్వహించి, 56 మందికి పరీక్షలు చేశారు.   పరీక్షా పరికరాలు, సామాగ్రిని ఓ.ఎస్.ఏ.సి.ఎస్. అందించింది.  "మేజర్ పోర్టులలో హెచ్.ఐ.వి. / ఎయిడ్స్  పరీక్షలు చేయాలని" ఎన్.ఏ.సి.ఓ. మరియు ఎం.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం కింద ఒక బాధ్యత గా, పి.పి.టి. ఆసుపత్రి, హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. 

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని తొలిసారిగా 1988 సంవత్సరంలో పాటించారు.  ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేసే దిశగా ముందుకు సాగడానికి ప్రతిస్పందనను పెంచాలని పిలుపునిస్తూ,  ఎయిడ్స్ కళంకానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, హెచ్.ఐ.వి. / ఎయిడ్స్ పై అవగాహనను, జ్ఞానాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా,  ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు,  వ్యక్తులు ఎయిడ్స్ మహమ్మారి పై అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు,

 

*****


(Release ID: 1777190) Visitor Counter : 132


Read this release in: English , Urdu , Hindi