పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక అవసరాలు అవసరమైన వారు, వికలాంగుల ఆదాయం పెంపొందించేందుకు ఆరవ హస్త కళల ప్రాజెక్టును ప్రారంభించిన ఒఎన్‌జిసి

Posted On: 01 DEC 2021 4:11PM by PIB Hyderabad

దేశంలో కళలు,హస్తకళలను ప్రోత్సహించడానికి సీఎస్సార్ ప్రాజెక్ట్టులో భాగంగా చమురు సహజ వాయువుల సంస్థ (ఒఎన్‌జిసి

రూపొందించిన ఆరవ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రాథమికసెకండరీ విద్యా శాఖ మంత్రి శ్రీ బీ.సీ.నగేష్ ప్రారంభించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఒఎన్‌జిసి అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ నగేష్ ఈ రోజు ( 2021 డిసెంబర్ 1) బెంగళూరులో  ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు అవసరమైన  వారువికలాంగులకు బ్లాక్ ప్రింటింగ్ లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న  లక్ష్యంతో ఒఎన్‌జిసి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. కర్ణాటకకు చెందిన ' చిరంతన' అనే  స్వచ్చంధ సేవా సంస్థ సహకారంతో ఒఎన్‌జిసి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. 

సాంప్రదాయ కళలు, హస్త కళలను ప్రోత్సహించడానికి ఒఎన్‌జిసి అమలు చేస్తున్న ఈ కార్యక్రమం నిజమైన స్వేచ్ఛకు అర్థం చెబుతుందని శ్రీ నగేష్ పేర్కొన్నారు. సీఎస్సార్ నిధులతో అమలు జరిగే ఇటువంటి కార్యక్రమాల వల్ల అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అమలు చేస్తున్న చర్యలకు  ఒఎన్‌జిసి తన  సీఎస్సార్ కార్యక్రమాల ద్వారా సహకరించాలని ఆయన కోరారు.  

భారతీయ కళలు, హస్తకళలను ప్రోత్సహించడానికి తమ సంస్థ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఒఎన్‌జిసి సీఎండీ శ్రీ సుభాష్ కుమార్ అన్నారు. సీఎస్సార్ నిధులతో  ఈ ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని అన్నారు. ఆరవ సారి ఇటువంటి ప్రాజెక్టును ప్రారంభించామని ఆయన వివరించారు. దీనివల్ల హస్త కళలకు ప్రోత్సాహం లభించడమే కాకుండా వికలాంగులకు ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. 

ఒఎన్‌జిసి డైరెక్టర్ (హెచ్‌ఆర్) డాక్టర్ అల్కా మిట్టల్ మాట్లాడుతూ అందరినీ కలుపుకొని పోయే సంస్థ అయిన  ఒఎన్‌జిసి సమాజంలోని ప్రతి ఒక్కరి సామర్థ్యాలను పెంపొందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కార్యక్రమాలను అమలు చేస్తున్నఒఎన్‌జిసి స్మారక చిహ్నాల సంరక్షణ, సంగీతం మరియు నృత్యం కళలను ప్రోత్సహించడానికి  అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆమె పేర్కొన్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ భాగంగా ప్రభుత్వ రంగంలో ఉన్న చమురు సంస్థలతో కలిసి ఒఎన్‌జిసి  దేశంలోని  హస్తకళల రంగాన్ని ప్రోత్సహించడానికి వివిధ ప్రాజెక్టులను అమలు చేస్తోంది.  పెట్రోలియంసహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు  2022 ఆగస్టు  15   వరకు దేశవ్యాప్తంగా 75 విభిన్న హస్తకళా ప్రాజెక్టులను నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ అంశంలో ముందంజలో ఉన్న   ఒఎన్‌జిసి  15 ప్రాజెక్ట్‌లకు అమలు చేయడానికి సహకరిస్తోంది. అంతకుముందు ఒఎన్‌జిసి మధ్యప్రదేశ్అస్సాంఒడిశాజార్ఖండ్ మరియు ఉత్తరాఖండ్‌లలో ఐదు హస్తకళల ప్రాజెక్టులను ప్రారంభించింది.

***


(Release ID: 1777027) Visitor Counter : 124


Read this release in: English , Urdu , Hindi