జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని తాగునీటి సరఫరా పథకాలకు రూ. 1,816 కోట్లు కేంద్రం ఆమోదం


పథకాల అమలు వల్ల 20 జిల్లాలలో 3.8 లక్షల గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం.

2020-21లో జల్ జీవన్ మిషన్ కింద రాజస్థాన్‌కు రూ. 10,180.50 కోట్ల కేంద్ర నిధులు కేటాయింపు

Posted On: 30 NOV 2021 4:59PM by PIB Hyderabad

29 నవంబర్, 2021న జరిగిన రాష్ట్ర స్థాయి పథకాల మంజూరు కమిటీ (SLSSC) సమావేశంలో రాజస్థాన్‌కు రూ. 1,816 కోట్ల విలువైన తాగునీటి సరఫరా పథకాలు ఆమోదించారు. ఈ పథకాలు ఆ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉన్న 2,348 గ్రామాలలో కుళాయి నీటి కనెక్షన్‌ను అందిస్తాయి. ఇది 3.8 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్‌లను అందుబాటులోకి తెస్తుంది. ప్రతిపాదనలను ఆమోదించే సమయంలో, రాష్ట్ర స్థాయి పథకాల మంజూరు కమిటీ భూ ధాతు జనిత (జియో-జెనిక్) కాలుష్యంతో ప్రభావితమైన 16 జిల్లాల్లో నీటి నాణ్యత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది, తద్వారా ఈ ప్రాంతాల్లో కుళాయి నీటి సరఫరాను ప్రాధాన్యతగా అందించాలని సంకల్పించింది. ఇందుకు  సౌరశక్తి ఆధారిత పథకాలను వినియోగించుకునేలా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. రాష్ట్రంలో భూ జలవనరుల నిర్వహణ పెంపొందించడానికి, నీటి సరఫరా విభాగం ద్వారా జన వినియోగానికి అనుకూలంగా ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.

జల్ జీవన్ మిషన్ (JJM) కింద, గ్రామీణ గృహాలకు కుళాయి నీటి సరఫరాను అందించడానికి చేపట్టాల్సిన పథకాల పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్ర స్థాయి స్కీమ్ శాంక్షనింగ్ కమిటీ (SLSSC) ఏర్పాటు అయింది. నీటి సరఫరా పథకాలు/ప్రాజెక్టులను పరిశీలించేందుకు SLSSC రాష్ట్ర స్థాయి కమిటీగా వ్యవహరిస్తుంది. భారత ప్రభుత్వం నామినీగా పేర్కొన్న వ్యక్తి జాతీయ జల్ జీవన్ మిషన్ (NJJM)  కమిటీలో ఒక సభ్యునిగా ఉంటారు.

  గ్రామీణ భారతాన ప్రతిఇంటిలో పరిశుభ్రమైన కుళాయి నీటిని అందించడం దూరం నుండి నీటిని తెచ్చుకునే కష్టాల నుండి మహిళలు బాలికలను విముక్తి చేయడం ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆలోచన. దీని అమలు కోసం 2021-22లో రాజస్థాన్‌కు రూ. 10,180.50 కోట్ల సహాయ నిధి కేటాయించబడింది, ఇది గత సంవత్సరం కేటాయింపు కంటే నాలుగు రెట్లు. 2020-21 సంవత్సరానికి  కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలు కోసం కేటాయించిన మొత్తం  రూ. 2,522.03 కోట్లు. ఈ ఏడాది కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర కేటాయింపులను నాలుగు రెట్లు పెంచారు. జల్ శక్తి కేంద్ర మంత్రి ఈ భూరి పెంపుదలకు ఆమోదం తెలుపుతూ 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటిలో కుళాయి నీటి సరఫరాను అందించడానికి అన్నివిధాలా  రాష్ట్రానికి  సహాయపడతామని హామీ ఇచ్చారు.

15 ఆగస్టు 2019న, జల్ జీవన్ మిషన్ ప్రారంభించిన సమయంలో, కేవలం 11.74 లక్షల (11.59%) కుటుంబాలకు మాత్రమే కుళాయిల ద్వారా త్రాగునీటి సరఫరా ఉంది. కోవిడ్ మహమ్మారి, తదనంతర  లాక్‌డౌన్‌ల కారణంగా అంతరాయాలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో 27 నెలలకాలంలో  9.88 లక్షల (9.75%) కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్‌లను అందించారు. ఇప్పటి వరకు, రాష్ట్రంలోని 1.01 కోట్ల గ్రామీణ కుటుంబాలలో, 21.62 లక్షల (21.34%)  ఇళ్లలో కుళాయి నీటి సరఫరా జరుగుతోంది. 2021-22లో  మరో 30 లక్షల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి సరఫరాను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

జాతీయ జల్ జీవన్ మిషన్ JJM అమలు వేగాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సంవత్సరం రాష్ట్రంలోని 30 లక్షల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి సరఫరాను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని  కోరింది. 2021-22లో కేంద్రం కేటాయించిన  రూ. 10,180.50 కోట్లు తో పాటు  మిగులు నిధులు రూ. 863.53 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయి, 2021-22లో రాష్ట్రం య వాటా  మునుపటి సంవత్సరాలలో సరిపోలే రాష్ట్ర వాటా పరిగణన లోకి తీసుకున్నా  రాజస్థాన్‌లో పథకం అమలు కోసం అందుబాటులో ఉన్న హామీ నిధి మొత్తం రూ. 21,830.73 కోట్లు.

 

 ఈ విధంగా, రాజస్థాన్ రాష్ట్రంలో ఈ పరివర్తన పథకం అమలుకు నిధుల కొరత లేకుండా భారత ప్రభుత్వం సహకరిస్తుంది.

 

ఇంకా, రూ. 2021-22లో గ్రామీణ స్థానిక సంస్థలు/పంచాయతీరాజ్ సంస్థలు  నీరు, పారిశుధ్యం కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్‌గా రాజస్థాన్‌కు రూ. 1,712  కోట్లు కేటాయింపులు జరిగాయి. వచ్చే ఐదేళ్లలో అంటే 2025-26 వరకు 9,032 కోట్లు టైడ్ గ్రాంట్/ హామీ నిధులు ఉన్నాయి. రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో ఈ భారీ పెట్టుబడి ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను  బలోపేతం చేసి  గ్రామాల్లో ఆదాయాన్ని పెంచే అవకాశాలు పెంపొందిస్తుంది. సమాజ భాగస్వామ్యం మరియు వాడుక నీటి యాజమాన్యం /గ్రేవాటర్ మేనేజ్‌మెంట్ కలయిక ద్వారా, తాగునీటి వనరులను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం MGNREGS,  స్వచ్చ భారత్ మిషన్ – గ్రామీణ (SBM -G) వంటి ఇతర పధకాల కలయిక తో , జిల్లా మినరల్ డెవలప్‌మెంట్ ఫండ్, 15వ ఆర్థిక సంఘం నీరు,  పారిశుద్ధ్యానికి సంబంధించిన సహాయ నిధిని  గ్రామీణ స్థానిక సంస్థలు /పంచాయతీ రాజ్ సంస్థలకు కేటాయించింది.

 

ఫీల్డ్ టెస్ట్ కిట్‌లను (FTKలు) ఉపయోగించి తాగునీటి వనరులు మరియు డెలివరీ పాయింట్‌లను క్రమం తప్పకుండా  పరీక్షించడం కోసం ప్రతి గ్రామంలో 5 గురు మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా నీటి నాణ్యత పర్యవేక్షణ నిఘా కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటివరకు, 14,162 మందికి పైగా  మహిళలు FTKలను ఉపయోగించడానికి శిక్షణ పొందారు. రాష్ట్రంలో నీటి పరీక్షా ప్రయోగశాలలు ఆధునీకరించారు. సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా ప్రజలు తమ నీటి నమూనాలను నామమాత్రపు రేటుతో పరీక్షించుకోవచ్చు.

జల్ జీవన్ మిషన్ కింద, రాష్ట్రంలో నీటి నాణ్యత-ప్రభావిత నివాస ప్రాంతాలు,  నీటి కాలుష్య కారణంగా వచ్చే  నరాల సంబంధిత రుగ్మతలు- JE/ AES ప్రభావిత జిల్లాలు, SC/ ST మెజారిటీ గ్రామాలు,  సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపిక కాబడిన SAGY గ్రామాలకు ప్రాధాన్యత ఇచ్చారు.. ‘సబ్‌కాసాత్, సబ్‌కావికాస్, సబ్‌కావిశ్వాస్ మరియు సబ్‌కాప్రయాస్’కు అనుగుణంగా పనిచేస్తూ,  రక్షిత తాగునీటిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు జల్ జీవన్ మిషన్ యొక్క నినాదం ‘ఎవరినీ విడువకూడదు’ అని భరోసా ఇస్తుంది, ఇది గ్రామాల్లో రక్షిత తాగునీటి  సరఫరాకు అందరికీ  కుళాయిల అందుబాటు  లక్ష్యంగా చేసుకుంది.

 

2019లో మిషన్ ప్రారంభంలో, దేశంలోని మొత్తం 19.20 కోట్ల గ్రామీణ కుటుంబాలకు 3.23 కోట్ల (17%) మందికి మాత్రమే కుళాయి నీటి సరఫరా ఉంది. గత 27 నెలల్లో, కోవిడ్ మహమ్మారి వల్ల లాక్‌డౌన్ అంతరాయాలు జరిగినప్పటికీ, జల్ జీవన్ మిషన్ వేగంగా అమలు చేశారు, తద్వారా గత 26 నెలల్లో 5.35 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి సరఫరాను అందింది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 8.59 కోట్ల (44.6%) గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి సరఫరా ఉంది. గోవా, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన  అండమాన్ & నికోబార్ దీవులు, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ , డయ్యూ డామన్  గ్రామీణ ప్రాంతాల్లో 100% గృహ కుళాయి నీటి కనెక్షన్‌ని అమలు పరచాయి. ప్రస్తుతం 83 జిల్లాల్లో  1.25 లక్షలకు పైగా గ్రామాల్లో ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి నీటి సరఫరా జరుగుతోంది.

***(Release ID: 1776627) Visitor Counter : 59


Read this release in: English , Hindi , Tamil